హిందూ పురాణాల ప్రకారం మన్మధుడు కామమునకు, కోరికకు అధిష్ఠాన దేవుడు. పాశ్చాత్యుల God of Love Cupid కు ప్రతిరూపుడు. ఈయన స్థితి కారకుడయిన విష్ణు దేవుని పుత్రుడు. మన్మధునిని లయ కారుకుడు అయిన శంకరుడు తన త్రినేత్రమును తెరచి భస్మం చేసాడు. మన్మధుని పత్ని అయిన రతీ దేవి ప్రార్థన మేరకు శంకరుడు మన్మధునిని పునర్జీవితుని చేసి అశరీరుడై వుండగలడని వరము ఒసగినారు. కావున మన్మధుని అనంగుడు అని కూడా అంటారు. ఈతని వాహనము చిలుక. ఈతని ఆయుధము చెరకు గడ తో చెసిన విల్లు. ఈతనికి (5) ఐదు శరములు లేదా బాణములు కలవు. కావున ఇతనికి పంచశరుడు లేదా పంచబాణుడు లేదా పంచసాయకుడు అను పేరు కలదు. ఈ బాణములు ఐదు సువాసన కల పుష్పములు. ఇవి ఇదు రకముల కోరికలకు సూచికలు

  1. అరవిందము (Lotus)- ద్రావిణి = flurry
  2. అశోకము (Jonesia asoka)- శోషిణి = pining
  3. చూతము (Mango blossom)- బంధిని = enslaving
  4. నవమల్లిక (Arabian jasmine)- మోహిని = bewitching
  5. నీలోత్పలము (Blue lotus)- ఉన్మాదిని = maddening

ఈతని మిత్రుడు వసంతుడు.

"https://te.wikipedia.org/w/index.php?title=పంచశరుడు&oldid=2990560" నుండి వెలికితీశారు