పన్ను (ఆర్థిక వ్యవస్థ)
పన్ను అనేది ఆర్థిక వ్యవస్థలో భాగం. ఈ పన్నులు ఒక వ్యక్తికి లేదా సంస్థలపై వారు నివసించే ప్రభుత్వం రాజ్యాంగ పరంగా విధించేవిగా ఉంటాయి. భారతదేశంలో కొన్ని పన్నులు కేంద్ర ప్రభుత్వం విధిస్తే మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది.
పన్ను నియమాలు
మార్చువన్నులు స్థూలంగా రెండు రకాలు: ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు.
ప్రత్యక్ష పన్నులు
మార్చువ్యక్తులు, సంస్థలపై నేరుగా విధించే పన్నులని ప్రత్యక్ష పన్నులని అంటారు. ఉదాహరణకి, ఆదాయపు పన్ను.
- ఆదాయపు పన్ను (Income Tax)
- ఆస్తి పన్ను (Property Tax)
- వృత్తి పన్ను (Professional Tax)
- సంపద పన్ను (Wealth Tax)
పరోక్ష పన్నులు
మార్చుపన్ను చెల్లించాల్సిన వారి వద్ద నుండి కాకుండా మూడోపక్షం నుండి వసూలు చేస్తే వాటిని పరోక్ష పన్నులు అంటారు. అయితే, మూడోపక్షం వారికి చెల్లించే విలువలో పన్ను కూడా కలిసివుంటుంది. ఆ కలిసి ఉన్న పన్నుని మూడోపక్షం వారు ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఉదాహరణకి, అమ్మకపు పన్ను.
- అమ్మకపు పన్ను (Sales Tax)
- ఎక్సైజ్ సుంకం (Excise Duty)
- కస్టమ్స్ సుంకం (Customs Duty)
- కార్పోరేషన్ పన్ను (Corporate Tax)
- వినోదపు పన్ను (Entertainment Tax)
- సర్వీస్ పన్ను (Service Tax)
- (Stamp Duty)