పరాశరుడు ఋషి బాదరాయణ వ్యాసుడు యొక్క తండ్రి. శ్రీ శంకరాచార్యుడు స్థాపించిన పీఠ సంప్రదాయంలో ఆచారిస్తున్న స్మృతి-శాస్త్రానికి మార్గదర్శకుడు . ఆయన సంకలనం చేసిన గ్రంథాలు కలి కాలానికి ఎంతో ఉపయోగకరం.

ఒకసారి వ్యాస భగవానుడు తన తండ్రి పరాశరుని ప్రార్థించి, “ కలియుగంలో మానవ ధర్మం వేగంగా క్షీణిస్తోంది. కావున, తపస్సు సంపన్నులైన మీరు కలియుగానికి ఉపయోగపడే స్మృతి గ్రంథాలను రచించమని కోరాడు. దీని ప్రకారం, పరాశరుడు స్మృతి-శాస్త్రాన్ని రచించాడు. ఇది ప్రస్తుత సమాజ ఉపయోగార్ధం కలియుగంలో వినయోగించబడుచున్నది.

పూర్వం బ్రాహ్మణులకు వర్ణ, ఆశ్రమ నియమాల ప్రకారం వ్యవసాయ కార్యకలాపాలు నిషేధించబడ్డాయి. అయితే, పరాశర స్మృతిలో, బ్రాహ్మణులు యాగాలు, నైవేద్యాలతో పాటు వ్యవసాయ కార్యకలాపాలలో కూడా నిమగ్నమవ్వటానికి అనుమతి ఇవ్వబడింది. తపస్సు, యాగాలు, ఇతర పుణ్యకార్యాలను ఆచరించడం ద్వారా ముక్తి యొక్క అత్యున్నత దశను పొందగలడని స్మృతి అంగీకరించింది. ధైర్యవంతులైన క్షత్రియుడు, మరియే ఇతర కులాలవారు స్వమాతృభూమి కోసం మృత్యువును పొందడం ద్వారా ముక్తిని పొందగలరు అని తెలుపబడింది. ఋషి పరాశరుడు, కలియుగం యొక్క ఆచరణ వినియోగార్ధం వ్యవసాయం, యుద్ధాన్ని గొప్పగా ప్రశంసించారు. ఇదే నేటికీ దేశంలో వ్యవసాయం, యుద్ధ కళ రెండింటిలో స్థిరమైన పెరుగుదలకు దారితీసింది.

పరాశర స్మృతిలో పన్నెండు అధ్యాయాలు ఉన్నాయి. 512 పద్యాలు కూడా ఉన్నాయి. అక్కడ, ముఖ్యంగా, ఆచార వ్యవహార విషయముల గురుంచి పరిచయం చేయబడింది. దాని మొదటి అధ్యాయంలో కలియుగం యొక్క పరిశుభ్రత, మర్యాద వ్యవస్థ, యుగ ధర్మం, కలి యుగంలో అసత్యం, మతం యొక్క ఆవిర్భావం, రెండవ అధ్యాయంలో గృహస్థుని ధర్మం, అతిథులకు ఆతిథ్యం, నాలుగు వర్ణాల విధుల గురించి చర్చించబడ్డాయి. . తరువాత మూడవ అధ్యాయంలో నాలుగు వర్ణాల ఆలోచన, జనన మరణాల ఆలోచన, బంధుత్వ చింతన, స్వచ్ఛత, మరణ సమయంలో స్పర్శ, ఇతర వర్ణాల కార్యక్రమ విధి, నాలగవ అధ్యాయంలో బ్రాహ్మణ ఆత్మహత్య ఆలోచన, కోపంతో ఆత్మహత్య, ఆత్మహత్యకు ప్రాయశ్చిత్తం, ఆపై రజశ్వల శుద్ధి కర్మ, స్త్రీ వ్రతాలు, భర్త నిందా ఫలము, ఆపై గోలక, క్షేత్ర, జౌరస, కృత్తిక దట్టక మొదలైన కృత్రిమ గర్భాధారణ పరిశీలన మొదలైనవి వివరించబడినవి, ఐదవ అధ్యాయంలో స్వయం ప్రాయశ్చిత్తం, అగ్ని హోత్ర విధి, ఆరవ అధ్యాయంలో జంతువులు, పక్షులపై హింసకు ప్రాయశ్చిత్తం ఉంది. చండాలుడిని, ఇతరులను చంపినందుకు ప్రాయశ్చిత్తం, భూమిని శుభ్రపరచడం మొదలైనవి పరిగణించబడ్డాయి. ఏడవ అధ్యాయంలో పదార్థాన్ని శుభ్రపరచడం, పాత్రలను శుభ్రపరచడం, ధూళిని శుభ్రపరచడం, ఇతర శుభ్రపరిచే వ్యవస్థలు వివరించబడింది. ఆ తర్వాత ఎనిమిదవ అధ్యాయంలో గాయత్రి లేని బ్రాహ్మణ ఖండన, దేవాలయంలో ప్రాయశ్చిత్తం, గోవధ ప్రాయశ్చిత్తం తెలుపబడినాయి. తొమ్మిదవ అధ్యాయంలో, వివిధ రకాల వధలకు ప్రాయశ్చిత్తం, దశమ అధ్యాయంలో పాపముక్తి, మరొకరి లక్ష్యం కోసం ప్రాయశ్చిత్తం, పదకొండవ అధ్యాయంలో భక్ష్య భోజన విచారము, అభక్ష్య భక్షణ ప్రాయశ్చిత్తం, పంచగవ్య పాన విధానము, పెన్నెండవ అధ్యాయంలో ఆచమన విధి, శూద్రాన్న భక్ష్య ప్రాయశ్చిత్తం, నిశ్శంగ ప్రాయశ్చిత్తము పరిగణించబడ్డాయి.

మూలము మార్చు

బాహ్య లంకెలు మార్చు