పరీక్ష

(పరీక్షలు నుండి దారిమార్పు చెందింది)

పరీక్ష (Examination) అనగా ఒక వ్యక్తిని లేదా ఏదైనా పదార్ధాన్ని నిశితంగా పరిశీలించడం.

మూత్ర పరీక్ష చేయుట

విద్యా విధానంలో పరీక్షలను విద్యార్థుల జ్ఞానాన్ని పరిశీలించడానికి ఉపయోగిస్తారు. ఇలాంటి పరీక్షలలో కొన్ని వ్రాతపూర్వకంగా ఉంటే వాటిని వ్రాత పరీక్షలు అంటారు. మరికొన్ని ప్రాక్టికల్ గా ప్రయోగాల్ని నిర్వహించాల్సి వస్తే వాటిని ప్రాక్టికల్ పరీక్షలు అంటారు. ఇలాంటి విధానంలో విద్యార్థులు పరీక్షల అనంతరం డిగ్రీ లేదా డిప్లొమా లేదా ధృవీకరణ పత్రం అందజేస్తారు. పరిమితంగా విద్యావకాశాలున్నప్పుడు విద్యార్థుల్ని వృత్తి విద్యా కోర్సుల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించి ఉన్నత శ్రేణి విద్యార్థుల్ని మాత్రమే తీసుకుంటారు.

వైద్య శాస్త్రంలో రోగిని పలు రకాలుగా పరీక్షించి వ్యాధిని నిర్ణయిస్తారు. పల్స్, రక్తపోటు మొదలైనవి, మూత్ర పరీక్షలు, ఎండోస్కోపీ మొదలైన చాలా రకాల వైద్య పరీక్షలు నేడు ఉపయోగంలో ఉన్నాయి.

న్యాయ శాస్త్రంలో నిందితున్ని న్యాయవాదులు చాలా రకాలుగా పరీక్షించి, అతడు నేరం చేసింది లేనిదీ తెలుసుకుంటారు.

రకాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పరీక్ష&oldid=3691530" నుండి వెలికితీశారు