పండిత్ తారా సింగ్

పండిత్ తారా సింగ్ నరోతమ్ (1822–1891) సిక్ నిర్మలా శాఖకు చెందిన ప్రముఖ్ పంజాబీ పండితుడు, కవి.[2] సిక్కు వేదాంతానికీ, సిక్కు సాహిత్యానికి ఎనలేని కృషి చేశారు. ప్రముఖ సిక్కు ఆరాధనా ప్రదేశం హేంకుంట్ ను కనుగొన్నవారు ఆయన. ఈ పుణ్యక్షేత్రం గురించి సిక్కుల పదవ గురువు గురు గోబింద్ సింగ్ తన సాహిత్యంలో వివరించారు. ఈ ప్రదేశంలో గురు గోబింద్ కు ప్రార్థనలు చేస్తారు భక్తులు. ఈ ప్రదేశాన్ని కనుగొన్నందువల్ల తారా సింగ్ కంఖల్ ప్రాంతంలోని నిర్మల్ పచ్చయటి అఖారాకు శ్రీ మహంత్ అయ్యారు.

Pandit Tara Singh Narotam
Pandit Tara Singh was the most well-known Nirmala sadhu.[1]
రచయిత మాతృభాషలో అతని పేరుਪੰਡਿਤ ਤਾਰਾ ਸਿੰਘ ਨਰੋਤਮ
పుట్టిన తేదీ, స్థలం1822
Kahlwan, Gurdaspur, Punjab, Sikh Empire
మరణం1891
Patiala, Patiala State
భాషPunjabi, Sanskrit
గుర్తింపునిచ్చిన రచనలుGurmat Nirnay Sagar, Sri Gur Tirath Sangrah and Guru Girarath Kos

జీవిత సంగ్రహం

మార్చు

తారాసింగ్ సిక్కుల కుటుంబంలో జన్మించారు. తన 20వ ఏట ఖాదియాన్ దగ్గర్లోని తన ఊరును వదలి, హోషియాపూర్ వద్ద కురాలాలోని సంత్ గులాబ్ సింగ్ నిర్మలా డేరాకు చేరారు.[3] అక్కడ ఆయన నిర్మలా శాఖలోకి మారారు. సిక్కు గ్రంథాలు చదువుకున్నారు. ఆ తరువాత వేదాలు, సంస్కృతం చదువుకునేందుకు అమృత్ సర్కాశీ వెళ్ళారు. కొన్నాళ్ళు బెంగాలీ నగరం శాంతిపూర్ లో కూడా ఉన్నారు. 1861లో హరిద్వార్ లో గంగానదికి జరిగిన కుంభమేళాలో కూడా పాల్గొన్నారు.

అప్పటికి తారాసింగ్ చాలా ప్రాంతాల్లో ప్రసిద్ధమైన వ్యక్తి అయ్యారు. ఆయన పాండిత్యం చాలా ప్రదేశాల్లో ప్రచారం జరిగింది. తారాసింగ్ పటియాలా ప్రాంతం చేరి స్వంతంగా ధరమ్ ధుజా పేరుతో నిర్మలా డేరాను  ప్రారంభించి పండిత గోష్ఠులు, సాహిత్యంలో కృషి చేయడంతో  పటియాలా మహారాజు, మహారాజా నరేందర్ సింగ్ ఆయనను సత్కరించి గౌరవించారు.[3] ఎంతోమంది యువకులకు పాండిత్యం నేర్పారు తారాసింగ్. ఆయన దగ్గర చదువుకున్న వారిలో ప్రముఖ సిక్కు చరిత్రకారుడు గైనీ గైన్ సింగ్, దందామీ తక్సల్ కు చెందిన బిషన్ సింగ్ జీ మురలేవాలే, సంత్ అత్తర్ సింగ్ తదితర ప్రముఖులున్నారు.[4][5][6]  1875లో నిర్మలా శాఖకు కేంద్ర సంస్థ అయిన నిర్మల్ పచ్చయతీ అఖారాకు శ్రీ మహంత్ పదవి చేపట్టారు.

శ్రీ గురు తీర్థ్ సంగ్రహ్

మార్చు

పటియాలా మహారాజు, మహారాజా నరేందర్ సింగ్ పండిత్ తారా సింగ్ ను సిక్కు గురుద్వారాల జాబితాను, అందరి సిక్కు గురువుల జీవితాలను, వారు చేసిన గొప్ప పనులను, వారి త్యాగల గురించి ఒక పుస్తకం రాయమని కోరారు. దానికి అంగీకరించిన తారా సింగ్ ఆ శ్రీ గురు తీర్థ్ సంగ్రహ్ పేరుతో పుస్తకం రాశారు. అందులో 508 వివిధ పుణ్యస్థలాలను ప్రస్తావిస్తూ హేంకుంట్ గురించి కూడా వివరించారు.

హేంకుంట్ గుర్తింపు

మార్చు
 
హేంకుట్ సరస్సు

హేంకుంట్ సాహిబ్ ను గుర్తించిన మొట్టమొదటి సిక్కు పండిత్ తారాసింగ్. గురు గోబింద్ సింగ్ రాసిన బచిటర్ నాటక్ పుస్తకంలో తాను తపస్సు చేసుకునే తప్ అస్థాన్ గురించి వివరించారు. సపత్స్రింగ్ అనే ఏడు శిఖరాల మధ్య, హేంకుంట్ పర్బత్ అనే మంచు పర్వతం దగ్గర ఆ ప్రాంతం ఉంటుందని వర్ణించారు గురు గోబింద్.[7] శ్రీ గురు తీర్థ్ సంగ్రహ్ పుస్తక రచనలో భాగంగా అంత పవిత్రమైన ప్రదేశాన్ని కనుగొనడానికి గర్హ్ వాల్ హిమాలయాలకు వెళ్ళి వెతికారు తారా సింగ్. ఆయన పుస్తకంలోని వర్ణనలను బట్టీ ఆ ప్రదేశం బద్రీనథ్ దగ్గర్లోని పండుకేశ్వర్ ప్రాంతంగా గుర్తించారు. ప్రస్తుతం ఆ ప్రదేశాన్ని గోబింద్ ఘాట్ గా వ్యవహరిస్తున్నారు. తారా సింగ్ ఈ ప్రదేశాన్ని కనుగొన్న తరువాత కొంతకాలం ఎవరికీ తెలియకపోయినా, 20వ శతాబ్దంలో సోహాన్ సింగ్, మోదన్ సింగ్ ప్రచారంలోకి తెచ్చిన దగ్గర నుంచీ అది ప్రముఖ సిక్కు పుణ్యస్థలంగా మారింది.

గుర్బానీ వ్యాఖ్యానం

మార్చు

నిర్మలా పాఠశాలలో నేర్పే సిద్ధాంతాలకు ప్రతీక పండిత్ తారా సింగ్. సిక్కు మతాన్ని హిందూ వేదాంతం నుండి పుట్టిన దానిగా అభివర్ణిస్తారు. శంకరాచార్యులు, రామానుజుల వేదాంత పద్ధతులు మేళవించిన మతంగా సిక్కు మతాన్ని వ్యాఖ్యానిస్తారు తారాసింగ్.[8] గురు నానక్ దేవ్ ను విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు ఆయన. సిక్కుమత దేవుడు వహేగురు విష్ణు నామాల్లో ఒకటిగా చెబుతారాయన. వహేగురు శబద్-అర్ధ్ టికా పుస్తకంలో వహేగురు గురుంచి  ఎన్నో విషయాలు రాశారు. మాహాన్ కోశ్ పుస్తకంలో సర్బ్ లోహ్ గ్రంథ్ ను గురుగోబింది సింగే రాశారాని తారా సింగ్ నమ్ముతారని వివరించారు. దశమ్ గ్రంథ్ కూడా గురు గోబింద్ సింగ్ రచనేనని ఆయన విశ్వాసం.[9]

రచనలు

మార్చు

ఆయన రాసిన గురుమత్ నిర్ణయ్ సాగర్, శ్రీ గురు తీర్థ్ సంగ్రహ్, గురు గైరారథ్ కోశ్ వంటి పుస్తకాలు చాలా ప్రసిద్ధి చెందాయి. 

  • వహిగురు శబ్ధార్ధ్ (1862)
  • టికా భగత్ బనికా (1872)
  • టికా గురు భవ్ దీపికా (1879)
  • శ్రీ గురు తీర్థ్ సంగ్రహ్ (1883)
  • గ్రంథ్ శ్రీ గురుమత్ నిర్ణయ సాగర్ (1877)
  • శబ్ద్ సుర్ కోశ్ (1866)
  • అకల్ మూరతి ప్రదర్శన్ (1878)
  • గురు వంశ్ తరు దర్పణ్ (1878)
  • గ్రంథ్ గురు గిరథ్ కోశ్ (1889)
  • ప్రిఖియా ప్రకరణ్ (1890)
  • టికా శ్రీ రాగా (1885)
  • ఉపదేశ్ శతక్ భాష
  • సెహ్రఫీ రాజే భర్తరి
  • జప్జీ సాహిబ్ స్తీక్

మూలాలు

మార్చు
  1. Oberoi, Harjot (1994). The Construction of Religious Boundaries: Culture, Identity, and Diversity in the Sikh Tradition. University of Chicago Press. p. 126. ISBN 9780226615929.
  2. Singh, Trilochan (2011). The Turban and the Sword of the Sikhs: Essence of Sikhism : History and Exposition of Sikh Baptism, Sikh Symbols, and Moral Code of the Sikhs, Rehitnāmās. B. Chattar Singh Jiwan Singh. p. 14. ISBN 9788176014915.
  3. 3.0 3.1 Singh, Harbans (1998). The Encyclopaedia of Sikhism: S-Z. Publications Bureau. p. 315. ISBN 9788173805301.
  4. Singh, Harjeet (2009). Faith & Philosophy of Sikhism. Delhi: Gyan Publishing House. p. 181. ISBN 9788178357218.
  5. "Leaders of Damdami Taksaal". Damdami Taksal. Archived from the original on 19 ఆగస్టు 2014. Retrieved 6 June 2014.
  6. Singh, Harjeet (2009). Faith & Philosophy of Sikhism. Gyan Publishing House. p. 181. ISBN 9788178357218.
  7. Singh Johar, Surinder (1998). Holy Sikh Shrines. New Delhi: M.D. Publications Pvt. Ltd. p. 168. ISBN 9788175330733.
  8. Pemberton, Kelly (2011). Shared Idioms, Sacred Symbols, and the Articulation of Identities in South Asia. Routledge. p. 76. ISBN 9781135904777.
  9. Kapoor, Sukhbhir (2009). Dasam Granth An Introductory Study. Hemkunt Press. p. 10. ISBN 9788170103257.