1. (అ.) (జ్యోతిషాంగములు) 1. తిథి, 2. వారము, 3. నక్షత్రము, 4. యోగము, 5. కరణము.
  2. (ఆ.) (యజ్ఞాంగములు) 1. దేవత, 2. హవిర్ద్రవ్యము, 3. మంత్రము, 4. ఋత్విజుడు, 5. దక్షిణ.
  3. (ఇ.) (వృక్షముల అంగములు) 1. ఆకులు, 2. పట్ట, 3. పుష్పము, 4. వేళ్ళు, 5. ఫలములు.
  4. (ఈ.) (ఉపాసనాంగములు) 1. జపము, 2. హోమము, 3. తర్పణము, 4. అభిషేకము, 5. బ్రాహ్మణ భోజనము.
  5. (ఉ.) (కన్యాదానాంగములు) 1. వాగ్దానము, 2. ఫలదానము, 3. కన్యాసంవరణము, 4. కన్యాదానము, 5. నిరీక్షణము.
  6. (ఊ.) (నాట్యాంగములు) 1. రసము, 2. భావము, 3. అభినయము, 4. గీతము, 5. ఆతోద్యము.
  7. (ఋ.) (పరార్థానుమాన ప్రమాణాంగములు) 1. ప్రతిజ్ఞ, 2. హేతువు, 3. ఉదాహరణము, 4. ఉపనయము, 5. నిగమనము.
  8. (ౠ.) 1. ఉపాయము, 2. సహాయము, 3. దేశకాల విభజనము, 4. ఆపదకు ప్రతిక్రియ, 5. కార్యసిద్ధి.
  9. "సహాయాః సాధనోపాయాః విభాగో దేశకాలయోః, వినిపాతప్రతీకారః సిద్ధిః పంచాంగమిష్యతే" [కామందకనీతిసారము]
  10. (ఎ.) (నీతి కంగములు) 1. నితాంత మంత్ర పర్యాలోచనము, 2. తదనుష్ఠానము, 3. కృత సమయరక్షణము, 4. విశేష పరిజ్ఞానము, 5. మిత్రభావ వివేకము. [భాస్కరరామాయణము ??-889]

https://web.archive.org/web/20140209111013/http://www.andhrabharati.com/dictionary/