కేరళలో శబరిమల అయ్యప్ప ఆలయానికి పేరుపొందిన పుణ్యక్షేత్రం.లక్షలాది మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకుంటున్నారు.ఈ సన్నిధానం ముఖ్యంగా పదునెట్టాంబడి 18 మెట్లు ఉన్నాయి.41 రోజు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటుంది.18 మెట్లు బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరం వంటి పంచలోహాలతో ఈ 18 మెట్లకు పూతలా వేశారు. గతంలో పదునెట్టాంబడి ఎక్కే భక్తులు మెట్టు మెట్టుకూ కొబ్బరికాయలు కొట్టే ఆనవాయితీ ఉండేది. దీనివల్ల మెట్లు పూర్తిగా శిథిలమయ్యాయి.1985 నవంబర్‌ 30న పంచలోహాలతో చేసిన మెట్లకు అమర్చారు. కొబ్బరికాయలు మెట్ల మీద కొట్టకుండా పడి పక్కనే కింద భాగంలో కొట్టే ఏర్పాటు కూడా చేశారు.[1]

పదునెట్టాంబడి

పదునెట్టాంబడిపై అష్టాదశ దేవతలు

మార్చు

1.మహాంకాళి 2. కళింకాళి 3.భైరవ 4.సుబ్రహ్మణ్య 5.గంధర్వరాజ 6.కార్తవీర్య 7. కృష్ణ పింగళ 8. హిడింబ 9.బేతాళ 10. నాగరాజ 11. కర్ణ వైశాఖ 12. పుళిందిని 13. రేణుకా పరమేశ్వరి 14. స్వప్న వారాహి 15.ప్రత్యంగళి 16.నాగ యక్షిణి 17. మహిషాసుర మర్దని 18. అన్నపూర్ణేశ్వరి.

18 మెట్ల పేర్లు

మార్చు

ఈ 18 మెట్లకు ప్రత్యేకమైన పేర్లు కూడా ఉన్నాయి. అవి: 1. అణిమ 2. లఘిమ 3. మహిమ 4. ఈశ్వత 5. వశ్యత 6. ప్రాకామ్య 7. బుద్ధి 8. ఇచ్ఛ 9. ప్రాప్తి 10. సర్వకామ 11. సర్వ సంపత్కర 12. సర్వ ప్రియకర 13. సర్వమంగళాకార 14.సర్వ దుఃఖ విమోచన 15.సర్వ మృత్యుప్రశమన 16. సర్వ విఘ్ననివారణ 17.సర్వాంగ సుందర 18.సర్వ సౌభాగ్యదాయక

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి, దినపత్రికలు (2018). "అయ్యప్పస్వామి మెట్ల కధ". {{cite journal}}: Cite journal requires |journal= (help)