పరిశుద్ధాత్మ
దేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులు ఏకమై త్రిత్వముగా ఉన్నారనే క్రైస్తవ సిద్ధాంతము. తండ్రి అంటే యెహోవా కుమారుడు అంటే యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ. త్రిత్వం అంటే ఈ ముగ్గురూ విడి విడి వ్యక్తులే కానీ ఒక్కరే.
దేవుని వాగ్దానం
మార్చుపరిశుద్ధాత్మను గ్రీకులో ‘‘పరకెల్టోసు’’ అని అంటారు. ప్రభువు తన శిష్యులతో ‘‘నేను కొద్దికాలమే మీతో ఉంటాను. ఆ తర్వాత నేను వెళ్లి మీకు ఆదరణకర్తయైన పరిశుద్ధాత్మను పంపుతాను’’ అని వాగ్దానం చేశాడు. ‘‘నేను తండ్రిని వేడుకొందును మీవద్ద యెల్లప్పుడునుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకనుక్షిగహించును! లోకం ఆయనను చూడదు. ఆయనను ఎరుగదు గనుక ఆయనన పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును. మీలో ఉండును’’ (యోహాను 15:16-17) ఆయన వాగ్దానం ప్రకారం పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా వారియొద్దకు పంపాడు. బైబిలులోని పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్ముని కార్యాలు మనం చూడగలం..
ఆదియందు దేవుడు భూమ్యాకాశాలను సృజించినాడు. భూమి నిరాకారంగానూ, శూన్యంగానూ ఉండెను. చీకట అగాథ జలముపైన కమ్మి ఉండెను. అప్పుడు దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. (ఆది కా॥ 1:1-2) దేవుని ఆత్మయనగా పరిశుద్ధాత్మ. యెహోవా వాక్కుచేత ఆకాశములు కలిగినవి. ఆయన నోట ఊపిరిచేత వాటి సర్వసమూహం కలిగెను అని (కీర్తన 33:6) బైబిలు బోధించుచున్నది.
దేవుని ‘నోటి ఊపిరి’యే పరిశుద్ధాత్మ అని మనం నేర్చుకుంటున్నాం. 2వ పేతురు 21క వచనం ఈ విధంగా బోధించుచున్నది ‘‘ఏలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్ఛను బట్టి కలుగలేదుగానీ, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడినవారై దేవుని మూలంగా పలికిరి’’. పరిశుద్ధుడైన లూకా ఆ : కా 10:38లో ‘‘అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను, శక్తితోనూ అభిషేకించెను’’ అని చెప్పుచున్నాడు. దేవుడు మనలను ఎంతో ప్రేమించినాడు. ఈ విధంగా బయలుపరిచినాడు. ‘‘నా ఆత్మను మీయందుంచి, నాకట్టడాలను ననుసరించువారినిగానూ, నా విధులను గైకొనువారినిగానూ మిమ్ములను చేసెదను’’ (యెహోవా 36:27) ఎప్పుడైతే ఆయన ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చునో మనం శక్తినొందుదుము. గొప్ప కార్యములు చేయుదుము. అంతేకాకుండా పరిశుద్ధాత్మ వరములు దేవుడు మనకు అనుక్షిగహించును.
పరిశుద్ధాత్మ వరములు
మార్చుకృపావరములు నానా విధాలుగా ఉన్నవి. కానీ ఆత్మ ఒక్కడే. అందరిలోనూ, అన్నింటినీ, జరిగించువాడు దేవుడు ఒక్కడే.
- నానా విధములైన కృపావరములు మనకు అనుక్షిగహించును.
1 కోరింథీయులకు 12:7 అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడు చున్నది.
1 కోరింథీయులకు 12:8 ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యమును,
1 కోరింథీయులకు 12:9 మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను
1 కోరింథీయులకు 12:10 మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి.
- పరిశుద్ధాత్మ మనకు శక్తినిస్తుంది
పరిశుద్ధాత్మ దేవునికి సాక్షిగా ధైర్యంగా నిలబడుటకు శక్తినిస్తుంది. ‘‘పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు. గనుక మీరు యెరుషలేములోనూ, యూదయ సమరయ దేశములందు, భూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను’’ (అపొ కా ॥ 1 :8)
పేతురు, యోహాను పరిశుద్ధాత్మ శక్తిని పొందినవారై మేము కన్నవాటిని, విన్నవాటిని చెప్పకయుండలేమని అధికారులకు, మత పెద్దలకు సభముందుకు వారిని తీసుకొని వచ్చి వారిని హెచ్చరించినప్పుడు వారు పలికిన మాటలు. పేతురు, యోహానుల ధైర్యాన్ని చూచి ఆ సభవారంతా ఆశ్చర్యపడినారు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి శక్తినిచ్చి బలపరిచాడు.
- మన పనిలో మార్గదర్శి
పరిశుద్ధాత్ముడు మన పనిలో మార్గదర్శిగా ఉంటూ మనలను సర్వ సత్యంలోనికి నడిపించును. అంతేగాక దేవుని ఆత్మచేత నడిపింపబడి, దేవుని కుమారులుగా ఉండుటకు మనలను నడిపించును.
- ప్రవచన వరమును మనకిస్తాడు
మనుషులకు క్షేమాభివృద్ధి, హెచ్చరికయు, ఆదరణయు కలుగునట్లు ప్రవచన వరం పొందినవాడు. మనుషులతో మాటలాడుచూ, మనుషులను, సంఘాలను క్షేమాభివృద్ధి కలుగజేయును. (1 కొరింథీ 14 :1-5)
- మన ఆత్మలను జీవింపజేస్తాడు
మానవులమైన మనం కష్టాలను, నష్టాలను చవిచూస్తుంటాం. మనకు కలిగే కష్టాలలో మనం నిరుత్సాహపడకుండా మనం ఆత్మ నడిపింపడం ద్వారా దేవునికి పునరంకితం చేసేలా పరిశుద్ధాత్మ చూస్తాడు. క్రీస్తు యేసును లేపినవాడు, చావునకు లోనైన మన శరీరాన్ని కూడా మనలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా మనలను జీవింపజేయును.
- ఫలభరితమైన జీవితాన్నిస్తాడు
గలతీయులకు రాసిన పత్రిక 5:22లో ఆత్మఫలం గురించి రాయబడి యున్నది. మనకు కూడా పరిశుద్ధాత్ముడు ఆత్మ ఫలం నిచ్చి మనలను సంతోషభరితులుగా నడిపించును. అనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిక్షిగహం మనకు దయచేయును. మన జీవితాలను ఫలభరింతంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు చేస్తాడు.
చిత్రమాలిక
మార్చు-
The Holy Spirit as a dove in the Annunciation, by Philippe de Champaigne, 1644
-
Stained glass representation of the Holy Spirit as a dove, c. 1660.]]
-
In the Farewell Discourse Jesus promised to send the Holy Spirit to his disciples after his departure,depiction from the Maesta by Duccio, 1308–1311.
-
St. Josaphat Cathedral in Edmonton, Canada is shaped as a cross with seven copper domes representing the Seven Gifts of the Holy Spirit.
-
The Holy Spirit as a dove on a stamp from Faroe Islands.
-
The Holy Spirit as a dove in the Annunciation by Rubens, 1628
-
Dove representation in the Baptism of Christ by Pietro Perugino, circa 1498
-
Representation as both dove and flames, Ravensburg, Germany, 1867
-
Ray of light representation in Russian icon of the Pentecost, 15th century
-
Roman Catholic Diocese of Hradec Králové, Czech Republic