నాడీకణం

(న్యూరాన్ నుండి దారిమార్పు చెందింది)

నాడీకణం లేదా న్యూరాన్ (Neuron) విద్యుత్తు ద్వారా ప్రేరేపితమై యాక్షన్ పొటెన్షియల్ రూపంలో సంకేతాలనిచ్చే కణం. ఇవి నాడీ తంతువుల (Synapse) ద్వారా ఒకదానితో ఒకటి సమాచారం ఇచ్చి పుచ్చుకుంటాయి. స్పాంజ్‌లు, ప్లాకోజోవా మినహా అన్ని జంతువులలో నాడీ కణజాలంలో న్యూరాన్ ప్రధాన భాగం.[1] వీటికి తోడుగా గ్లియల్ కణాలు ఉంటాయి. ఇవి నాడీకణాల పోషణ, రక్షణ కోసం ఉపయోగపడతాయి. మొక్కలు, శిలీంధ్రాలు వంటి జంతువులు కాని వాటికి నాడీ కణాలు ఉండవు.

న్యూరాన్లను వాటి పనితీరు ఆధారంగా మూడు రకాలుగా వర్గీకరిస్తారు. ఇంద్రియ న్యూరాన్లు స్పర్శ, ధ్వని లేదా కాంతి వంటి ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి. ఇవి ఇంద్రియ అవయవాల కణాలను ప్రభావితం చేస్తాయి. అవి వెన్నుపాము లేదా మెదడుకు సంకేతాలను పంపుతాయి. కండరాల సంకోచాల నుండి గ్రంధుల స్రవించడం వరకు ప్రతిదీ నియంత్రించడానికి మోటారు న్యూరాన్లు మెదడు, వెన్నుపాము నుండి సంకేతాలను అందుకుంటాయి. మెదడు లేదా వెన్నుపాము లోని ఇతర న్యూరాన్‌లకు అంతర నాడీకణాలు న్యూరాన్‌లను కలుపుతాయి. బహుళ న్యూరాన్లు క్రియాత్మకంగా ఒకదానితో ఒకటి అనుసంధానించబడినప్పుడు, వాటిని న్యూరల్ సర్క్యూట్ అని పిలుస్తారు.

నాడీ కణాలను మొదటగా ఫాసిల్, హిస్ అనే శాస్త్రవేత్తలు గుర్తించారు.

నిర్మాణం

మార్చు
 
న్యూరాన్ లో భాగాలు

ఇందులో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి. ఒకటి కణదేహం లేదా న్యూరో సైటాన్, రెండోది ఏక్సాన్, మూడవది డెండ్రైటులు.[2] కణదేహంలో కేంద్రకం, నిస్సల్ కణికలు ఉంటాయి. కణదేహం నుంచి పోగుల్లా ఏర్పడేవి డెండ్రైటులు. ఇవి శాఖోపశాఖలుగా ఉండి సమాచార మార్పిడిలో సహాయపడతాయి. ఏక్సాన్ అనేది కణదేహం నుండి ఏర్పడే పొడవైన నిర్మాణం. ఈ ఏక్సానులు చివర్లో అనేక చీలికలుగా చీలిఉంటుంది. వీటిని నాడీ అంత్యాలు అంటారు. ఇవి మరొక నాడీకణం డెండ్రైటులు, ఏక్సాన్ లేదా కండర కణజాలంతో అనుసంధానవడానికి వీలుగా ఉంటాయి.[3]

మూలాలు

మార్చు
  1. Moore, Keith; Dalley, Arthur (2005). Clinically Oriented Anatomy (5th ed.). LWW. pp. 47. ISBN 0-7817-3639-0. A bundle of nerve fibers (axons) connecting neighboring or distant nuclei of the CNS is a tract.
  2. "మానవ నాడీ వ్యవస్థ..నిర్మాణం.. విధులు". Sakshi. 2013-08-29. Retrieved 2023-04-06.
  3. "నాడీ వ్యవస్థ". EENADU PRATIBHA. Retrieved 2023-04-06.
"https://te.wikipedia.org/w/index.php?title=నాడీకణం&oldid=3884040" నుండి వెలికితీశారు