పంచదార చిలక (మిఠాయి)
పంచదారతో చేయబడ్డ మిఠాయి
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
పంచదార చిలక పేరుతో కల సినిమాకొరకు పంచదార చిలక (తెలుగు సినిమా) చూడండి. పంచదారతో చేసే చిలక మాదిరి వంటకాన్ని పంచదార చిలక అంటారు. వీటిని ఆంధ్రదేశంలోనే కాక ఇతర రాష్ట్రాలలోనూ తయారుచేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్తా తీర ప్రాంతంలో వీటి వినియోగం ఎక్కువ. అమ్మాయిలను అత్తవారింటికి పంపే సందర్భంలో తప్పక ఈ పంచదార చిలకలు వాడుతారు.
తయారీ విధానం
మార్చు- చక్కెరకు తగినంత నీటిని చేర్చి, దానిలో కొద్దిగా ఇంగువ, యాలకులపొడి, కొద్దిగా మిరియాలపొడి కలపి దానిని తిప్పుతూ తీగపాకంవచ్చే ముందు ముందే తయారు చేసుకొన్న అచ్చులలో పోయడం చేస్తారు. అచ్చుల ద్వారా ఆయా రూపాలలో బొమ్మలు తయారు అవుతాయి. ఈ అచ్చులు అల్యూమినియం లేదా చెక్క అచ్చులలో పోస్తారు.
- వీటి తయారీకి కావలసిన అచ్చులను చెక్కతో గాని, అల్యుమినియంతో గాని చేస్తారు. వీటి తయారీ ఒక పెట్టెలాగ చేస్తారు. మద్యలో తెరుచుకొనే విధంగా చేయడం వలన గడ్డకట్టిన చెక్కరపాకం బొమ్మ రూపం సంతరించుకొంటుంది.
ఇతర విశేషాలు
మార్చు- కోస్తా ఆంధ్ర ప్రాంతాలలో ముఖ్యంగా తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలలో అమ్మాయిలను అత్తవారింటికి పంపేటపుడు, గర్భిణీ స్త్రీలను పురుళ్ళకోసం పంపేటపుడు, పిల్లలు పుట్టిన తరువాత ఈ మిఠాయిలను కూడా పంపడం జరుగుతుంది. దీనిని సారె పంపడం అంటుంటారు.
- ఈ బొమ్మలలో అనేక రకాలు ఉన్నాయి.ఎక్కువగా వెళ్ళేవి చిలక రూపంలో ఉండే హంసలు, తరువాత బుట్టబొమ్మలా ఉండే చిన్న పాప బొమ్మలు విరివిగా చేస్తారు.
- వీటిలో డొల్ల రావడానికి పాకం పోసిన తరువాత మధ్యలో పేపర్లు కూరేవారు, ఇప్పుడు చుట్టూ మాత్రమే కాళీ కల పెట్టె అచ్చులు స్టీల్, అల్యుమినియం లభిస్తున్నాయి.
Look up పంచదారచిలక in Wiktionary, the free dictionary.