పమేలా సత్పతి, (అంగ్లం: Pamela Satpathy) 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. నాలుగో ప్రయత్నంలో 51వ ర్యాంకు సాధించి భద్రాచలం జిల్లా సబ్‌ కలెక్టర్‌గా, వరంగల్ క‌మిష‌న‌ర్‌గా, యాదాద్రి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించింది.[1][2]

పమేలా సత్పతి
పమేలా సత్పతి
జననం
పమేలా

1987, ఆగస్టు 27
వృత్తిప్రభుత్వ అధికారిణి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఐఏఎస్‌ అధికారిణి
జీవిత భాగస్వామిదీపాంకర్
పిల్లలుఒక కుమారుడు (నైతిక్ సత్పతి)
తల్లిదండ్రులు
  • ఆర్.కె. సత్పతి (తండ్రి)

జననం, విద్య

మార్చు

పమేలా సత్పతి 1987, ఆగస్టు 27న ఒడిశా రాష్ట్రం, కోరాపుట్ జిల్లాలోని సునాబెడలో జన్మించింది. తండ్రి ఆర్.కె. సత్పతి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అధికారి.[3]

10వ తరగతిలో 92% మార్కులు, 12వ సిబిఎస్ఈ బోర్డ్ పరీక్షలో 87% మార్కులు సాధించింది. జేఈఈలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో అడ్మిషన్ తీసుకుంది. కంప్యూటర్ సైన్స్‌లో బి.టెక్ పూర్తి చేసింది. సోషియాలజీ, హ్యూమన్ రైట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కూడా పొందింది. పమేలా 12వ తరగతిలో ఉన్నప్పుడు యుపిఎస్సి పరీక్షలకు చదువుతూ, 2014లో యుపిఎస్సి సిఎస్ఈ 2014లో యుపిఎస్సి టాపర్ గా నిలిచింది. ఐఏఎస్ పరీక్షలో 51వ ర్యాంక్‌ను సాధించింది.[4]

వ్యక్తిగత జీవితం

మార్చు

పమేలా సత్పతికి 2012 డిసెంబరు 8న ప్రముఖ వైద్యుడు దీపాంకర్ తో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు (నైతిక్ సత్పతి) ఉన్నాడు.

ఉద్యోగ జీవితం

మార్చు

కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ పూర్తిచేసిన పమేలా, ఇన్ఫోసిస్‌లో మొదటి క్యాంపస్ ప్లేస్‌మెంట్ పొంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది. శిక్షా ఓ అనుసంధన్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేసింది.

ప్రభుత్వ అధికారిణిగా

మార్చు

2015లో ఐఏఎస్ పూర్తిచేసుకున్న ప‌మేలా, మొదట భద్రాచలం సబ్‌ కలెక్టర్‌గా నియమితులయింది. అక్కడ 19 నెలలపాటు పనిచేసి, మూడునెలలపాటు భద్రాచలం దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగానూ, ఆ త‌ర్వాత 11నెల‌లు భూసేకరణ శాఖలోనూ పనిచేసింది. 2019 డిసెంబ‌రులో వరంగల్లు మహానగర పాలకసంస్థ క‌మీష‌న‌ర్‌గా బాధ్యత‌లు చేప‌ట్టి, న‌గ‌రాభివృద్ధిపై చెర‌గ‌ని ముద్రను వేసింది. 2021 జూన్ 14న యాదాద్రి జిల్లా కలెక్టర్ గా నియమించబడింది.[1] 2023, జూలై 31న సాధారణ పరిపాలన విభాగానికి బదిలీ అయింది.[5]

ఇతర వివరాలు

మార్చు

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోని ఓ అంగ్​వాడీ కేంద్రంలో తన కుమారుడిని పేరును నమోదు చేయించి, తన ప్రత్యేకతను చాటుకుంది. అంగన్ వాడీ కేంద్రం నుంచి 16 గుడ్లు, బాలామృతాన్ని కలెక్టర్‌ పమేలాకు అందజేశారు.[6][7]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Reporter, Staff (2021-06-14). "Pamela Satpathy assumes charge". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2021-06-14. Retrieved 2022-03-19.
  2. Telugu, TV9 (2021-06-13). "Pamela Satpathy : యాదాద్రి జిల్లా కలెక్టర్‌గా పమేలా సత్పతి.. బదిలీ అయిన అనితా రామచంద్రన్." TV9 Telugu. Archived from the original on 2021-06-13. Retrieved 2022-03-19.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Pamela Satpathy, IAS : నాడు ఎన్నో అవమానాలు.. నేడు ఎందరికో ఆదర్శంగా..!". Sakshi Education. 2022-02-09. Archived from the original on 2022-03-19. Retrieved 2022-03-19.
  4. "IAS Pamela Satpathy Biography - Wiki, Age, Husband, Latest News, Family & Career". 2021-06-15. Archived from the original on 2022-03-19. Retrieved 2022-03-19.
  5. "నూతన కలెక్టర్‌గా వినయ్‌ కృష్ణారెడ్డి". EENADU. 2023-08-01. Archived from the original on 2023-08-01. Retrieved 2023-08-01.
  6. India, The Hans (2022-02-02). "Bhongir: Collector Pamela Satpathy's son name registered for Anganwadi". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-02. Retrieved 2022-03-19.
  7. "అంగన్‌వాడీ కేంద్రంలో కలెక్టర్‌ బిడ్డ". Sakshi. 2022-02-03. Archived from the original on 2022-02-16. Retrieved 2022-03-19.