పగిడి సేత్ మాధవరావు
పగిడి సేత్ మాధవరావు[1] (2010 ఆగస్టు 27 - 1994 అక్టోబరు 14) ప్రజా సేవకుడు, బహుభాషావేత్త, నిష్ణాతుడైన చరిత్రకారుడు. ఆధునిక మరాఠా చరిత్రలో ప్రత్యేకించి శివాజీ చరిత్రలో నైపుణ్యం కలిగిన గొప్ప చిత్రకారుడు.[1][2] తన మాతృభాష అయిన కన్నడతో పాటు మరాఠీ, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, ఉర్దూ, పర్షియన్ భాషలలో ప్రావీణ్యం కలిగి ఉన్నారు.
పగిడి సేత్ మాధవరావు | |
---|---|
జననం | 1910 ఆగస్టు 27 నిలంగ, హైదరాబాదు రాష్ట్రం, (ప్రస్తుతం మహారాష్ట్రలో భాగం) |
మరణం | 1994 అక్టోబరు 14 | (వయసు 84)
విద్య | బి.ఎ, ఎం.ఎ |
విద్యాసంస్థ | బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం అలహాబాదు విశ్వవిద్యాలయం |
వృత్తి | చరిత్రకారుడు |
పురస్కారాలు | పద్మభూషణ (1992) |
జీవిత విశేషాలు
మార్చుమాధవరావు 1910 ఆగస్టు 27 న హైదరాబాద్ రాష్ట్రంలోని నీలంగాలో (ఇప్పుడు మహారాష్ట్రలో భాగం) బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 1930 లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని, మూడేళ్ల తర్వాత అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందాడు. ఆ తరువాత మహారాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశాడు.
భాషా వేత్తగా
మార్చుమాధవరావు భాషావేత్తగా గియడి అనే గిరిజన మాండలిక వ్యాకరణాన్ని కనుగొన్నాడు. అతను స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నో అసమానతలకు వ్యతిరేకంగా మరాఠీకి సేవ చేసిన వ్యక్తి. ప్రముఖ బెంగాలీ చరిత్రకారుడు జాదునాథ్ సర్కార్ అడుగుజాడలను అనుసరించి, శివాజీ జీవిత చరిత్రను మరాఠీ, ఆంగ్లంలో రాసాడు. ఈ సిద్ధాంతం తన పాఠకులలో జాతీయతా స్ఫూర్తిని రేకెత్తించింది.
పురస్కారాలు
మార్చు1992వ సంవత్సరంలో లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ప్రదానం చేసింది.[3]
సాహిత్య రచనలు
మార్చు- ఆదిలాబాద్ గోండ్స్లో, 1949
- కొలామి భాష వ్యాకరణం, 1950
- గోండి భాష వ్యాకరణం, 1954
- ఆదిలాబాద్‌లో గిరిజన సంక్షేమం, 1950
- హైదరాబాద్‌లో స్వాతంత్ర్య పోరాట చరిత్ర: 1800-1920
- ఏయిటీన్త్ సెంచరీ డెక్కన్ 1963
- మరాఠా మొఘల్ సంబంధాలు: 1680-1707, 1966
- మరాఠా చరిత్రలో అధ్యయనాలు 1971
- అశోకచి పనే, వ్యాసాల సమాహారం, 1941
- వరంగల్చే కాకతీయ రాజే, 1946
- సూఫీ సంప్రదాయ, తత్వజ్ఞాన్ అని కార్య, 1953
- మీర్జా గాలిబ్ అని త్యాచ్యా గజాలా, 1958
- పానిపచ్చ సంగ్రామ్, 1961
- మొగల్ మరాఠా సంఘర్ష్ (मोगल मराठा संघर्ष), 1965
- తహ్మాస్నామా, 1967
- శివచరిత్ర: ఏక్ అభ్యాస్, 1971
- ఛత్రపతి శివాజీ, 1974
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 K. Venkateshwarlu, A slice of Marathi history, The Hindu, 9 May 2011.
- ↑ Indica, Volume 32. Heras Institute of Indian History and Culture, St. Xavier's College. 1995. p. 67.
In the person of Setu Madhavrao, who died last October at the age of 85, India has lost an outstanding intellect: an able civil servant, an accomplished historian and a distinguished man of letters.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved July 21, 2015.