న్యాయ దర్శనం

(న్యాయ దర్శనము నుండి దారిమార్పు చెందింది)
  • న్యాయ దర్శనము శాస్త్రములకు శాస్త్రమని అర్ధము. దీనికి మరో పేరు తర్కశాస్త్రము. అంత మాత్రము చేత న్యాయ దర్శనమును తర్క శాస్త్రము అని అనరాదు.
  • న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము అను రెండునూ ఒకనాడు ఒకే దర్శనముగా ఉండెడిది. కాలక్రమేణా రెండు దర్శనములుగా విడిపోయినవి.
  • కొందరు ప్రథమ దర్శనము అంటే వైశేషిక దర్శనము మాత్రమే అని, మరికొందరు న్యాయ దర్శనము అను వాదనలు ఉన్ననూ, చివరికి ఏకాభిప్రాయమునకు వచ్చి, వైశేషిక దర్శనము ప్రమేయముల గురించి విపులముగా చెప్పడము జరిగింది.
  • తాత్విక సమస్యలపై వాదోపవాదాలకు అవసరమైన నియమ నిబంధనలే న్యాయ దర్శనముగా గౌతమ మహర్షి సూత్రబద్దం చేసాడు. దీనిలో మొత్తం 524 సూత్రాలు ఉన్నాయి.

గౌతముని న్యాయ సూత్రాలు ఇలా ప్రారంభం అవుతాయి.

ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన
దృష్టాంత సిద్ధాంతావయవ తర్క నిర్ణయ
వాద జల్ప వితండాహేత్వాభాసచ్ఛల
జాతి నిగ్రహ స్థానానాం తత్వజ్ఞానా
న్నిఃశ్రేయ సాధిగమః

ప్రమాణములు

మార్చు
  • న్యాయ దర్శనం పదహారు పదార్థాలను (షోడశపదార్థములు) తెలుసుకుంటే నిశ్శ్రేయసం (మోక్షం) ప్రాప్తిస్తుందని వాగ్దానం చేస్తుంది. అవి:
  • ప్రమాణం, ప్రమేయం, సంశయం, ప్రయోజనం, దృష్టాంతం, సిద్ధాంతం, అవయవం, తర్కం, నిర్ణయం, వాదం, జల్పం, వితండం, హేత్వాభాసం, ఛలం, జాతి, నిగ్రహ స్థానం.
  • ఈ పైన సూచించిన (షోడశపదార్థములు) ప్రమాణములు జ్ఞాన సాధనములు.

ప్రమేయములు

మార్చు
  • ఆత్మ, శరీరము, ఇంద్రియము, అర్థము, బుద్ధి, (జ్ఞానము), మనస్సు, ప్రవృత్తి, దోషము, ప్రేత్య భావము, ఫలము, దుఃఖము, అపవర్గము.

ఆత్మలు

మార్చు
  • (1) ఇచ్చ (కోరిక), (2) ద్వేషము, (3) ప్రయత్నము, (4) సుఖము, (5) దుఃఖము, (6) జ్ఞానము అను ఈ ఆరు ప్రమాణములు అందు ఆత్మ ఉన్నది, అందువలన వీటిని ఆత్మగుణములు అని అంటారు.