నూతక్కి రాఘవేంద్రరావు

నూతక్కి రాఘవేంద్రరావు తెలుగు కవి, రచయిత. అతను లఘురూప కవితా ప్రక్రియలలో తనకంటూ స్థానం సంపాదించుకున్నాడు . నానో లఘుకవితా ప్రక్రియలో నానో బ్రహ్మశ్రీ ఈగ హనుమాన్ గారి ప్రోత్సాహంతో 16000 పైబడి తెలుగులో నానోలు (తేనెబొట్లు పేరుతొ) వ్రాసి ప్రపంచంలో తోలి అగ్రశ్రేణి నానో కవిగా గుర్తింపు పొందాడు. అతను "ఉల్కలు" కవితాసంకలనం రచించి ప్రచురించాడు. 1962లో తన పదహారవ ఏటనే చైనాదురాక్రమణ (బుర్రకథ), సామాజిక సమస్యలపై సంఘం నాటకం, నౌకర్ల విజయం నాటిక, వ్రాసి ప్రదర్శించి 1963 లో ప్రచురించాడు. 2007 నుండి బ్లాగులలోనూ , 2009 నుండి ముఖపుస్తకం (పేస్ బుక్) లోను నిరంతర సాహిత్య సేద్యం వీరి ప్రవృత్తిగా మారింది. వృత్తిరీత్యా సాంకేతిక నిపుణునిగా ఉన్న అతను ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగిగా ఉన్నాడు. అతను లఘురూప కవితావేదిక ,తెలంగాణ విభాగమునకు అధ్యక్షునిగా ఉన్నాడు.

నూతక్కి రాఘవేంద్రరావు

లఘురూప కవితా ప్రక్రియలు సవరించు

 • చక్కెరకేళీలు
 • అణువులు
 • విస్మయాలు
 • త్రిపదలు
 • పనసతొనలు
 • సకినాలు
 • క్లుప్తా క్షరి

అనుసరణ ప్రక్రియలు సవరించు

 • తేనెబొట్లు నానానోలు తెలుగులో 16000 పైచిలుకు .
 • ఆంగ్లము లో నానోలు ,..Hony Drops 300 దాటి
 • హిందీలో నానోలు ...మధుబూంద్ 300 దాటి
 • రెక్కలు : 500 దాటి
 • హైకూలు : 200 దాటి
 • ఫెంటోలు : 1000 దాటి
 • "మావి చివురులు నా కోకిలమ్మ పదాలు" (ఆరుద్ర కూనలమ్మ పదాలకు అనుకరణ )

మూలాలు సవరించు