నోకియా మొబైల్ ఫోన్ తెలుగు కీ బోర్డు

కొన్ని నొకియా మొబైల్ ఫోన్ లలో తెలుగులో వ్రాసే సౌకర్యం ఉంది. సాధారణంగా కీ బోర్డుపై హిందీ అక్షరాలు ముద్రించివున్నాకూడా అమరికలలో తెలుగు ఎంపికచేసుకుంటే ఆదేశ వరుసలు తెలుగు లోకి మారి తెలుగు టైపు చేయటం వీలవుతుంది.ఇది 2జి ఫీచర్ ఫోన్ల లో తెలుగు ను టైపు చేయటానికి ఈ పద్దతి వాడేవారు[1] , ఇందులో హల్లులు వత్తులు లేకపోవటం వలన తెలుగు టైప్ చేయటం చాలా కష్టం గా ఉండేది. నోకియా తన ఫ్రంట్ ఎండ్ ప్రాసెసర్ (ఎఫ్‌ఇపి) టెక్నాలజీతో క్విల్‌ప్యాడ్ ఇంజిన్‌ను ఇంటిగ్రేట్ చేసింది, ఎస్ 60 3 వ ఎడిషన్ పరికర వినియోగదారులకు మల్టీ-లాంగ్వేజ్ షార్ట్ మెసేజ్ సర్వీస్ (ఎస్‌ఎంఎస్) ప్రాసెస్‌ ద్వారా తెలుగును టైపు చేయవచ్చు ఇది నోకియా ఆశా సిరీస్ నోకియా ఉత్పత్తి చేసి విక్రయించే తక్కువ-స్థాయి ఫీచర్ ఫోన్‌ల శ్రేణి లో కూడా ప్రవేశ పెట్టబడినది.

నోకియా 3310 మొబైల్ ఫోన్

ఉదారణకు నోకియా ఫీచర్ ఫోనులో Nokia 105 కీప్యాడ్ ఉపయోగించి ఇలా రాయవచ్చు [2]


అక్షరం చూపించే వరకు కీని పదేపదే నొక్కండి.

స్పేస్ టైప్ చేయడానికి 0 నొక్కండి.

ప్రత్యేక అక్షరం లేదా విరామ చిహ్నాన్ని టైప్ చేయడానికి, * నొక్కండి.

అక్షరాల కేసుల మధ్య మారడానికి, # పదేపదే నొక్కండి.

సంఖ్యను టైప్ చేయడానికి, సంఖ్య కీని నొక్కండి, పట్టుకోండి.

సంఖ్య - అక్షరాలుసవరించు

  • 1 అఁ అం అః
  • 2 అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ
  • 3 ఎ ఏ ఐ ఒ ఓ ఔ
  • 4 క ఖ గ ఘ ఙ
  • 5 చ ఛ జ ఝ ఞ
  • 6 ట ఠ డ ఢ ణ
  • 7 త థ ద ధ న
  • 8 ప ఫ బ భ మ
  • 9 య ర ల వ శ
  • 0 ష స హ ళ క్ష ఱ
ఉదాహరణ

ఒకవేళ అంధ్రా వ్రాయాలి, 2 సంఖ్యను రెండు పర్యాయాలు ఒత్తి, తరువాత 7 సంఖ్యను నాలుగు పర్యాయాలు ఒత్తి * ని ఒత్తి తరువాత 9 ని రెండు పర్యాయాలు ఒత్తి 2 ని ఒక పర్యాయం ఒత్తాలి.

పరిమితులు

ఇక్కడ గమనించ వలిసిన విషయాలు ౠ లేదు

నోకియా మొబైల్ ఫోన్సవరించు

నోకియా, అత్యంత ప్రసిద్ధ మొబైల్ ఫోన్ బ్రాండ్లలో ఒకటి,నోకియా లేకుండా మొబైల్ ఫోన్ల చరిత్ర ఎప్పటికీ పూర్తి కాదు. ఫిన్నిష్ తయారీదారు అనేక దిగ్గజ పరికరాలను కలిగి ఉంది, నోకియా 3310 ఖచ్చితంగా అత్యంత విస్తృతంగా ప్రసిద్ధి చెందింది[3] ఆతరువాత మోడల్ లలో తెలుగు కీబోర్డు ఉండేది. అయితే పరిమితం వనరు కావటం వలన తరువాత టచ్ స్క్రీన్ లు ఉన్న ఫోనులు , అందులో ఆండ్రాయిడ్ లో జి బోర్డు వంటి ఉపకరణాలు ఉండటం వలన ఇలా తెలుగు టైపు చేయటం ఎక్కువ ఆదరణ పొందలేదు,

వనరులుసవరించు

మూలాలుసవరించు

  1. "How to type Text in Hindi using English Keyboard? – AbhiSays.com". Retrieved 2020-08-30.
  2. "Write text on your phone | Nokia phones". www.nokia.com. Retrieved 2020-08-30.
  3. "15 most popular mobile phones of all time - Legendary phones". The Economic Times. Retrieved 2020-08-30.