నూనెలోని వ్యాక్సు శాతం
ఈ పరీక్షా విధానాన్ని నూనెగింజల నుండి నూనెతీయు మిల్లులలో, అలాగే అయిల్ కేకు (oil cakes) లనుండి నూనె తీయు సాల్వెంటు ప్లాంటు పరిశ్రమల్లోని ప్రయోగశాలల్లో నిర్వహిస్తారు
వ్యాక్సు శాతం నిర్ణయించుట
మార్చుసాధారణ ఉష్ణోగ్రత వద్ద వ్యాక్సు (మైనపు పదార్థాలు, Waxes) లు మిథైల్ యిథైల్ కిటోన్ లో కరుగవు.అవక్షేపంగా ఏర్పడును. ఇలా ఏర్పడిన అవక్షేపాన్ని ఫిల్టరు ద్వారా వేరుచేసి వ్యాక్సు శాతాన్ని లెక్కించెదరు.
పరికరాలు
మార్చు1. బీకరు: 500 మి.లీ.ల కెపాసిటి ఉంది.
2. సపరెటింగ్ ఫన్నల్: 500 మి.లీ. ల కెపాసిటి ఉంది.
3.మెగ్నటిక్ హిటారు: తగు ఉష్ణోగ్రత వరకు వేడి చేయునది. ఈ హీటరులో స్టిర్రరు అవసరంలేకుండా బీకరులోని నూనెను కలియబెట్ట వచ్చును.
4.ఐస్ బాక్సు: సపరెటింగ్ ఫన్నల్ లోని మిశ్రమాన్ని వుంచుటకు తగిన పరిమాణం ఉంది..
5. ఫ్రీజ్: (శీతలీకరణ పరికరం)
6. ఎనలైటికల్ బ్యాలెన్సు: 200గ్రాం .ల. వరకు తూచునది,0.01 మి.లీ.గ్రాం.వరకు కచ్చితంగా తూచునది.
7. ఫిల్టరు పేపరు: వ్యాట్‌మాన్ నెం.1 ఫిల్టరు పేపరు.
8. ఎయిర్ ఒవన్: 60-70 0C ఉష్ణోగ్రతవద్ద నియంత్రణలో ఉంది.
9.డెసికెటరు:గాలి తగలకుండ వస్తువులను చల్చార్చు పరికరం
రసాయన పధార్దాలు
మార్చు1.మిథైల్ యిథైల్ కిటొన్ (M.E.K.) : రసాయనికంగా శుద్ధమైనది.
పరీక్షించు విధానం
మార్చుశుభ్రమైన, మలినాలు లేని, తేమలేని నూనె/కొవ్వును 25-30 గ్రాం.ల మధ్య బీకరులో తీసుకొని, కచ్చితంగా తూచి, దాని బరువును నమోదు చేసి, దానికి 100 మి.లీ.ల మిథైల్ యిథైల్ కిటొన్ కలిపి, 300C వద్ద మెగ్నటిక్ హీటరుమీద 30 నిమిషాలు వేడి చెయ్యాలి.తరువాత బీకరులోని మిశ్రమాన్ని ఒక సపరెటింగ్ ఫన్నల్‌కు చేర్చాలి.సపరెటింగ్ ఫన్నల్‌లోని ద్రవాన్ని గదిఉష్ణోగ్రత చేరు వరకు చల్లార్చాలి. యిప్పుడు సపరెటింగ్ ఫన్నల్‌ను ఒక ఐస్ బాక్సులో వుంచి పైన మూత పెట్టాలి.ఐస్ బాక్సులో ఫన్నల్ కనీసం 15 నిమిషాలు తక్కువ కాకుండగా వుంచాలి.మధ్యలో 5 నిమిషాలకొక పర్యాయం సపరెటింగ్ ఫన్నల్‌ను కదుపుతూ వుండాలి.సపరెటింగ్ ఫన్నల్‌లోని మిశ్రమ ద్రవం రెండు వేరు భాగాలుగా ఏర్పడును.సపరెటింగ్ ఫన్నల్‌లోని దిగువన భాగం వ్యాక్సును కలిగి వుండును.ఐస్ బాక్సునుండి సపరెటింగ్ ఫన్నల్‌ను తీసిన వెంటనే, అంతకు ముందే తూచి భారాన్ని నమోదు చేసి వుంచి, ఫన్నల్‌లో వుంచిన ఫిల్టరు పేపరులో పొయ్యాలి.ఫన్నల్ దిగువన ఒకబీకరు వుంచాలి.ఫిల్టరు అయ్యిన మిథై యిథై కిటొన్+నూనె ఈ బీకరులో జమ అగును. ఇప్పుడు ఫిల్టరు పేపరు మీద వున్న పదార్థానికి 2,3 సార్లు 20 మి.లీ.ల మిథైల్ యిథైల్ కిటొన్ వాషింగ్స్ ఫిల్టరు పేపరు మీద ఎమైన నూనె మిగిలి వుండే తొలగింపబడు వరకు యివ్వాలి.వాషింగ్స్ అయ్యాక ఫిల్టరు పేపరును జాగ్రత్తగా మడచి 60-700C వద్దనున్న ఎయిర్ ఒవన్‌లో కనీసం 30 నిమిషాలు వుంచాలి. ఫిల్టరు పేపరును ఒవన్ నుండి తీసి, డెసికెటరులో చల్లార్చి, తూచి, భారాన్ని నమోదు చెయ్యాలి.
నూనెలో వ్యాక్సుశాతం
మార్చు100 (A-B) / W
వివరణ
A = ఫిల్టరు పీపరు+వ్యాక్సు భారం, గ్రాం.లలో
B = ఖాళి ఫిల్టరు పేపరు భారం, గ్రాం.లలో
/ = భాగహరపు గుర్తు
W = పరీక్షకై తీసికున్న నూనె భారం .గ్రాం.లలో
సెంట్రి ఫ్యూజ్ విధానం
మార్చునూనెలోని వ్యాక్సును సెంట్రి ఫూజ్ (అపకేంద్రియ యంత్రం) (centrifuge) నుపయోగించి కూడా కనుగొనవచ్చును[1].3.0-5.0 గ్రాం.ల నూనెను కచ్చితంగా తూచి,50 మి.లీ.ల సెంట్రిఫూజ్ గాజుగొట్టం (centrifuge tube) లో తీసుకొని, దానికి 50 మి.లీ.ల మిథై యిథైల్ కిటొన్‌ను కలిపి, ఫ్రీజ్‌లో 30 నిమిషాలు చిల్లింగ్‌చేసి/శీతలీకరించి, తరువాత సెంట్రిఫూజ్‌లో వుంచి సెంట్రీఫుగెసన్ చేసిన, నూనెలోని వ్యాక్సు ట్యూబ్ అడుభాగంలో సెటిల్ అగును.ట్యూబ్‌లోని పైభాగపు నూనె+M.E.K. (methyl ethyl ketone) ను తీసి వేసి,2,3 సార్లు M.E.K.తో వాషింగ్సు యిచ్చి, ట్యూబ్‌లోని వ్యాక్సును డ్రై చేసి, తూచి, భారాన్ని నోట్/నమోదు చెయ్యాలి.
వ్యాక్సు శాతం
వివరణ
- W1=వ్యాక్సు భారం
- W= నూనె భారం
మూలాలు
మార్చు