ఒక కాంతి కిరణ పుంజం రెండు యానకాలను వేరు చేసే తలంపై పతనమైనపుడు, కొంతభాగం తిరిగి మొదటి యానకానికి ప్రసారమవుతుంది. దానినే కాంతి పరావర్తనం (Reflection) అంటారు. అధిక భాగంలో పరావర్తనం చెందించే తలములను పరావర్తన తలములు అంటారు. సమతల దర్పణంలో కాంతి పరావర్తనం చెందడం ద్వారా ప్రతిబింబం ఏర్పడుతుంది. సాధారణ ఉదాహరణలుగా కాంతి పరావర్తనం సహా, ధ్వని, నీటి తరంగాలు ఉన్నాయి. అద్దాలు స్పెక్యూలర్ ప్రతిబింబాన్ని ప్రదర్శిస్తాయి. ధ్వని లో, పరావర్తనం ప్రతిధ్వనులకు కారణమవుతుంది, సోనార్ లో ఉపయోగిస్తారు. భూగర్భ శాస్త్రంలో ఇది భూకంప తరంగాల అధ్యయనానికి ముఖ్యమైనది. పరావర్తనమును జల సముదాయాలలో ఉపరితల తరంగాలతో గమనించవచ్చు.

కాంతి కిరణముల పరావర్తనం వలన పర్వతం నీటిలో కనిపిస్తున్న దృశ్యం
దర్పణంలో కూజా యొక్క పరావర్తనం

పరావర్తనం- రకములు మార్చు

  1. క్రమ పరావర్తనం
  2. అక్రమ పరావర్తనం

క్రమ పరావర్తనం మార్చు

కాంతి కిరణాలు మెరుగు పెట్టబడిన నున్నని క్రమ తలాలపై పడినపుడు క్రమ పరావర్తనం జరుగుతుంది.

అక్రమ పరావర్తనం మార్చు

కాంతి, గరుకైన, మెరుగులేని, క్రమరహిత తలాలపై పడినపుడు అక్రమ పరావర్తనం జరుగుతుంది.

పరావర్తన సూత్రాలు మార్చు