పట్టు (సిల్క్)
ఈ పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీ. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
పట్టు లేదా సిల్క్ అనేది పట్టు పురుగు తయారు చేసుకున్న కోకోన్ అనే పట్టుగూడు నుంచి తయారయ్యే ఒక సహజ పోగు. సిల్క్‌ను తరచుగా వస్త్రం తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ వస్త్రంను బట్టలు, రగ్గులు, మెత్తలు తయారు చేసుకొనుటకు ఉపయోగిస్తారు ఇంకా ఈ వస్త్రంపై వ్రాయడానికి లేదా చిత్రాలు గీయడానికి ఉపయోగిస్తారు. పట్టుదారాలు చాలా బలంగా ఉంటాయి. గతంలో, పారాచ్యుట్స్ తయారు చేయడానికి పట్టు ఉపయోగించబడింది. చరిత్ర ప్రకారం, సిల్క్‌ను మొదట చైనాలో ఉపయోగించారు, అక్కడ నుండి అన్ని దేశాలకు దాని వాడకం వ్యాప్తి చెందింది. పట్టు ఉత్పత్తి కొరకు పట్టు పురుగులు పెంచు విధానాన్ని పట్టుపరిశ్రమ (సెరికల్చర్) అంటారు. చాలా సాలెపురుగులు సహజ పోగులను (నాచ్యులర్ ఫైబర్) తయారు చేస్తాయి దానిని కూడా సిల్క్ అని అంటారు.
మూలాలుసవరించు
ఈ వ్యాసం జీవన విధానానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |