నీరద కుటుంబము
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
నీరద కుటుంబము.
ఇది యొక చిన్న కుటుంబము. దీనిలో పెద్ద చెట్లు గుబురు మొక్కలును గలవు. ఆకులు లఘు పత్రములు, ఒంటరి చేరిక, కొన్నిటి పువ్వులు మిధున పుష్పములు. కొన్నిటిలో నేకలింగ పుష్పములును గలవు. తరచు నీ పువ్వులకు ఆకర్షణ పత్రములుండవు. కింజల్కములు చాల గలవు. విత్తనములలో అంకురచ్చదనము గలదు.
- నీరదచెట్లు
- ... దక్షిణ హిందూ దేశమునందును మలబారు నందును విరివిగా నున్నవి. దీని గింజలు ముప్పాతిక అంగుళం పొడగు, అరంగుళము వెడల్పు ఉండును. ఈ గింజలనుండి తీసిన చమురును చర్మవ్యాధులను బోగొట్టుటకును ఇతర జబ్బులకును వాడుదురు.
- కురంగ వాము
- .... చెట్టు గుబురు మొక్క. దీనిలో రెండు రకములు గలవు. ఒకటి తెల్లని పువ్వులను రెండవది కొంచ మెర్రని పువ్వులను బూయును. ఈ రెండవ రకము చట్టే మంచిది. దీనినే తరచుగా బెంచెదరు. దీని కాయలనుండి, గింజలనుండి ఎర్రరి రంగు వచ్చును. ఈ రంగుతో పట్టు బట్టలకు రంగు వేయుదురు. కాయలను ఉడక బెట్టి, గింజలచుట్టునుండి కండ దీసి దానిని నుపయోగించెదరు. దీని గింజలు, వేరు బెరడును ఔషధములలో కూడ వాడుదురు. వేరు, బెరడు జ్వరములకు పని చేయును. గింజల కషాయము శగ రోగముల కిత్తురు.
- కనరు
- ....చెట్టు గుబురు మొక్క. దీని మీద ముండ్లు గలవు. ఆకులు నిడివి చౌక పాకారము.
- పెద్దకనరు
- .... పైదానంత విరివిగా బెరుగుట లేదు. దీని ఆకులు అండాకారముగ నున్నవి.