పరోక్ష ఎన్నికలు

పరోక్ష ఎన్నికల్లో ప్రజలు అధికారం కోసం పోటీపడే అభ్యర్థులను కానీ, పార్టీలను కానీ నేరుగా ఎన్నుకోరు. వారు కొంతమందిని ఎన్నుకుంటే వారు తమకు తోచిన అభ్యర్థులను, పార్టీలను కానీ ఎన్నుకుంటారు. ఇది ప్రత్యక్ష ఎన్నికలకంటే భిన్నమైనది. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజలే నేరుగా తమ అధినేతను ఎన్నుకుంటారు.

పార్లమెంటరీ వ్యవస్థ అమల్లో ఉన్న దేశాల్లో (భారతదేశం, జర్మనీ, ఇటలీ, హంగేరీ, ఇజ్రాయెల్ మొదలైనవి) సాధారణంగా ప్రజలు తమ దేశాధినేతలను పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు.[1] ఐర్లాండ్, ఆస్ట్రియా, క్రొయేషియా, బల్గేరియా, చెక్ రిపబ్లిక్ వంటి అనేక పార్లమెంటరీ రిపబ్లిక్‌లు సెమీ-ప్రెసిడెన్షియల్ సిస్టమ్‌ను ఉపయోగించి నేరుగా ఎన్నుకోబడిన అధ్యక్షుడు, ప్రధానమంత్రి పదవులు వేరుగా ఉంటాయి.[2]

దేశాధినేత

మార్చు

దేశాధినేత అంటే ఒక దేశానికి అత్యున్నత అధికార ప్రతినిథి.[3] ప్రభుత్వ నిర్మాణాన్ని బట్టి, దేశ చరిత్రను బట్టి ఈ పదవి కేవలం నామమాత్రం కావచ్చు లేదా అత్యున్నత అధికారాలను కలిగినదీ కావచ్చు.[4] ఉదాహరణకు, కొన్ని సందర్భాల్లో దేశాధినేతలు రాచరికం ద్వారా పదవిని వారసత్వంగా పొందవచ్చు, లేదా ఇతరులు పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా అధ్యక్షుడిగా ఎన్నుకోబడతారు.[5]

ఉదాహరణకు భారత రాష్ట్రపతి పదవి ఇలాంటి అత్యున్నత పదవి. భారత రాష్ట్రపతి పరోక్షంగా ఎన్నుకోబడతాడు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిథులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.


మూలాలు

మార్చు
  1. Sargentich, Thomas O. (1993). "The Presidential and Parliamentary Models of National Government". American University International Law Review. 8 (2/3): 579–592.
  2. "Parliamentary System". Annenberg Classroom (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-08-04. Retrieved 2023-04-11.
  3. "Head of state". Cambridge Dictionary. Retrieved April 11, 2023.
  4. Strohmeier, Gerd; Wittlinger, Ruth (2010-03-01). "Parliamentary Heads of State: Players or Figureheads? The Case of Horst Köhler". West European Politics. 33 (2): 237–257. doi:10.1080/01402380903538856. ISSN 0140-2382. S2CID 154522953.
  5. Prindle, David F. (1991). "Head of State and Head of Government in Comparative Perspective". Presidential Studies Quarterly. 21 (1): 55–71. ISSN 0360-4918. JSTOR 27550663.