నువ్వుంటే నా జతగా
2021లో విడుదల కానున్న తెలుగు సినిమా
నువ్వుంటే నా జతగా 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. సాయి అక్షయ ప్రొడక్షన్స్, మ్యాన్ కైండ్ మూవీస్ బ్యానర్‌లపై సుమ కర్లపూడి, రామకృష్ణ బలుసు నిర్మించిన ఈ సినిమాకు సంజయ్ కర్లపూడి దర్శకత్వం వహించాడు.[1] శ్రీకాంత్ బైరోజు, గీతికా రతన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 27 జనవరి 2021న చేశారు.[2]
నువ్వుంటే నా జతగా | |
---|---|
దర్శకత్వం | సంజయ్ కర్లపూడి |
దీనిపై ఆధారితం | 'ద కర్స్‌డ్ కపుల్' నవల ఆధారంగా |
నిర్మాత | సుమ కర్లపూడి, రామకృష్ణ బలుసు |
తారాగణం | శ్రీకాంత్ బైరోజు, గీతికా రతన్, |
ఛాయాగ్రహణం | సుకుమార్ అల్లు |
కూర్పు | కార్తీక్ గుర్రం |
సంగీతం | జ్ఞాని |
నిర్మాణ సంస్థలు | సాయి అక్షయ ప్రొడక్షన్స్, మ్యాన్ కైండ్ మూవీస్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుకథ
మార్చురామ్ (శ్రీకాంత్ బైరోజు), భూమి (గీతికా రతన్) ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఆ పరిస్థితుల కారణంగా ఎలాంటి వేదనను అనుభవించారు. ఆ ఇద్దరి మధ్యా దూరం ఎందుకు పెరిగింది? తిరిగి వాళ్లిదరు ఒక్కటయ్యారా ? లేదా ? అనేదే సినిమా కథ.
నటీనటులు
మార్చు- శ్రీకాంత్ బైరోజు -రామ్
- గీతికా రతన్ - భూమి
- సతీష్ సారిపల్లి
- రఫిక్ష
- రాజశేఖర్ అనింగి
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్లు: సాయి అక్షయ ప్రొడక్షన్స్, మ్యాన్ కైండ్ మూవీస్
- నిర్మాతలు: సుమ కర్లపూడి, రామకృష్ణ బలుసు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంజయ్ కర్లపూడి [3]
- సంగీతం: జ్ఞాని
- సినిమాటోగ్రఫీ: సుకుమార్ అల్లు
- ఎడిటర్: కార్తీక్ గుర్రం
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (23 November 2021). "విభిన్న ప్రేమకథ". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
- ↑ Andhrajyothy (28 January 2021). "ఆకట్టుకుంటున్న `నువ్వుంటే నా జతగా..` ట్రైలర్!". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
- ↑ Telugu One (27 January 2021). "తన నవలను తనే తెరకెక్కించాడు!". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.