పతనంతిట్ట

కేరళ రాష్ట్రం లోని నగరం
(పత్తనంతిట్ట నుండి దారిమార్పు చెందింది)

పతనంతిట్ట, భారతదేశం , కేరళ రాష్ట్రం లోని సెంట్రల్ ట్రావెన్‌కోర్ ప్రాంతంలో 23.50 కిమీ2 వైశాల్యంలో విస్తరించి ఉన్న పురపాలిక పట్టణం. ఇది పతనంతిట్ట జిల్లాకు పరిపాలనా రాజధాని. పట్టణంలో 37,538 జనాభా ఉంది. హిందూ పుణ్యక్షేత్రం శబరిమల పతనంతిట్ట జిల్లాలో ఉంది. శబరిమలకి ప్రధాన రవాణా కేంద్రంగా, ఈ పట్టణాన్ని 'కేరళ యాత్రికుల రాజధాని' అని పిలుస్తారు.[3] జిల్లా ప్రధాన కార్యాలయం పతనంతిట్ట పట్టణంలో ఉంది.

Pathanamthitta
Pilgrim Capital of Kerala
Town
From left to right : Sabarimala temple, Padayani is an art form, Konni elephant cage, Gavi, Aranmula Mirror, Kerala Boat Race.
Pathanamthitta is located in Kerala
Pathanamthitta
Pathanamthitta
Location in Kerala, India
Pathanamthitta is located in India
Pathanamthitta
Pathanamthitta
Pathanamthitta (India)
Coordinates: 9°15′53″N 76°47′13″E / 9.2648°N 76.7870°E / 9.2648; 76.7870
Country India
StateKerala
DistrictPathanamthitta
Founded byK. K. Nair[1]
Government
 • CollectorDr. Divya S. Iyer[2] (2021-Present)
విస్తీర్ణం
 • Total23.50 కి.మీ2 (9.07 చ. మై)
Elevation
31 మీ (102 అ.)
జనాభా
 (2011)
 • Total37,538
 • జనసాంద్రత1,600/కి.మీ2 (4,100/చ. మై.)
Languages
 • OfficialMalayalam
Time zoneUTC+5:30 (IST)
PIN
689645
Telephone code0468
Vehicle registrationKL – 03

చరిత్ర

మార్చు

పట్టణం ఏర్పడిన ప్రాంతాలు గతంలో పాండ్య రాజ్యంతో సంబంధాలు కలిగి ఉన్న పందళం పాలనలో ఉన్నాయి. హిందూ దేవుడు అయ్యప్ప ఈ ప్రాంతానికి రాజు అని నమ్ముతారు.[4] సా. శ.1820లో పందళం రాచరిక రాష్ట్రమైన ట్రావెన్‌కోర్‌లో చేర్చబడినప్పుడు, ఈ ప్రాంతం ట్రావెన్‌కోర్ పరిపాలనలోకి వచ్చింది. దీని ఆధునిక పతనంతిట్ట జిల్లా, కేరళ రాష్ట్రంలోని పదమూడవ రెవెన్యూ జిల్లాగా, 1982 నవంబరు 1న నుండి అమలులోకి వచ్చింది. భారతీయ రాజకీయ నాయకుడు కె. కె. నాయర్ చేసిన కృషి వల్ల ఇది ఏర్పడింది.[5]

భౌగోళికం

మార్చు

పతనంతిట్ట సముద్ర మట్టానికి సగటున 18 మీటర్లు (62 అడుగులు) ఎత్తులో ఉంది.[6] ఇది దక్షిణం నుండి శబరిమలకి వెళ్లే ప్రధాన ట్రంక్ రహదారి అదూర్ వద్ద ఎం.సి. రోడ్ నుండి ఎన్.హెచ్.3ఎ పతనంతిట్ట మీదుగా ప్రారంభమవుతుంది. ఉత్తరం నుండి తిరువల్ల ఎం.సి. నుండి ప్రారంభమై రాష్ట్ర రహదారి 7 (కేరళ), ప్రధాన తూర్పు రహదారి (పునలూర్-మువట్టుపుజా రోడ్ / రాష్ట్ర రహదారి -08), ప్రధాన సెంట్రల్ రోడ్ (కేశవదాసపురం-అంగమలీ రోడ్/రాష్ట్ర రహదారి -01), జాతీయ రహదారి 183ఎ ద్వారా కొల్లాం -తేని వయా అడూర్- పతనంతిట్ట కొనసాగుతుంది.

జనాభా గణాంకాలు

మార్చు

పతనంతిట్ట, కోజెంచేరి తాలూకాలో ఉన్న పురపాలకసంఘ పట్టణం. పతనంతిట్ట నగరం 29 వార్డులుగా విభజించబడింది, వీటికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం, పతనంతిట్ట నగరంలో మొత్తం 9,813 కుటుంబాలు నివసిస్తున్నాయి. పతనంతిట్ట మొత్తం జనాభా 37,538, అందులో 17,744 మంది పురుషులు కాగా, 19,794 మంది స్త్రీలు ఉన్నారు. పతనంతిట్ట సగటు లింగ నిష్పత్తి 1,116.[7]

పతనంతిట్ట నగరంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3,400, ఇది మొత్తం జనాభాలో 9% శాతం ఉంది.వారిలో 1723 మంది మగ పిల్లలుకాగా, 1677 మంది ఆడ పిల్లలు ఉన్నారు. పతనంతిట్టలోని బాలల లింగ నిష్పత్తి 973, ఇది సగటు లింగ నిష్పత్తి (1,116) కంటే తక్కువ. అక్షరాస్యత రేటు 96.4%. ఆ విధంగా పతనంతిట్ట జిల్లాలోని 96.5% అక్షరాస్యతతో పోలిస్తే పతనంతిట్ట తక్కువ అక్షరాస్యతను కలిగి ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 97.4% శాతం ఉంది. స్త్రీల అక్షరాస్యత రేటు 95.52% శాతం ఉంది.[8]

మతాల ప్రకారం జనాభా

మార్చు

పతనంతిట్టలోని మొత్తం జనాభాలో హిందూసమాజానికి చెందినవారు 57% శాతంమంది ఉన్నారు. వారి తరువాత క్రైస్తవులు 38% శాతం మంది గణనీయమైన మైనారిటీగా ఉన్నారు.[9]

మతపర కార్యక్రమాలు

మార్చు

పతనంతిట్టలోని చెరుకోల్‌పుజా సమావేశం హిందువుల ముఖ్యమైన మతపర సమావేశం. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో పంబా నది ఇసుక ఒడ్డున చెరుకోల్ వద్ద జరుగుతుంది. ఇది అయిరూర్ గ్రామంలోని విద్యాధిరాజా నగర్‌లో ఐరూర్-చెరుకోల్‌పుజ హిందూమత మహా మండలం నిర్వహిస్తుంది.[10]

ఆసియాలో అతిపెద్ద క్రైస్తవ సమావేశాలలో ఒకటైన మారమోన్ కన్వెన్షన్, భారతదేశంలోని కేరళలోని పతనంతిట్టలోని మారమోన్‌లో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో కోజెంచేరి వంతెన పక్కన ఉన్న పంపా నది విస్తారమైన ఇసుక మీద జరుగుతుంది. దీనిని మలబార్ మార్ థోమా సిరియన్ క్రిస్టియన్ ఎవాంజెలిస్టిక్ అసోసియేషన్ నిర్వహిస్తుంది, దీనిని సాధారణంగా ఎం.టి.ఇ.ఎ. అని పిలుస్తారు, ఇది మలంకర మార్ థోమా సిరియన్ చర్చి మిషనరీ విభాగం.

కుంబనాడ్ కన్వెన్షన్ కేరళలో రెండవ అతిపెద్ద క్రైస్తవ సమావేశం ఇది ఇండియా పెంటెకోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్ సాధారణ సమావేశం. ఇది ఏటా జనవరి రెండవ చివరి వారంలో కుంబనాడ్, హెబ్రోన్‌పురంలో జరుగుతుంది.

మధ్య తిరువితంకోర్ సిరియన్ కన్వెన్షన్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో 3 రోజుల లెంట్ సమయంలో జరుగుతుంది. ఇది తుంపామోన్ డియోసెస్ ఆధ్వర్యంలో 1918లో ప్రారంభించారు. ఇది సెయింట్ స్టీఫెన్స్ కేథడ్రల్, మకంకున్ను, పతనంతిట్ట మైదానంలో జరుగుతుంది. తెంగుంతరయిల్ గీవర్గీస్ కోర్పిస్కోపా చర్చి వికార్‌గా ఉన్నప్పుడు ఇది ప్రారంభించారు. ఇది ఆర్థడాక్స్ సిరియన్ చర్చిలో పురాతనమైన అతిపెద్ద సమావేశం.

వృత్తులు

మార్చు

వ్యవసాయం

మార్చు

వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తి. దాదాపు 75% మంది ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు. రబ్బరు అత్యంత ముఖ్యమైన పంట, దాని తోటలు 478 చదరపు కిలోమీటర్లు (185 చదరపు మైళ్ళు) విస్తరించి ఉన్నాయి.ఈ ప్రాంతం అధిక తేమతో కూడిన కొండ భూభాగం అయినందున రబ్బరు తోటలకు అనువుగా ఉంది. తడి భూముల్లో సాగు చేసే ముఖ్యమైన పంట వరి. టాపియోకా, పప్పుధాన్యాలు , ముఖ్యమైన పొడి భూమి పంటలు. ఇతర ప్రధాన పంటలు కొబ్బరి, అరటి, మిరియాలు, అల్లం. కొన్ని ప్రాంతాలలో జీడి, పైనాపిల్, చెరకు, కోకో ఇతర చెట్ల సుగంధాలను సాగు చేస్తారు. జిల్లాలో గణనీయమైన విస్తీర్ణం రిజర్వ్ ఫారెస్ట్ అయినందున సాగుకు అందుబాటులో ఉన్న భూమి తక్కువగా ఉంది.

చేపలు

మార్చు

నదులు, రిజర్వాయర్లు, వాగులు, చెరువులు, క్వారీలు, వరి పొలాలు వంటి మంచినీటి వనరులతో కేరళ రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలలో మత్స్య పెంపకంలో పతనంతిట్ట ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉంది. మంచినీటి సర్వే స్టేషన్‌ను ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతంలో మత్స్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

ప్రార్థనా స్థలాలు

మార్చు
  • శబరిమల శ్రీ అయ్యప్ప దేవాలయం, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం, పతనంతిట్ట జిల్లాలోని శబరిమల కొండల్లో ఉంది. దీనిని 'పిల్‌గ్రిమ్ క్యాపిటల్ ఆఫ్ కేరళ' అని పిలుస్తారు.
  • అరన్ముల పార్థసారథి ఆలయం దివ్య దేశాల్లో ఒకటి, 12 మంది కవి సాధువులు లేదా ఆళ్వార్లచే గౌరవించబడిన విష్ణువు 108 ఆలయాలు.
  • అనిక్కత్తిలమ్మక్షేత్రం, శివపార్వతి ఆలయం
  • త్రికలంజూర్ శ్రీమహాదేవ దేవాలయం
  • వైపూర్ మహాదేవ ఆలయం
  • మలయాళప్పుజలోని మలయాళప్పుజ దేవి ఆలయం
  • సెయింట్ పీటర్స్ మలంకర సిరియన్ కాథలిక్ కేథడ్రల్, పతనంతిట్ట
  • అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియా, తిరువల్ల
  • ఇండియా పెంటెకోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్, హెబ్రోన్‌పురం, కుంబనాడ్
  • సెయింట్ పీటర్ అండ్ సెయింట్ పాల్స్ చర్చి, పరుమల
  • సెయింట్ జార్జ్ ఆర్థోడాక్స్ చర్చి, మైలప్ర, దీనిని 'మైలప్ర వలియపల్లి అని కూడా పిలుస్తారు
  • సెయింట్ మేరీస్ ఆర్థోడాక్స్ చర్చి, కల్లోప్పర

చిత్రమాలిక

మార్చు

మూలాల

మార్చు
  1. "Pathanamthitta Collectorate opens its walls of art for remembering K.K. Nair the Father of Pathanamthitta District". The Hindu. Retrieved 29 April 2017.
  2. Web Desk, Express (23 December 2016). "Pathananthitta is first cashless collectorate in Kerala". The Indian Express. Kerala. Retrieved 27 December 2016.
  3. "KeralaTravels". Archived from the original on 15 September 2013. Retrieved 27 August 2013.
  4. "History — Pathanamthitta"
  5. "History — Pathanamthitta"
  6. "FallingRain Map". Fallingrain.com. Retrieved 2013-03-21.
  7. "Pathanamthitta Population, Caste Data Pathanamthitta Kerala - Census India". www.censusindia.co.in. Retrieved 2023-06-12.
  8. "Pathanamthitta Population, Caste Data Pathanamthitta Kerala - Census India". www.censusindia.co.in. Retrieved 2023-06-12.
  9. "Demography | Pathanamthitta District, Government of Kerala | India".
  10. Cherukolpuzha, Kerala Department of Tourism

వెలుపలి లంకెలు

మార్చు