పరిశ్రమ
పరిశ్రమ (Industry) అనగా దేశంలో లభ్యమౌతున్న ముడి సరుకులను ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించి ఉత్పాదక, వినియోగ వస్తువులుగా తయారుచేసే ప్రదేశం. ఈ ప్రక్రియనే పారిశ్రామికీకరణ (Industrialization) అంటారు. పారిశ్రామికీకరణ వల్ల ప్రజల తలసరి ఆదాయం, వినియోగ వ్యయం, మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి.
వర్గీకరణ
మార్చుపరిశ్రమలను ఉత్పత్తి, యాజమాన్యం, పెట్టుబడి ఆధారంగా పలు రకాలుగా విభజించవచ్చు.
ఉత్పత్తి
మార్చు- మౌలిక పరిశ్రమలు
వ్యవసాయానికి, పరిశ్రమలకు, నిర్మాణానికి అవసరమైన ఉత్పాదకాలను తయారుచేసే పరిశ్రమలు. ఉదాహరణకు ఇనుము-ఉక్కు, సిమెంటు పరిశ్రమ, విద్యుచ్ఛక్తి మొదలైనవి.
- ఉత్పాదక పర్రిశ్రమలు
వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు, అవసరమైన యంత్ర పరికరాలను, సామాగ్రిని తయారు చేసే పరిశ్రమలను ఉత్పాదక పరిశ్రమలంటారు. ఉదాహరణకు ఇంజనీరింగ్ వస్తువులు, విద్యుదుత్పత్తి పరికరాలు, ఆటోమొబైల్ పరిశ్రమలు
- మధ్య తరహా పరిశ్రమలు
వినియోగ వస్తు సేవల తయారీలో ఉపయోగించే వస్తువులను తయారుచేసే పరిశ్రమలు. ఉదాహరణ: పెట్రోలియం ఉత్పత్తులు, ప్లాస్టిక్ వస్తువులు
- వినియోగ పరిశ్రమలు
అంతిమ ఉపయోగంలో వినియోగించే వస్తువులను తయారు చేసే పరిశ్రమలు. ఉదాహరణ: టీవీలు, రేడియోలు, ఔషధాలు మొదలైనవి.
యాజమాన్యము
మార్చు- ప్రభుత్వ రంగ పరిశ్రమలు
పరిశ్రమల యాజమాన్యం, నిర్వహణ, నియంత్రణ, ప్రభుత్వ ఆధీనంలో ఉంటే వాటిని ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటారు. ఉదాహరణకు రైల్వేలు, తంతి తపాలా మొదలైనవి.
- ప్రైవేటు రంగ పరిశ్రమలు
- సహకార రంగ పరిశ్రమలు
పెట్టుబడి
మార్చుభారీ, మధ్య, చిన్న తరహా, లఘు, కుటీర పరిశ్రమలు