నెలపొడుపు
అమావాస్య తరువాత చంద్రుని నుంచి వెలువడే మొదటి రోజు చంద్రకాంతిని నెలపొడుపు లేక నెల పొడుపు అంటారు.
పవిత్రత
మార్చుప్రతి నెలలో ఒకసారి నెలపొడుపు వస్తుంది. ఈ నెలపొడుపును హిందూ, ముస్లింలు చాలా పవిత్రంగా భావిస్తారు.
రంజాన్ మాసం
మార్చుతెలుగు వారి మాదిరిగానే ముస్లింలు 'చాంద్రమాన కేలండర్' ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్', దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ' రంజాన్ మాసం '. ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఈ రంజాన్ మాసం ప్రారంభంలో నెల ప్రారంభ సూచిక అయిన నెలపొడుపును చూసి ఉపవాసాలు ప్రారంభిస్తారు.
నెలపొడుపును చూసి రంజాన్ పండుగ
మార్చుపవిత్ర ఖురాన్ ఆవిర్భవించిన రంజాన్ మాసంను ఉపవాసంలతో దిగ్విజయంగా పూర్తి చేసాము అనేందుకు గుర్తుగా మరుసటి నెల ప్రారంభ సూచిక అయిన నెలపొడుపును చూసి రంజాన్ పండుగను జరుపుకుంటారు.
నెలపొడుపును చూసి ఇష్టమైన వారిని లేదా ఇష్టమైన వాటిని చూడటం
మార్చునెలపొడుపును చూసిన వెంటనే తనకు ఇష్టమైన వారిని లేదా ఇష్టమైన వాటిని చూస్తారు. ఉదాహరణకు కొంతమంది నెలపొడుపును చూసిన తరువాత వెంటనే తన దగ్గర ఉన్న దేవుని చిత్రాన్ని లేదా ధనలక్ష్మీ ప్రతిరూపంగా భావించే డబ్బుని చూస్తారు, ఈ విధంగా చేయటం వలన ఆ నెలంతా ఆర్థిక ఇబ్బందులు కలగవని నమ్ముతారు.