ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫి
పరారుణ ఛాయాగ్రహణము లేదా ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీ (infrared photography) లో ఇన్ఫ్రారెడ్ కాంతిని గుర్తించగలిగే ఫిలిం గానీ, ఇమేజ్ సెన్సర్ని గానీ ఉపయోగిస్తారు. ఇందులో ఉపయోగించే వర్ణపట భాగాన్ని సమీప పరారుణం (near-infrared) అంటారు. కాగా సుదూర పరారుణం (far-infrared) థర్మల్ ఇమేజింగ్కి ఉపయోగపడే వర్ణపట భాగం. ఇటువంటి ఫోటోగ్రఫీకి ఉపయోగించే తరంగ దైర్ఘ్యాలు 700 ఎన్ ఎం (nm) నుండి 900 ఎన్ ఎం వరకు ఉంటాయి. అయితే ఫిలిం దృశ్యమాన వర్ణపట (కంటికి కనబడే) కాంతిని కూడా గుర్తించగలదు. అందుకే సాధారణ కాంతి మొత్తాన్ని నిరోధించి, కేవలం ఇన్ఫ్రారెడ్ కాంతిని అనుమతించే ఫిల్టర్ (అందుకే ఈ ఫిల్టర్లు నలుపు రంగులోనో లేదా ముదురు ఎరుపు రంగులోనో ఉంటాయి) ని వాడవలసిన అవసరం ఉంటుంది. (ఇన్ఫ్రారెడ్ ఫిల్టర్ కి అర్థం కేవలం ఇన్ఫ్రారెడ్ కాంతిని అనుమతించే ఫిల్టర్ అయినా కావచ్చును, లేదా కేవలం ఇన్ఫ్రారెడ్ కాంతిని నిరోధించే ఫిల్టర్ అయినా కావచ్చు.)
పరారుణ , దృశ్యమాన వర్ణపట ఫోటోల మధ్య భేదం
-
సమీప పరారుణ శ్రేణి (near infrared range) లో ఫోటో తీయబడిన ఒక వృక్షము
-
దృశ్యమాన వర్ణపటం (visible spectrum) లో అదే వృక్షము
ఇటువంటి ఫిల్టర్ లని ఇన్ఫ్రారెడ్ కాంతిని గుర్తించగలిగే ఫిలిం/సెన్సర్ లతో కలిపి ఉపయోగించినపుడు ఆసక్తికరమైన ప్రభావానికి గురై ఫోటోలలో అవాస్తవిక రంగులు రావటం, బ్లాక్-అండ్-వైట్ ఫోటోలైతే అవి స్వాప్నికంగా కనబడటం, చెట్లకు ఉన్న పచ్చని ఆకుల పై మంచు పేరుకుపోయినట్లు కనబడటం (వుడ్ ఎఫెక్ట్) జరుగుతుంది. (ఆకులలో ఉండే క్లోరోఫిల్ వలన కొంతవరకు ఇలా జరిగినా అది నామమాత్రమే కానీ, ఈ ప్రభావానికి ఇది అసలు కారణం కాదు. అతినీలలోహిత ఛాయాగ్రహణం, పరారుణ ఛాయాగ్రహణం కనిపెట్టిన రాబర్ట్ విలియమ్స్ వుడ్ పేరుతో ఈ చర్యని అలా సంబోధిస్తారు. దీనికి, ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫిలోని ఫోటోలలో కనబడకుండా పోయే చెక్కకి సంబంధం లేదు.)
రాలీ స్కాటరింగ్ (Rayleigh scattering) వలన, మీ స్కాటరింగ్ ( Mie scattering) వలన ఆకాశం ముదురు రంగుల్లో కనబడటం, వాతావరణంలో పొగమంచు ఉన్నట్టు కనబడటం, ఇన్ఫ్రారెడ్ ఫోటోల ఇతర లక్షణాలు. ముదురు రంగులో కనబడు ఆకాశం నుండి మేఘాలు వేరు చేసినట్లు కనబడతాయి. ఇన్ఫ్రారెడ్ కాంతి యొక్క తరంగాల దైర్ఘ్యం మనుష్యుల చర్మంపై కొన్ని మిల్లీమీటర్ల వరకు చొచ్చుకుని పోయి పాలిపోయినట్టు కనబడటం, కళ్ళు చాలా వరకు నల్లగా కనబడటం జరుగుతుంది.
చరిత్ర
మార్చుఇన్ఫ్రారెడ్ ని కెమెరా దృష్టికి తీసుకురావడం
మార్చుఫిలిం కెమెరాలు
మార్చుకలర్ ఇన్ఫ్రారెడ్ ఫిలింలు
మార్చులభ్యత
మార్చుడిజిటల్ కెమెరాలు
మార్చుపరారుణ ఛాయాచిత్రాల చిత్రమాలిక
మార్చు-
కలర్ ఇన్ఫ్రారెడ్ లో తీసిన ఒక ఛాయాచిత్రం. ఆకాశం ముదురు నీలిరంగులో మేఘాలు ఎరుపు రంగుతో మాసిపోయినట్టు రాతితో కట్టిన భవనం తేలిపోతున్నట్లు, వెలుగు సోకిన చెట్టు ఆకులు పాల నురగల్లా, నీడలో ఉన్న ఆకులు దూదిపింజెల్లా స్వాప్నిక దృశ్యం వలె కనబడుతున్న తీరు
-
720 ఎన్ ఎం ఫిల్టరుని ఉపయోగించి తీసిన పరారుణ ఛాయాచిత్రం
-
టొరొంటోలోని ఒక ఫౌంటెయిన్
-
అడవిలో చెట్ల మధ్యనుండి ఆకాశం, మేఘాలు కనబడుతున్న తీరు
-
నలుపు , తెలుపు పరారుణ కాంతిలో నీలి రంగులో ఉన్న ఆకాశం నల్లగా (పై మూలలు), మేఘాలు మాసిపోయినట్టుగా, లేత ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకులు తెల్లగా, ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకులు నల్లగా కనిపించటంతో ఒక స్వాప్నిక దృశ్యాన్ని చూసినట్లు అగుపిస్తున్నది
-
నలుపు , తెలుపు పరారుణ కాంతిలో పచ్చిక బయలు వెలుతురు ఉన్న చోట తెల్లగా, నీడలు ఉన్న చోట నల్లగా కనిపిస్తున్న తీరు
-
దక్షిణ డకోటాలోని బాడ్ ల్యాండ్స్ నేషనల్ పార్క్ లో కొండలు కనిపించే తీరు
-
పరారుణ కాంతిలో ఒక నల్లని మరొక తెల్లని ఆవు
-
పర్వత శిఖరాలని చుట్టు ముట్టిన మేఘాలు సముద్రంలో ఉప్పొంగుతున్న అలల వలె కనిపిస్తున్న తీరు
-
ఇన్ఫ్రారెడ్ కాంతిలో ఒక జలపాతము
-
రాత్రివేళ తీయబడ్డ పరారుణ ఛాయాచిత్రం