నృత్య దర్శకులు

(నృత్యదర్శకుడు నుండి దారిమార్పు చెందింది)

నృత్య దర్శకులను ఆంగ్లంలో కొరియోగ్రాఫర్స్ అంటారు. నృత్యరూపకల్పనను రూపొందించే వారిని నృత్య దర్శకులు అంటారు. నృత్యరూపకల్పన కొన్నిసార్లు నృత్య సంకేతాలను వ్యక్తపరచే ఆకృతిని కూడా సూచిస్తుంది. నృత్యదర్శకుడు నాట్యములకు ఒక రూపు తేస్తాడు. నృత్య కొరియోగ్రఫీ కొన్నిసార్లు నృత్యకూర్పుగా పిలవబడుతుంది. నృత్యదర్శకుడు లయ, ఉచ్చారణ, నేపథ్యం వంటి అనేక కోణాలకు సంబంధించిన వైవిధ్యమైన అనేక విషయాలను దృష్టిలో ఉంచుకొని నృత్యరూపకాన్ని కూర్చుతాడు. ఇతను నృత్యరూపక ప్రక్రియను వినూత్న ఆలోచనలతో అభివృద్ధి పరచడం జరుగుతుంది. నృత్య దర్శకుడు నృత్యరూపకాన్ని ఒక వేదికపై పదర్శన ఇవ్వడానికి రూపొందిస్తాడు. ఇతను నృత్యాన్ని పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి జాజ్ నృత్యం, హిప్ హాప్ నృత్యం, సమకాలీన నృత్యం, జానపద నృత్యం, మత సంబంధమైన నృత్యాలను రూపొందిస్తాడు.

నృత్య దర్శకుల దర్శకత్వం ప్రకారం భారతీయ నృత్య రూపకల్పన

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు