జెండా సాధారణంగా ఒక వస్త్రంలో కొంత భాగం. సాధారణంగా దీని రూపకల్పన దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది, సంకేతాలు ఇవ్వడానికి సంకేత ఉపకరణంగా, లేదా అలంకరణగా జెండాను ఉపయోగిస్తారు. జెండాను పతాకం అని కూడా అంటారు.జెండాను ఆంగ్లంలో ఫ్లాగ్ (Flag) అంటారు.జెండా రేఖాత్మక రూపకల్పన మరొక మాధ్యమ వర్ణనను సూచించడానికి కూడా ఉపయోగిస్తారు.మొదట జెండాలు యుద్ధరంగాలలో సైనిక సమన్వయ సహాయం కొరకు ఉపయోగించారు.సైనికులు, నౌకాయానం చేసే వారు సంకేత పదాల ద్వారా వార్తలను చేర వేయు పద్ధతి (సేమఫోరే) మాదిరిగా, ప్రతికూలమైన వాతావరణంలో ఒకరి నుంచి ఒకరు ప్రాథమిక సంకేతాలు పంచుకోవడానికి, తెలుసుకోవడానికి, గుర్తించడానికి ఒక సాధారణ సాధనంగా జెండాలను ఉపయోగించారు. దేశ భద్రతకు పాటు పడే సైనికులు తరచుగా జెండాలు ఉపయోగించటం వలన అవి జాతీయ జెండాలుగా, శక్తివంతమైన దేశభక్తికి చిహ్నాలుగా ప్రజల మనస్సుల్లో బలంగా నాటుకున్నాయి.ఇంకా జెండాలను సందేశాలు ఇవ్వడానికి, ప్రకటన తెలియజేయడానికి, లేదా అలంకరణ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.జెండాల అధ్యయనాన్ని వెక్సిల్లాలజీ అంటారు. లాటిన్ భాషలో వెక్సిల్లమ్ అంటే జెండా లేదా బ్యానర్.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత జాతీయ జెండా ఉత్సవమును నిర్వహిస్తున్న విద్యార్థులు
భారత జాతీయపతాకంలను రెపరెపలాడిస్తూ దేశభక్తిని చాటుతున్న విద్యార్థులు

మూలాలు మార్చు


ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=పతాకం&oldid=2922589" నుండి వెలికితీశారు