నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన

నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన (ఆంగ్లం: A Socio-Linguistic Study of the Place Names of Nellore District) ఒక పరిశోధన గ్రంథం. దీనిని డా. ఉగ్రాణం చంద్రశేఖర రెడ్డి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి నుండి 1989లో డాక్టరేట్ పొందడానికి చేసిన పరిశోధన మూలంగా చేసిన విశేషాలను పుస్తకరూపంలో ముద్రించారు.

నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన
కృతికర్త: డా. ఉగ్రాణం చంద్రశేఖర్ రెడ్డి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: చరిత్ర
ప్రచురణ: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి
విడుదల: 1989
పేజీలు: 260

గ్రామనామాలు ఆ ప్రాంతపు వందల, కొన్ని సందర్భాల్లో వేలయేళ్ళ చరిత్రకు తాళపుచెవి లాంటిది. ఆ ప్రాంతపు భౌగోళిక, సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ విశేషాలు గ్రామనామాల ద్వారా తెలుస్తాయి. చరిత్ర, భౌగోళిక వివరాలు, సామాజిక చరిత్ర వంటి ఎన్నో రంగాలు గ్రామనామాలతో ముడిపడ్డాయి. ఉదాహరణకు ఆలమూరు అన్న పేరు ఆలము(యుద్ధము), ఊరు అన్న పదాల కలయికతో ఏర్పడగా ఆ ప్రాంతంలో పూర్వం యుద్ధం జరిగిందన్న విషయాలు సూచిస్తూంటాయి. అలాగే ఎన్నో గ్రామాల పేర్లు వివిధాంశాలకు సూచనలుగా నిలుస్తాయి. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలోని వివిధ గ్రామనామాల వెనుకనున్న భాషా విశేషాలు, తద్వారా సామాజికాంశాల వివరణలతో ఈ పరిశోధన గ్రంథం రూపొందించారు.

మూలాలు మార్చు

 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: