నూకాలమ్మ అమ్మవారి దేవాలయం

నూకాలమ్మ అమ్మవారి దేవాలయం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం కాండ్రకోట గ్రామంలో దేవాలయం ఉంది.

నూకాలమ్మ అమ్మవారి దేవాలయం
నూకాలమ్మ అమ్మవారి దేవాలయం is located in Andhra Pradesh
నూకాలమ్మ అమ్మవారి దేవాలయం
నూకాలమ్మ అమ్మవారి దేవాలయం
ఆంధ్రప్రదేశ్ లొ ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E / 17.0531; 82.1695
పేరు
ప్రధాన పేరు :నూకాలమ్మ అమ్మవారి దేవాలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:తూర్పు గోదావరి
ప్రదేశం:పెద్దాపురం,కాండ్రకో
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:నూకాలమ్మ అమ్మవారి దేవాలయం
నిర్మాణ శైలి, సంస్కృతి
దేవాలయాలు మొత్తం సంఖ్య:ఒకటి

ఆలయ చరిత్ర

మార్చు

కాండ్రకోటను పూర్వం కిమీరు అని పిలిచే వారు.కిమ్మీరాసురుడు ఈ ప్రాంతంలో పరమశివుని కోసం తపస్సు చేయడం కోసం వచ్చాడు. అందువల్ల ఈపేరు వచ్చింది తరువాతి కాలంలో కాండ్రుడు అనే రాజు పరిపాలించడం వల్ల క్రాండ్రకోట అని పేరు వచ్చింది.కొన్నివేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని కిమ్మెర అనే స్వార్ధపరుడైన రాజు పరిపాలిస్తూ ప్రజలను రాక్షసంగా అనేక చిత్ర హింసలకు గురిచేసేవాడు. అతను పెట్టె కష్టాలను ఓర్చలేక ప్రజలు సమీపంలో ఉన్న మరొక ధర్మాత్ముడైన మహా రాజు ధర్మకేతుని ఆశ్రయించి రాక్షస రాజు కిమ్మెర బారి నుండి తమను రక్షించమని వేడుకొన్నారు.అంతట ధర్మకేతు మహారాజు ప్రజా సంరక్షణార్ధం కిమ్మేరుని పై యుద్ధం చేసి దురధుష్టవసాత్తూ ఆ భీకర యుద్ధంలో ఓడిపోయారు.ప్రజల యొక్క అవస్థలను చూసి సహించలేని ధర్మకేతు మహారాజు ఎలాగైనా కిమ్మెరుని వధించాలని ఆదిపరాశక్తిని అంకుఠిత దీక్షతో ప్రార్థించాడు. ఆతని తపస్సుకి మెచ్చి ఆది పరాశక్తి అమ్మవారు ప్రత్యక్షమై ఆమె అంశలలోని ఒక అంశను ధర్మకేతు మహారాజుతో పాటు పంపింది. ఆ సహాయంతో ధర్మకేతు మహారాజు - స్వార్ధపరుడు, రాక్షస రాజైన కిమ్మెరుని ఓడించి ప్రజలను కష్టాలనుంచి విముక్తులి చేసి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. ఆ ఆది పరాశక్తి నూకాలమ్మ అమ్మవారు యుద్ధంలో అతని విజయానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతగా ధర్మకేతు మహారాజు శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆ ప్రాంతంలో ఆలయం నిర్మించాడు - అప్పటినుంచి శ్రీ నూకాలమ్మ వారు ఆ రాజ్య దేవతగా ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడే కాండ్రకోట నూకాలమ్మగా కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలువు తీరనిది.[1]

ఉత్సవాలు

మార్చు

పాల్గుణ మాస బహుళ చతుర్దశి రోజున ప్రారంభమై 41 రోజులు అంగరంగ వైభవంగా ఈ జాతర జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తరియిస్తారు.

మూలాలు

మార్చు
  1. "Kandrakota Nukalamma Thalli History – Mana Peddapuram" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-02-22. Retrieved 2020-02-22.