నోవహు

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ

నోవహు

 
నోవహు

నోవహు నీతిపరుడును తన తరములో నిందారగహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునియందు భయభక్తులు గలవాడు. ఇతని కుమారుల పేర్లు షేము, హాము, యాపేతు

దేవుని ఆలోచన

నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము చెడుతలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవాచూచి భూమిమీద గల నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అందుకు దేవుడు నేను సృజించిన నరులను, జంతువులను, పురుగులను, ఆకాశపక్ష్యాదులను భూమిమీద ఉండ కుండ తుడిచివేయుదుననుకొనెను.

నోవహుకు దేవుని హెచ్చరిక

కానీ నోవహు నీతిపరుడు గనుక అతనితో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిదిని వారి అంతము వచ్చియున్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదునని దేవుడు చేప్పెను. నీకొరకు చితిసారకపు మ్రానుతో ఓడను చేసికొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను, వెలుపటను కీలును పూయమని చేప్పెను.

ఓడ తయారు చేయు విధానం

ఆ ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పును, 30 మూరల యెత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను. దాని ప్రక్కనే ఓడ యెక్క తలుపు ఉండవలెను.3 అంతస్తులుండవలెను. జలప్రవాహమును రప్పించెదను. సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండి తుడిచివేయుదును. లోకమందున్న సమస్తమును చనిపోవును.

"https://te.wikipedia.org/w/index.php?title=నోవహు&oldid=3616543" నుండి వెలికితీశారు