నూనె గింజలలోని నూనె శాతం
నూనె గింజలలోని, నూనెగింజల నుండి ఎక్సుపెల్లరులు అనేయంత్రాల ద్వారా తీస్తారు. అయిల్‍కేకులో ఇంకను మిగిలివున్న నూనెశాతాన్ని లెక్కింగుటకు సాక్సుహెలెట్ ఎక్సుట్రాక్షన్ (soxhlet extraction) పద్ధతిలో నూనెశాతాన్ని కనుగొనెదరు[1] .నూనెలన్నియు హైడ్రొకార్బన్ ద్రావణులలో సులభంగా కరుగులక్షణాన్ని కలిగివున్నయి.ఈథర్, పెట్రొలియంఈథర్, బెంజిన్, అసిటోన్, హెక్సెన్ వంటి ద్రావణులలో నూనెలన్నియు కరుగును. అందుచే ప్రయోగశాలలో పెట్రొలియం ఈథర్ లేదా యిథైల్ ఈథర్ లేదా హెక్సెనును ద్రావణిగా ఉపయోగించి నూనెగింజల నుండి నూనెను తీసి, నూనెశాతాన్ని లెక్కించెదరు. నూనెగింజల నుండి యధాతదంగా నూనెను ద్రావణిలోకరగించడం కష్టం. అందుచే నూనెగింజలను ముందుగా చేతిగ్రైండరు (hand grinder) లేదా మిక్సిలో పౌడరుగాచేసి, తరువాత దిగువ పేర్కొన్న ప్రయోగపద్ధతిలో నూనె తీయుదురు.
నూనె శాతంను నిర్ణయించుట
మార్చుపరికరాలు
'1. సాక్సుహెలెట్ ఎక్సుట్రాక్సన్ పరికర సముదాయం'
a. చదునైన అడుగుభాగం, ఎత్తుతక్కువ మెడవున్న 250 మి.లీ. కెపాసిటి రిసివర్‍ఫ్లాస్క్ (250ml capacity, shortneck, flat bottom receiver flask).
b.100 మి.లీ.కెపాసిటివున్న సాక్సుహెలెట్ ఎక్సుట్రాక్టరు, B40 కోను, B24 సాకెట్ వున్నది (100ml capacity soxhlet extractor, with B40 socket and B24 cone)
C. అలిన్ కండెన్సరు, B40 సాకెట్ ఉంది. (allihn condenser with B40 socket).
d. సాక్సుహెలెట్ మాంటిల్ హీటరు లేదా వాటరు బాత్ (soxhlet mantle heater or water bath).
e. అనలైటికల్ బాలెన్సు (Analytical Balance) : 200 గ్రాం.ల కేపాసిటి ఉంది. 0.010 మి.గ్రాం.వరకు కచ్చితంగా తూచగల్గినది.
f. డెసికెటరు: గాజుది. రిసివర్ ఫ్లాస్కులను చల్లార్చుటకై.
g. ఎయిర్ ఒవన్: రిసివరును 1050C ఉష్ణోగ్రతవద్ద నిలకడగా వుంచునది
రసాయనిక పదార్థములు:
a. యిథైల్‍ఈథర్ (ethyl ether), లెదా పెట్రొలియంఈథరు, లేదా హెక్సెను.
నూనెగింజల నుండి నేరుగా ఆయిల్‍ను ప్రయోగశాలలో తీయుటకు చాలాసమయం పడుతుంది. ఆందుచే మొదట పరీక్షించవలసిన నూనె గింజలను చేతి గ్రైండరులేదా మిక్సిలో మెత్తటి పౌడరులో చేయుదురు. ఇలా దాదాపు 50-100 గ్రాం.ల వరకు చేసి, పౌడరును బాగాకలిపి అందునుండి 8-10 గ్రాం.ల వరకు పరీక్షించుటకు తీసుకొనెదరు. పరీక్షించుటకై 8-10 గ్రాం.ల నూనెగింజల పొడిని వాట్‍మాన్ నెం,1 లో తీసుకొని, దాని భారాన్ని తూచి, దాని కచ్చితమైన భారాన్ని (0.01 మి.గ్రాం, వరకు) నమోదు చెయ్యాలి. ఫిల్టరు పేపరును జాగ్రత్తగా పోట్లంలా, లోపలి సాంపిల్ ఒలికి పోకుండగా చుట్టాలి. ఇప్పుడు ఈ పొట్లాన్ని సెల్యులోజ్ థింబుల్‍లో వుంఛడం కాని, లేదా మరో ఫిల్టరు పేపరును పైన మరోసారి చుట్టి పొట్లం విడిపోకుండగా, దారం చుట్ట్టి కట్టవలెను. ఇప్పుడు ఈపొట్లాన్ని సాక్సుహెలెట్ ఎక్స్ ట్రాక్టరులో (సిలిండరికల్ భాగం) వుంచాలి. శుభ్రంగా వున్న ఖాళి రిసివరు ఫ్లాస్కును తీసికొని తూచి దాని కచ్చితమైన భారాన్ని నమోదు చెయ్యాలి. రిసివర్ ఫ్లాస్క్‍లో 150-170 మి.లీ. వరకు యిథైల్ ఈథరు, లేదా పెట్రొలియం ఈథరు లేదా హెక్సెనులలో ఎదోఒకటి తీసుకొనవలెను. రిసివరుమూతికి ఎక్సుట్రాక్టరు, ఎక్సుట్రాక్టరుకు కండెన్సరు బిగించాలి. ఈ పరికరసముదాయన్ని మాంటిల్ హీటరు పై వుంచాలి. కండెన్సరుకు నీటి సరాఫరా వుండాలి. ఇప్పుడు హీటరును ఆన్ చెయ్యాలి. హీటరు వలన రిసివరు ఫ్లాస్కులోని ద్రావణి ( ఎదైన ద్రవాన్ని, లెదా ఘన పదార్థం లేదా వాయువును తనలో కరగించుకొను ద్రవాన్ని ' ద్రావణి ' (solvent) అంటారు.) ఆవిరిగా మారి ఫ్లాస్కునుండి ఎక్స్ ట్రాక్టరుకు పక్కన వున్న మందపాటి గొట్టం ద్వారా కండెన్సరు చేరును.కండెన్సరు వెలుపలి గోట్టంలో చల్లని నీరు ప్రవహించడం వలన, కండెన్సరు లోపలి గొట్టంలోని ద్రావణి వేపరులు చల్లబడి ద్రవంగా మారి, ఎక్స్‍ట్రాక్టరులోని సాంపిల్ పొట్లంవుంచిన స్తుపాకారపు గోట్టంలో పడును. ఎక్సుట్రాక్టరు యొక్క స్తూపాకారపు భాగంనకు ఒకవైపున సైపన్ వుండును.సైపనుఎత్తుకు ద్రావణి స్తుపాకారపుభాగంలో నిండగానే సైపన్ ద్వారా ద్రావణి రిసివరు ఫ్లాస్కులో పడును. ఎక్సుట్రాక్టరులో వుంచుసాంపిల్ పొట్లం ఎత్తు సైపన్ కన్న ఎక్కువగావుండరాదు. ఎక్సుట్రాక్టరులో పడినద్రావణి, స్తుపాకారపు గొట్టంనిండుసమయంలో పరీక్షకై తీసుకున్న పదార్థంలోని నూనె ద్రావణిలో కరగును. సైపన్ నిండినప్పుడు ద్రావణి తోపాటు నూనె రిసివరుఫ్లాస్కులో పడును. నూనె మరుగుఉష్ణోగ్రత 4000C కన్న ఎక్కువవుండును. ద్రావణి మరుగుఉష్ణోగ్రత 60-70 0C వుండును. అందువలన ఎక్సుట్రాక్షన్ సమయంలో రిసివరు ఫ్లాస్కు నుండి కేవలం ద్రావణి మాత్రమే ఆవిరిగామారి కండెన్సరుకు, అక్కడ చల్లబడి ఎక్సుట్రాక్టరుకు, అక్కడనుండి సైపన్ నిండినప్పుడు తిరిగి రిసివరు ఫ్లాస్కును చేరును. ఇలా పలు పర్యాయాలు జరగడంవలన, క్రమంగా పదార్థంలోని నూనె రిసివరులో జమఅగును. ఈ విధంగా ఎక్సుట్రాక్షన్‍ను 4-5 గంటల వరకు జరుపవలెను. ఆయిల్ కేకులకైన 3-4 గంటలు, డిఆయిల్డ్ కేకులకు అయినచో 2-3 గంటల ఎక్సుట్రాక్షన్ సమయం సరిపోతుంది. ఎక్సుట్రాక్షను పూర్తయ్యక, ఎక్సూట్రాక్టరులోని సాంపిల్‍పొట్లాన్ని తీసివేసి, మరల ఎక్స్‍ట్రాక్షన్ కొనసాగించి, ఎక్స్ ట్రాక్టరులోని స్తుపాకారపు భాగంలో నిండు ద్రావణిని సైపన్ లెవల్‍కు రాకముందే బయటకు తీసివేస్తూ వచ్చినచో, రిసివరులో కేవలం నూనె మాత్రమే మిగులును. రిసివరులోని ద్రావణిని తొలగించిన తరువాత నూనెవున్న రిసివరు ఫ్లాస్కును 1050 C కలిగివున్న ఎయిర్‍ఒవన్ లో వుంచాలి. ఇలా ఎయిర్‍ఒవన్‍లో వుంచడం వలన నూనెలోవున్న ద్రావణి అవశేషాలు తొలగింపబడును. ఎయిర్‍ఒవన్‍లో రిసివరు ఫ్లాస్కును ఒకగంటసేపు డ్రై చేసిన పదప, బయటకు తీసి డెసికెటరులోవుంచి చల్లర్చవలెను. చల్లారిన రిసివరును ఎనలైటికల్ బాలెన్సులో తూచి కచ్చితమైన బరువును నమాదు చెయ్యాలి.
నూనె గింజలలోని నూనె శాతం:
రిసివరులో జమఅయిన నూనెభారాన్ని వంద (100) చే గుణించి, పరీక్షకై తీసుకున్న పదార్థభారంతో భాగహరించిన నూనెశాతం వచ్చును.
నూనె శాతం
మార్చువివరణ
M=ఖాళి రిసివరు ఫ్లాస్కు భారం.గ్రాం.లలో
M1= నూనెతో రిసివరు భారం, గ్రాం.లలో
W= పరీక్షకై తీసుకున్న పదార్థ భారం.గ్రాం.లలో
పోటోగ్యాలరి
మార్చుమూలాలు
మార్చు- ↑ http://www.academia.edu/2967956/FAT_and_OIL_FROM_OIL-SEEDS_PART_I_SOXHLET_EXTRACTION
- ↑ "testing methods of oilseeds" (PDF). law.resource.org\accessdate=13-02-2017. Archived from the original on 2017-02-13. Retrieved 2017-02-13.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)