పరకాలుడు (తిరుమంగై ఆళ్వార్‌) చోళరాజుల వద్ద సామంతుడు. ప్రభుత్వ సొమ్ము కొంచెం కూడా పోనీయకుండ, అన్యాయపు సొమ్ము రానీయకుండ పాలించాడు.

చోళ సామ్రాజ్యం పటం

జీవిత విషయాలు

మార్చు

ఈయన కలియుగం పుట్టిన నన్నూఱు సంవత్సరంకాలంలో తిరువాలిత్తిరునగరు అనే గ్రామంలో నీలుడు అను ఒక శూద్రునికి జన్మించాడు. విలువిద్యతోపాటు అన్ని విద్యలు నేర్చుకొని చోళరాజు వద్ద సామంతరాజుగా అధికారం సంపాదించుకొని తనకు తగిన నలుగురు మంత్రులను చేర్చుకొని రాజ్యాన్ని పాలించాడు. శాపం కారణంగా మానవ రూపంలో జన్మించిన కుముదవల్లి అనే కన్యకను పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. రోజుకు 1008 మందికి (తదియారాదనచేస్తే అన్నదానం) ఏడాది పాటు చేస్తేనే తనని పెళ్ళి చేసుకుంటానని కొమదవల్లి చెపుతుంది. ఆమె మాట మేరకు ఏడాదిపాటు రోజుకు 1008 మందికి తిరువారాధన చేయగా ఆయన ఆస్తి మొత్తం అయిపోతుంది. ఆ పరిస్థితుల్లో తన సహచరులతో కలిసి రాత్రిపూట దారి దోపిడీలు చేస్తూ, ధనవంతుల సొమ్మును దొంగలించి వాటితో ప్రతిరోజు తదియారాదనకు ఉపయోగించేవాడు.

ఒకరోజు మానవరూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు, లక్ష్మీలు తిరుమంగై ఆళ్వార్‌కు తారసపడగా, విష్ణువు వద్ద ఉన్న ఆభరణలన్నింటినీ తీసుకొని కాలికి ఉన్న కడియంను ఇవ్వమని అడుగుతాడు. నీవే తీసుకో అని విష్ణువు చెప్పగా, కాలికి ఉన్న కడియంను తీసేప్పుడు విష్ణువు పాదస్పర్శతో ఆళ్వార్‌కు జ్ఞానోదయమై అనర్గళంగా ఆశు కవిత్వం చెప్తాడు. అలా ఆళ్వార్‌ వెయ్యి పాశురాలు ఉన్న పెరియ తిరుముడి అనే ప్రబంధంతోపాటు మరో ఐదు ప్రబంధాలను స్వయంగా రచించాడు. ఆ తరువాత శ్రీరంగంలోని రంగనాథుని దేవాలయ గోపుర ప్రాకారాలను కట్టించి ఆమెను పెండ్లి చేసుకొని భాగవత భక్తుడై ముక్తిని పొందాడు.[1]

రచనలు

మార్చు

ఆళ్వార్‌ రాసిన ప్రబంధాలు

  1. పెరియతిరుమొళి: 86 దివ్యమైన పుణ్యక్షేత్రాలను చూసి, ఆ వూరి వాతావరణం, అక్కడి అందచందాలను తెలుపుతూ, అక్కడ కొలువై వున్న స్వామి వారిని గురించి వివరిస్తూ రాశాడు. ఇందులో 1084 పాశురములు కలవు. ఆ భగవంతుడి అవతారాలను, శాస్త్రోక్తముగా, మంత్రములతో, పూజించడం రాకపోతే, మనకు దగ్గరలో వున్న, దేవాలయములకు కాని, పుణ్యక్షేత్రములకు కాని, వెళ్లి, అక్కడ వున్న దేవుడిని పూజించినా కూడా ఎక్కువ పుణ్యం వచ్చి, మంచి ఫలితాలు వస్తాయని అని ఇందులో వివరించాడు.
  2. తిరుక్కురున్డాణ్డకమ్
  3. తిరునెడున్దాణ్డకమ్
  4. తిరువెళుక్కుత్తిరుక్కై
  5. శిఱియ తిరుమడల్
  6. పెరియతిరువడిల్

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (18 April 2019). "సంప్రదాయబద్దంగా దొంగల దోపు". www.andhrajyothy.com. Archived from the original on 14 July 2020. Retrieved 14 July 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=పరకాలుడు&oldid=3265996" నుండి వెలికితీశారు