నూనె ద్రవీభవన స్ధానం

ఈ పరీక్షా విధానాన్ని నూనెగింజల నుండి నూనెతీయు మిల్లులలో,అలాగే అయిల్ కేకు(oil cakes)లనుండి నూనె తీయు సాల్వెంటు ప్లాంటు పరిశ్రమల్లోని ప్రయోగశాలల్లో నిర్వహిస్తారు

నూనెలు/కొవ్వులు అనేవి గ్లెసెరైడ్ ల మిశ్రమాలు. నూనెలలో 94% వరకు కొవ్వుఆమ్లాలు,6% వరలు గ్లెసెరొల్ వుండును. నూనె/కొవ్వు లలో సంతృప్త, అసంతృప్త కొవ్వుఆమ్లాలు రెండూ వుండును. సంతృప్త కొవ్వు ఆమ్లాల ద్రవీభవన స్థానం, అసంతృప్త కొవ్వు ఆమ్లాలకన్న ఎక్కువగా వుండును. అందుచే సంతృప్త కొవ్వు ఆమ్లాలను అధికశాతంలో కలిగివున్న నూనెల ద్రవీభవన స్దానం, అసంతృప్త కొవ్వుఆమ్లాలను కలిగివున్న నూనెలకన్న ఎక్కువ వుండును. నూనెలు కచ్చితమైన ద్రవీభవన స్దానాన్ని చూపించవు. నూనెల ద్రవీభవన స్దానం మిగతా ఘన, ద్రవ పదార్థంలవలె వుండక, మధ్యస్దంగా వుండును.

నూనెల, కొవ్వుల ద్రవీభవన స్దానాన్ని కేశనాళిక (capillary tube) నుపయోగించి నిర్ణయించడం జరుగును

నూనెల ద్రవీభవన స్దానం నిర్నయించుటకు చెయ్యు కేశనాళిక పరీక్ష పద్ధతులు రెండురకాలు.

1. రెండువైపుల తెరచివున్న కేశనాళిక విధానము (open tube capillary method)

'2. మూసిన కేశనాళిక పద్ధతి (closed capillary tube method)

తెరచివున్న కేశనాళిక విధానము[1]

మార్చు

పరికరాలు

మార్చు

1. ద్రవీభవ స్దాన కేశనాళిక (melting point capillary tube) :

గాజుతో చేసిన గొట్టం. పలుచని గోడలు/అంచులు కల్గివుండి పైనుండి క్రింది వరకు సమాన వ్యాసమున్న రంధ్రాన్ని కల్గి వుండాలి. పొడవు 50-60 మి.మీ. వుండాలి. కేశనాళిక లోపలి వ్యాసం 0.81-1.1 మి.మీ.మధ్య, వెలుపలి వ్యాసం 1.2-1.5 మి.మీ వుండాలి.

2. గాజు థర్మామీటర్: 0 -1100C వరకు ఉష్ణాన్ని మాపకం చెయ్యగలిగినఉష్ణమాపకం. ప్రతి 0.20Cకు ఉప విభజన రేఖ ఉంది.

3. బీకరు:[2] 500 మి.లీ పట్టు గాజు పాత్ర.ప్రక్కనుండి వేడిచెయ్యుటకు అమరిక ఉంది. లేదాథిలే మెల్టింగ్ పాయింట్ ట్యూబ్‌ను ఉపయోగించవచ్చును.

4. వేడిచెయ్యు ఉపకరణం:గ్యాస్ హీటరు లేదా విద్యుతు బల్బ్ హీటరు.

5. ఫ్రిజ్:

పరీక్షించు విధానం

మార్చు

పరీక్షించవలసిన నూనె/కొవ్వును కరగించి, తేమ మలినాలను (moisture & impurities) తొలగించాలి. నూనె/కొవ్వు బాగా సమంగా కలిసెలా చెయ్యాలి. శుభ్రంగా వున్న కేశనాళికను తీసికొని పరీక్షించవలసిన నూనె/కొవ్వులో ముంచాలి. కేశనాళికలో కనీసం 10 మి.మీ.ఎత్తు వరకు నూనె/కొవ్వు నిండెలా కేశనాళికను ముంఛాలి. కేసనాళికను వెంటనే ఒక చిన్న మంచు ముక్క మీద వుంచి కేశనాళికలోని నూనె/కొవ్వును ఘనీభవింప చెయ్యాలి. ఇప్పుడు కేశనాళికను ఒక గంటసేపు ఫ్రిజ్ లో వుంచాలి. లేదా 4-100C ఉష్ణోగ్రతవున్న నీటిలోకూడా వుంచవచ్చును. కేశనాళికకు రబ్బరు బ్యాండ్ సహాయంతో గాజు థర్మామీటరును చేర్చి కట్టాలి. థర్మామీటరు యొక్క బల్బ్ భాగం, కేశనాళిక అడుగుభాగం ఒకే స్దాయిలో వుండాలి. ఇప్పుడు 100C ఉష్ణోగ్రత వున్న నీటిని బీకరులో లేదా థిలె ట్యూబ్‌లో పోసి, కేశనాళిక లోపల, మధ్యభాగంలో కనీసం 30 మి.లీ.లోతులో నీటిలో వుండేలా అమర్చాలి. ఇప్పుడు నీటిని 250C ఉష్ణోగ్రత వచ్చు వరకు నిమిషానికి 20C ఉష్ణోగ్రత పెరిగెలా వేడి చెయ్యాలి. నీటి ఉష్ణోగ్రత 250C రాగానే నీటి ఉష్ణోగ్రత నిమిషానికి 0.50C పెరిగేలా వేడి చెయ్యాలి. కేశనాళికలోని నూనె/కొవ్వును జాగ్రత్తగా పరిశీలించదం మొదలుపెట్టాలి. కేశనాళికలోని నూనె/కొవ్వు వ్యాకోచించడం ప్రారంభించగానే, థర్మామీటరు చూపించు ఉష్ణోగ్రతను (నూనె/కొవ్వు పారదర్శకంగా మారడం మొదల్వౌతుంది) నమోదు చెయ్యాలి. ఈ ఉష్ణోగ్రత యే ఈ నూనె/కొవ్వు యొక్క ద్రవీభవన స్థానం.

చివర మూసివున్న కేశనాళిక పద్ధతి

మార్చు

పరీక్షించ వలసిన నూనెను బాగా కలిపి, ఫిల్టరుచేసి మలినాలు తొలగించాలి.ఇపుడు కేశనాళికను పరీక్షించవలసిన నూనెలో ముంచి కేశనాళికలో 10 మి.మీ.ఎత్తు వరకు నూనె వుండేలా చూడాలి.కేశనాళికను నూనెనుండి బయటకు తీసి క్రింది అంచును సన్నని బర్నరు మంటమీదకాల్చి మూసి వెయ్యాలి.ఇప్పుడు కేశనాలళికను 4-100C ఉష్ణోగ్రతవున్న ఫ్రీజ్ లో 10-16 గంటకు వుంఛాలి.ఆ తరువాత విధానం పైన పెర్కొన్న తెరచి వున్న కేశనాళిక పద్ధతీప్రకారం చెయ్యాలి.కేశనాళికలోని నూనె పారదర్శకంగా మారగానే థర్మామీటరులోని ఉష్ణోగ్రతను నమోడు చెయాలి.ఇదియే ఆ నూనె/కొవ్వు యొక్క ద్రవీభవన స్దానం

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. methods of sampling and test for oils and fats,Is:548(part I)-1964,determination of melting point,Pageno.33&34
  2. http://www.thefreedictionary.com/beaker
  • B.S.684:1958 Methods of Anylysis Of Oils And Fats.British Standards Institution.