నూనెగింజలలోని పీచు శాతం

పేచు (Fibre/fiber) అనునది మొక్కల కణనిర్మాణంలోని భాగం.ఇది కార్బోహైడ్రేటెలను కలిగివున్న సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, లిగ్నిన్ల నిర్మితం.పీచు కొంత మేరకు కణాల పంజరం (skeleton) వంటిది.కనుక ఇది నూనె గింజలలోకూడా వుంటుంది.అయితే పీచులో అత్యధిక భాగం (50% వరకు జీర్ణంకావు).పేచు పదార్థాలు జీర్ణకోశం లోజీర్ణప్రక్రియకు లోను కాకుండగా విసర్జింపబడును.అందుచే నూనెగింజలలో పీచు పదార్థం శాతం పెరుగు కొలది ఆ మేరకు దాని పోషక విలువ తగ్గుతుంది.అందుచే నూనెగింజలలో పేచుపదార్థశాతం 5-6% మించివుండరాదు.ఆయిల్ కేకులలో కేకు రకాన్ని బట్టి 5-9% వరకు వుండును.క్రూడ్ ఫైబరు అనగా సజల సల్ఫ్యూరిక్, సజల సోడియం హైడ్రక్సైడులతో పదార్థాన్ని మరగించి వడపోయగా మిగిలిన పేచు పదార్థము.ఇది పదార్థములోని అసలు పేచుపదార్థంలో సగంకాని అంతకు మించికాని వుండును.


ముడిపీచు శాతం ను నిర్ణయించుట మార్చు

పరికరములు మార్చు

1.B24 మూతి కలిగిన,500మి.లీ.ల కొనికల్ ఫ్లాస్కు లెదా ఎర్లెన్మెయిర్ ఫ్లాస్కు.

2.B25కోన్ (cone) గల ఎయిర్ కండెన్సరు లేదా లెబెగ్ కండెన్సరు 600మి.మీ.పోడవు ఉంది.

3.12.5 సెం.మీ.వ్యాసం వున్న పింగాణి బుచ్‍నెల్ గరాటు (Buchnel funnel)

4.వ్యాక్యుం పంపు.

5.సక్షన్ ఫిల్టరింగ్ కొనికల్ ఫ్లాస్కు,500మి.లీ.కెపాసిటి ఉంది.

6.నెం.541 వాట్ మాన్ ఫిల్టరు పేపరు,12.5 సెం.మీ.వ్యాసం ఉంది.

7.హట్‍ప్లేట్/హిటరు విద్యుతుతో పనిచేయునది.

8.అనలైటికల్ బాలెన్స్:200 గ్రాం.లకెపాసిటి ఉంది.0.1మి.గ్రాం.వరకు కచ్చితంగా తూకపు విలువ చూపగలిగినది.

9.500మి.లీ.బీకరులు.

10.ఎయిర్ ఒవన్:

రసాయన పధార్దములు మార్చు

1.సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం:1.25% (W/V, అనగా 0.255 (N) నార్మాలిటి ఉంది.

2.సజల (Dilute) సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణము:1.25% (W/V),0.313 (N) నార్మాలిటి ఉంది.

3.పెట్రొలియం ఈథరు:మరుగు ఉష్ణోగ్రత 650C కన్న తక్కువ ఉంది.

4.యిథైల్ ఆల్కహల్:95%

5.డిస్టిల్ వాటరు.

ప్రయోగ విధానము మార్చు

పరీక్షించ వలసిన పదార్థమును మొదట పౌడరుగా చేసి, బాగా కలిపి అందునుండికొంత నమూనాను తీసుకోవాలి .నూనె గింజలలోని/ఆయిల్ కేకులలోని నూనెను సాక్సెహెలెట్ ఎక్స్ ట్రాక్సన్ పద్ధతిలో నూనెను తొలగించిన తరువాత మాత్రమే క్రూడ్ ఫైబరు పరీక్షను చెయ్యాలి.అందుచే పెట్రొలియం ఈథరు నుపయోగించి సాక్స్ హెలెట్ విధానంలో నూనెను తోలగించి, ఒవన్ లో వుంచి డ్రై చేయాలి.ఇలా డిఆయిల్డ్ చెయ్యబడి, డ్రై చేయబడిన సాంపిల్ ను 2.5 గ్రాం.ల వరకు కచ్చితంగా తూచి, భారాన్ని నమోదు చేసి, సాంపిల్ పదార్థాన్ని B24మూతి వున్న కొనికల్ ఫ్లాస్కు/ఎర్లెన్ మెయిర్ ఫ్లాస్కునకు చేర్చాలి.ఫ్లాస్కులో అంతకు ముందే వేడి చేసి సిద్ధంగా వుంచిన 200 మి.లీ.ల 1.25% సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని చేర్చి, రిప్లెక్సు లేదా లెబెగ్ కండెన్సరును ఫ్లాస్కుకు అమర్చి వెంటనే హీటరును ఆన్ చేసి ఆమ్లద్రవాన్ని వేడి చెయ్యడం ప్రారంభించాలి.అంతకు ముందే వేడి చేసి సిద్ధంగా వుంచుకున్న ఆమ్లాన్ని చెర్చడం వలన ఆమ్లం ఒక నిమిషాంలోపే వేడెక్కి మరగడం మొదలగును.ఆమ్లద్రవంలో సాంపిల్ పదార్థం మరుగుచున్నప్పుడు మధ్యమధ్యలో ఫ్లాస్కును కదుపుతూ ఫ్లాస్కు యొక్క లోపలి గోడ అంచులకు పట్టిన సాంపిల్ను ఆమ్లద్రవంలోకి జారెలా చేస్తుండాలి.ఇలా సరిగా (Exactly) ఒక అరగంట (30నిమిషాలు) వేడి చెయ్యాలి.ఈ లోపు బుచ్‍నల్ ఫన్నల్ లో నెం.541 ఫిల్తరు పేపరును ఆమర్చి, ఫన్నల్ ను సక్షన్ కొనికల్ ఫ్లాస్కు మూతికి బిగించి దానిని వ్యాక్యుం పంపుకు అనుసంధానం చెయ్యాలి.వ్యాక్యుం పంపును ఆన్ చేసి, వ్యాక్యుం క్రియెట్ చేసి, ఫ్లాస్కులోని ఆమ్లద్రవాన్ని బుచ్‍నల్ ఫన్నల్ లో వున్న ఫిల్టరుపేపరు మీదకు చేర్చాలి.వ్యాక్యూం వలన ఫిల్టరు త్వరగా అగును.ఇప్పుడు ఫిల్టరు పేపరు మీద వున్న పదార్థములోని ఆమ్లం పూర్తిగా తొలగి పొయ్యేవరకు డిస్టిల్ వాటరు వాషింగ్సు ఇవ్వాలి.వాషింగ్సు ఆమ్లరహితమైనది లేనిది తెలుసుకొనుటకై బ్లూ లిట్మస్ కాగితం నుపయోగించి నిర్దారణ చేసుకోవాలి.ఫిల్టరు పేపరుమీది పదార్థము ఆమ్లరహితమైనదని నిర్దారణ చేసుకున్న తరువాత ఫిల్టరు పేపరు మీది పదార్థమును జాగ్రత్తగా మరో 500మి.లీ.ఎర్లెనెర్ /కొనికల్ ఫ్లాస్కునకు చేర్చాలి.అంతకు ముందే వేడిచేసి సిద్దముగా వుంచుకున్న 200 మి.లీ.ల 1.25% సోడియం హైడ్రక్సైడ్ ద్రవాని ఎర్లెన్ మెయిర్ ఫ్లాస్కునకు చేర్చాలి.ఫ్లాస్కునకు కండెన్సరు అమర్చి వెంటనే ఫ్లాస్కును వేడిచెయ్యడం ప్రారంభించాలి.సరిగ్గా ఒక అరగంట (30 నిమిషాలు) వేడిచెయ్యాలి.వేడి చెయ్యునప్పుడు మధ్యమధ్యలోఫ్లాస్కును కదుపుచుండవలెను.అదే సమయంలో ఒక నెం.541 ఫిల్టరు పేపరును డ్రై చేసి, చల్లార్చి దాని భారాన్ని తూచి నమోదు చేయాలి.ఫిల్టరు పెపరును బుచినల్ ఫన్నల్ లో అమర్చివ్యాక్యుం సిస్టానికి ఇంతకు ముందులాగా కలిపి వుంచాలి. అరగంట బాయిలింగ్ తరువాత, ఫ్లాస్కులోని ద్రవాన్ని ఫన్నల్ లోని ఫిల్టరుపేపరులో వేసి వ్యాక్యుం పంప్ ఆన్ చేయాలి.ఫిల్టరు పేపరు మీది పదార్థములోని సోడియం హైడ్రాక్సైడ్ పూర్తిగా తొలగి పొయ్యేవరకు డిస్టిల్ వాటరు వాషింగ్స్ యివ్వాలి.క్షారము తొలగింపబడినది లేనిది తెలుసుకొనుటకై ఎర్ర లిట్మస్ పేపరునుపయోగించాలి.లిట్మస్ పేపరునువాషింగ్ వాటరులో ముంచిన రంగు మారనిచో క్షారం తొలగింపబడినదని ఆర్ధము.యిప్పుడు ఫిల్టరు పేపరునుపదార్థముతో సహ జాగ్రత్తగా మడచి ఎయిర్ ఒవన్ లో వుంచి డ్రై చేయాలి.ఫిల్టరు పేపరు పదార్థముతో సహ డ్రై అయిన తరువాత బయటకు తీసి డెసికెటరులో చల్లార్చి, దాని భారాన్ని తూచి నమోదు చేయాలి.అంతకు ముందే ఒక సిలికా క్రుసిబుల్ ను తూచి దాని బరువును నమోదు చేయాలి.ఇప్పుడు ఫిల్టరు పేపరును పదార్థముతో సహ సిలికా క్రుసిబుల్ లో వుంచి, దాన్ని 500-6000C ఉష్ణోగ్రత వద్దనున్న మఫుల్ ఫర్నెష్ లో వుంచి క్రుసిబుల్ లోని ఫిల్టరు పేపరు+పదార్థము తెల్లని బుడిదగా మారేవరకు వుంచాలి.ఇప్పుడు కౄసిబుల్ ను మఫుల్ ఫర్నెష్ నుండి బయటకు తీసి, డెసికేటరులో చల్లార్చి తూచి దానిభారాన్ని నమోదు చేయాలి.

పీచు(crude Fibre)శాతం మార్చు

 

వివరణ

W=పరీక్షించుటకై తీసుకున్న పదార్థభారం, గ్రాం.లలో.

M1=క్రుసిబుల్+పదార్థభారం, గ్రాం.లలో

M= బూడిదతో క్రుసిబుల్ భారం, గ్రాం.లలో

పొటొగ్యాలరి మార్చు

 
వ్యాక్యుం సిష్టంతో ఫిల్టరు చెయ్యడం