తెలుగుభాషకు మాత్రమే స్వంతమైన, మరే ఇతర భాషాసాహిత్యాలలోనూ కానరాని అద్భుత ప్రక్రియ "తెలుగు పద్యనాటకం".

దాదాపు 125 ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ రంగంలో, గురజాడ అప్పారావు-కన్యాశుల్కం; చిలకమర్తి లక్ష్మీనరసిం హం పంతులు-గయోపాఖ్యానం ;తిరుపతి వేంకటకవులు-పాండవోద్యోగ విజయాలు; బలిజేపల్లి లక్ష్మీకాంత కవి-సత్యహరిశ్చంద్రీయం; కాళ్ళకూరి నారాయణ రావు-చింతామణి, వరవిక్రయం, మధుసేవ; పండిత బళ్ళారి సుబ్రహ్మణ్య శాస్తి- లవకుశ; పానుగంటి లక్ష్మీనరసింహారావు - కంఠాభరణం; ముత్తరాజు సుబ్బారావు - కృష్ణ తులాభారం వంటి ఎన్నో అద్భుతమైన నాటకాలు వెలువడ్డాయి. ఎందరెందరో ప్రాతఃస్మరణీయులు అజరామరమైన రచనలు చేశారు. బందా కనకలింగేశ్వర రావు, అద్దంకి శ్రీరామమూర్తి,స్థానం నరసిం హా రావు, అబ్బూరి వరప్రసాద రావు, పీసపాటి నరసింహ మూర్తి, షణ్ముఖి ఆంజనేయ రాజు, ఎ.వి.సుబ్బారావు, డి.వి.సుబ్బారావు వంటి మరెందరో మహానుభావులు తమ గాత్రంతో, నటనతో ఈ పద్యనాటకాలకు జీవం పోశారు.