నోయల్‌ నావల్ టాటా (ఆంగ్లం: Noel Tata; జననం 1957), భారతదేశంలో జన్మించిన ఐరిష్ వ్యాపారవేత్త. ఆయన టాటా ట్రస్ట్స్, ట్రెంట్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, టాటా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్, టైటాన్ కంపెనీ, టాటా స్టీల్ వైస్ ఛైర్మన్.[1]

నోయల్‌ టాటా
2013లో నోయల్‌ టాటా
జననం
నోయల్‌ నావల్ టాటా

1957 (age 66–67)
పౌరసత్వంఐరిష్
విద్యసస్సెక్స్ విశ్వవిద్యాలయం, ఐఎన్ఎస్ఈఎడి
వృత్తివ్యాపారవేత్త
బిరుదుటాటా ట్రస్ట్, ట్రెంట్ లిమిటెడ్, వోల్టాస్ లిమిటెడ్
ఛైర్మన్
టాటా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్
జీవిత భాగస్వామిఆలూ మిస్త్రీ
పిల్లలు3
తల్లిదండ్రులునావల్ టాటా
సిమోన్ టాటా
బంధువులుపల్లోంజీ మిస్త్రీ (మామగారు) రతన్ టాటా (సవతి సోదరుడు)

ఆయన సవతి సోదరుడు రతన్ టాటా మరణం తరువాత 2024 అక్టోబరు 11న టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ గా నియమించబడ్డాడు. టాటా ట్రస్ట్స్ టాటా సన్స్ లో 66% వాటాను కలిగి ఉంది, ఇది టాటా గ్రూప్ అనేక సంస్థల హోల్డింగ్ కంపెనీ.[2]

ప్రారంభ జీవితం

మార్చు

టాటా కుటుంబానికి చెందిన ఆయన నావల్ టాటా, సిమోన్ టాటా దంపతుల కుమారుడు.[3] ఆయన టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా, జిమ్మీ టాటాలకు సవతి సోదరుడు.[3]

ఆయన సస్సెక్స్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. ఫ్రాన్స్ లోని ఇన్సీడ్ (INSEAD) బిజినెస్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ పూర్తిచేసాడు.[3]

కెరీర్

మార్చు

విదేశాలలో అందించే ఉత్పత్తులు, సేవల కోసం టాటా గ్రూప్ విభాగమైన టాటా ఇంటర్నేషనల్ లో ఆయన తన వృత్తిని ప్రారంభించాడు. జూన్ 1999లో, ఆయన తన తల్లి స్థాపించిన గ్రూప్ రిటైల్ ఆర్మ్ ట్రెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అయ్యాడు. ఈ సమయానికి, ట్రెంట్ డిపార్ట్మెంట్ స్టోర్ లిటిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ ను కొనుగోలు చేసి దాని పేరును వెస్ట్సైడ్ గా మార్చాడు. టాటా వెస్ట్సైడ్ను అభివృద్ధి చేసి, దానిని లాభదాయకమైన వ్యాపారంగా మార్చాడు. 2003లో ఆయన టైటాన్ ఇండస్ట్రీస్, వోల్టాస్ డైరెక్టర్ గా నియమితులయ్యాడు.

టాటా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఆయన 70 బిలియన్ డాలర్ల సమ్మేళనం విదేశీ వ్యాపారాన్ని నిర్వహించే సంస్థ టాటా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టరు అవుతారని 2006 లో ప్రకటించబడింది, ఇది టాటా గ్రూప్ అధిపతిగా రతన్ టాటా తరువాత ఆయనను నియమించడం జరుగుతుందనే ఊహాగానాలకు దారితీసింది.[4][5] అయితే, 2011లో రతన్ టాటా వారసుడిగా ఆయన బావమరిది సైరస్ మిస్త్రీని ప్రకటించారు.[6] 2016 అక్టోబరులో సైరస్ మిస్త్రీని టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుండి తొలగించారు. రతన్ టాటా 2017 ఫిబ్రవరి వరకు నాలుగు నెలల పాటు గ్రూప్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాడు.[7] ఆయన 2018లో టైటాన్ కంపెనీ వైస్ ఛైర్మన్ గా నియమితుడయ్యాడు. 2019 ఫిబ్రవరిలో సర్ రతన్ టాటా ట్రస్ట్ బోర్డులో చేర్చబడ్డాడు.[8] 2022 మార్చి 29 న ఆయన టాటా స్టీల్ వైస్ ఛైర్మన్ గా నియమితుడయ్యాడు.[1]

నోయల్‌కు సవతి సోదరుడైన రతన్ టాటా 2024 అక్టోబరు 9 న మరణించడంతో, 2024 అక్టోబరు 11న నోయల్‌, టాటా గ్రూప్ దాతృత్వ విభాగమైన టాటా ట్రస్ట్స్‌కు ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆయన టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ లో అతిపెద్ద వాటాదారుగా ఉన్న పల్లోంజీ షాపూర్‌జీ మిస్త్రీ కుమార్తె ఆలూ మిస్త్రీని వివాహం చేసుకున్నాడు.[9] వారికి లేహ్, మాయా, నెవిల్లే అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.[10]

లేహ్ టాటా మాడ్రిడ్ లోని ఐఈ బిజినెస్ స్కూల్ నుండి మార్కెటింగ్ లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉంది. ఆమె టాటా గ్రూప్ లోనే పనిచేస్తోంది, ప్రస్తుతం ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తోంది.

మాయా టాటా టాటా క్యాపిటల్ విశ్లేషకురాలిగా తన వృత్తిని ప్రారంభించింది. ఆమె కెరీర్ కంపెనీలో క్రమంగా ముందుకు సాగుతోంది.

నెవిల్లే టాటా తన వృత్తిని టాటా యాజమాన్యంలోని ట్రెంట్ అనే రిటైల్ కంపెనీతో ప్రారంభించాడు, దీనిని స్థాపించడానికి అతని తండ్రి నోయల్‌ సహాయం చేసాడు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Dutt, Ishita Ayan (29 March 2022). "Tata Steel board approves appointment of Noel Naval Tata as vice-chairman". Business Standard.
  2. "Ratan Tatas Successor: Noel Tata Appointed Chairman of Tata Trusts". Times of India. 11 October 2024. Retrieved 11 October 2024.
  3. 3.0 3.1 3.2 Carvalho, Brian; Layak, Suman (1 November 2009). "The Other Tata". Business Today. Retrieved 1 February 2019.
  4. "Noel Tata to be Tata International MD". Rediff.com. PTI. 2010-07-29. Archived from the original on 2019-12-25.
  5. ET Bureau (30 July 2010). "Is Noel Tata being groomed to succeed Ratan Tata?". The Times of India. Retrieved 30 May 2018.
  6. "Cyrus P. Mistry is Ratan Tata's heir apparent". The Hindu. 24 November 2011. Retrieved 24 November 2011.
  7. "Big shakeup! Cyrus Mistry removed as Tata Sons chairman, Ratan Tata steps in". Benette, Coleman & Co. Ltd. Economic Times. 24 October 2016. Retrieved 24 October 2016.
  8. Vijayaraghavan, Kala; John, Satish (14 February 2019). "Venkataramanan quits Tata Trusts; Noel joins Ratan Tata Trust". The Economic Times. Retrieved 19 June 2020.
  9. Vijayraghavan, Kala; Mandavia, Megha (26 August 2018). "How next gen scions Leah, Maya and Neville are working their way up in Tata Group companies". Retrieved 26 August 2018 – via The Economic Times.
  10. "Ratan Tata family tree: Look at its members from Jamsetji to Noel Tata". India Today. 10 October 2024. Retrieved 10 October 2024.