నొప్పి డాక్టరు (పుస్తకం)
నొప్పి డాక్టరు పిల్లలను జంతువులలోకంలోకి తీసుకువెళ్లే ఓ రంగుల బొమ్మల కథల పుస్తకం. పిల్లలకు సరదాగా, జాలీగా పుస్తక పఠనంపై ఆసక్తి, నైతిక విలువలు పెంపొందించే ఉద్దేశంతో ఈ పుస్తకం ముద్రింపబడింది.[1] వినోదంతో పాటు జంతువులకు, పక్షులకు సంబంధించిన విజ్ఞానం అందిచడంతోపాటు పుస్తకం పేరు, లోపలి భాష, జంతువుల, పక్షుల చేష్టలు పిల్లలను చాలా బాగా ఆకట్టుకుంటాయి.[2]
నొప్పి డాక్టరు | |
కృతికర్త: | కొర్నేయ్ చుకోవ్ స్కీ (రష్యన్), తెలుగు అనువాదం: ఆర్వియార్ |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | కథలు |
ప్రచురణ: | దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ |
విడుదల: | జులై 2015 |
పేజీలు: | 180 |
రచన
మార్చుకొర్నేయ్ చుకోవ్ స్కీ అనే రష్యన్ రచయిత రష్యా భాషలో రాసిన ఈ పుస్తకం 1986లో ప్రథమంగా ముద్రింపబడింది. దీనిని ఆర్వియార్ అనే రచయిత తెలుగులో అనువదించగా, వి. దువిదేవ్ చక్కని బొమ్మలతో అందంగా తయారుచేశారు.
ముద్రణ
మార్చుబాలలసాహిత్యంలో అనేక పుస్తకాలు ప్రచురించిన దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ వారు ఈ పుస్తకాన్ని అందమైన బైండింగ్ తో పిల్లలు చదివేందుకు వీలైన అక్షరాలతో 2015 జూలైలో ప్రచురించారు.
మూలాలు
మార్చు- ↑ పుస్తకం.నెట్, తెలుగు అనువాదాలు. "నొప్పి డాక్టరు". pustakam.net. మద్దిరాల శ్రీనివాసులు. Retrieved 6 January 2018.
- ↑ "పుస్తకం డాట్ నెట్ లో పుస్తక పరిచయం".