నెట్‌ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్ (ఆంగ్లం:Netflix) అనేది ప్రపంచ ప్రఖ్యాత ఓటీటీ (ఓవర్-ది-టాప్) సాధనం. దీంతో ఇంటర్నెట్‌లో టెలివిజన్ షోలను, ఫిల్మ్ కంటెంట్‌ను అభ్యర్థన మేరకు వినియోగదారులకు అందిస్తారు. ఇటీవల సినిమాలను థియేటర్‌లలో కాకుండా ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేయడం సర్వసాధారణం అయింది. ఇవి టీవీ, కంప్యూటర్, మొబైల్ పరికరాలలో ఇంటర్నెట్ సబ్‌స్క్రిప్షన్ ఉండడం ద్వారా అందరికి చేరువవుతున్నాయి.
![]() నెట్‌ఫ్లిక్స్ 2015 నుండి ఉపయోగించబడుతున్న లోగో | |
Type of business | పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ |
---|---|
Type of site | OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ (ఓవర్ ది టాప్ మీడియా సర్వీస్) |
Available in | List
|
Traded as | |
Founded | స్కాట్స్ వ్యాలీ, కాలిఫోర్నియా, అమెరికాలో ఆగస్టు 29, 1997 |
Headquarters | లాస్ గాటోస్, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా |
Area served | ప్రపంచవ్యాప్తంగా (మెయిన్‌ల్యాండ్ చైనా, ఉత్తర కొరియా, రష్యా, సిరియా కాకుండా) |
Founder(s) |
|
Key people |
|
Industry | టెక్నాలజీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ,మాస్ మీడియా |
Products |
|
Services |
|
Revenue | ![]() |
Operating income | ![]() |
Net income | ![]() |
Total assets | ![]() |
Total equity | ![]() |
Employees | 12,800 (2022) |
Divisions |
|
Subsidiaries |
|
Registration | అవసరం |
Users | 2022 డిసెంబరు 31 నాటికి 230.747 మిలియన్ |
చరిత్ర సవరించు
ఈ సంస్థను 1997 ఆగస్టు 27న మార్క్ రాండల్ఫ్, రీడ్ హేస్టింగ్స్ కాలిఫోర్నియా లోని స్కాట్స్ వ్యాలీలో ప్రారంభించారు. హేస్టింగ్స్ గణిత శాస్త్రవేత్త. అలాగే కంప్యూటర్ శాస్త్రవేత్త కూడా అయిన ఇతను అంతకు మునుపు ప్యూర్ అట్రియా అనే సంస్థను స్థాపించాడు. దీనిని రేషనల్ సాఫ్ట్‌వేర్ కార్పొరేషన్ అనే సంస్థ అదే సంవత్సరంలో 750 మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసింది. అప్పటిదాకా సిలికాన్ వ్యాలీలో అదే అతి పెద్ద కొనుగోలు.[3] రాండల్ఫ్ ప్యూర్ అట్రియా సంస్థలో మార్కెటింగ్ డైరెక్టరుగా పనిచేసేవాడు.
నెట్‌ఫ్లిక్స్ డివిడి, బ్లూ-రే అద్దె వ్యాపారాన్ని నిలుపుకుంటూ స్ట్రీమింగ్ మీడియాను ప్రవేశపెట్టడంతో 2010లో తన వ్యాపారాన్ని విస్తరించింది. ఇది కెనడాలో ప్రారంభమై అంతర్జాతీయంగా విస్తరించింది. నెట్‌ఫ్లిక్స్ 2012లో కంటెంట్ ప్రొడక్షన్ పరిశ్రమలోకి ప్రవేశించి మొదటగా సిరీస్ లిల్లీహామర్‌ను నిర్మించింది.
2012 నుండి నెట్‌ఫ్లిక్స్ చలనచిత్ర, టెలివిజన్ ధారావాహికల కోసం నిర్మాత, పంపిణీదారుగా మరింత చురుకైన పాత్రను పోషించింది, ఆ దిశగా, ఇది తన ఆన్‌లైన్ లైబ్రరీ ద్వారా పలు రకాల నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ కంటెంట్‌ను అందిస్తుంది. జనవరి 2016 నాటికి, నెట్‌ఫ్లిక్స్ సేవలు 190కి పైగా దేశాలలో పనిచేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ 2016లో 126 ఒరిజినల్ సిరీస్, ఫిల్మ్‌లను విడుదల చేసింది.
ఉత్పత్తులు సవరించు
2007లో నెట్‌ఫ్లిక్స్ డివిఆర్ వ్యాపార మార్గదర్శకులలో ఒకరైన ఆంథోనీ వుడ్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్లేయర్ ను తయారుచేయడంలో నియమించింది, దీంతో స్ట్రీమింగ్ కంటెంట్‌ను కంప్యూటర్, ఇంటర్నెట్ లేకుండానే టెలివిజన్ సెట్‌లో నేరుగా ప్లే చేసుకోవచ్చు.
2011లో నెట్‌ఫ్లిక్స్ కొన్ని రిమోట్ కంట్రోల్‌ల కోసం నెట్‌ఫ్లిక్స్ బటన్‌ను ప్రవేశపెట్టింది, అనుకూల పరికరాల్లో నెట్‌ఫ్లిక్స్‌ను తక్షణమే యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.
సర్వీసెస్ సవరించు
నెట్‌ఫ్లిక్స్ వీడియో ఆన్ డిమాండ్ స్ట్రీమింగ్ సేవను గతంలో వాచ్ నౌ అని పిలిచేవారు. కంప్యూటర్లలో నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్ ద్వారా టీవీ సిరీస్, చలనచిత్రాలను చందాదారులకు అనుమతిస్తుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ చేసే ప్లాట్‌ఫామ్‌లతో సహా స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, డిజిటల్ మీడియా ప్లేయర్‌లు, వీడియో గేమ్ కన్సోల్‌లు, స్మార్ట్ టీవీలు.. ఇలా ఇంటర్నెట్ సదుపాయంతో ఉన్న ఏ డివైస్ లోనైనా వీక్షించవచ్చు.
మూలాలు సవరించు
- ↑ "Netflix is now available in Hindi". Netflix (Press release). August 9, 2020.
- ↑ "APA KABAR INDONESIA? NETFLIX CAN NOW SPEAK BAHASA INDONESIA". Netflix (Press release). October 18, 2018.
- ↑ Hastings, Reed (December 1, 2005). "How I Did It: Reed Hastings, Netflix". Inc.