పర్యావరణ మార్పుపై భారతదేశం ఒప్పందాలు

క్యోటో ప్రోటోకాల్ యు.ఎన్.ఎఫ్.సి.సి.సి లో భాగంగా ఏర్పడిన అంతర్జాతీయ ఒప్పందం 1997 డిసెంబరులో జపాన్ లోని క్యోటో నగరం లో నిర్వహించారు. కార్బన్ డయాక్సైడ్, మీథేన్ సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోఫ్లోరో కార్బన్, ఫర్ఫ్లోరో కార్బన్ వంటి ఆరు రకాల వాయు ఉద్గారాలను తగ్గించడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.పర్యావరణ మార్పులను ఐక్యరాజ్యసమితిలో భాగమైన పలు సంస్థలు నిత్యం గమనిస్తూ ఉంటాయి. సభ్యదేశాలు ప్రతి ఏడాది, పర్యావరణ మార్పులను పరిశీలించేందుకు సదస్సులను నిర్వహిస్తుంది.

ప్యారిస్ ఒప్పందం మార్చు

ఐరాస ప్రతిపాదించిన ప్యారిస్ పర్యావరణ పరిరక్షణ ఒప్పందంపై అంగీకరిస్తూ భారతదేశ ప్రభుత్వం సంతకం చేసింది. ఇలా సంతకం చేసిన దేశాలలో 62వ దేశం. ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న కాలుష్యంలో 4.1 శాతం కాలుష్యకారకాలు భారతదేశం నుండి వెలువడుతోంది. భారతదేశం మహాత్మా గాంధీ 147వ జయంతి నాడు సంతకం చేయటం జరిగింది. మహాత్మా గాంధీ జయంతిని ఐరాస ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుతుంది.

క్యోటో ఒప్పందం (రెండవ విడత) మార్చు

2013-2020 సంవత్సరాల మధ్య కాలం క్యోటో ఒప్పందంపై రెండవ విడత నిబద్ధతకు ఒప్పుకున్న దేశాలు నెరవేర్చాల్సిన పనులను భారతదేశం కూడా చేపడుతోంది. ఈ విడత ముఖ్యంగా గ్రీన్‍హౌస్ వాయువులను నిలుపుదల చేసేందుకు కృషి చేసే దిశగా సభ్య దేశాలను ప్రోత్సహిస్తుంది.[1]

క్యోటో ఒప్పందం ప్రాముఖ్యత మార్చు

భారతదేశం ఇతర సభ్యదేశాలు క్యోటో ఒప్పందాన్ని, తద్వారా పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేలా చేయడంలో ముఖ్య పాత్రను పోషించింది. రెండవ విడత కూడా నిబద్ధతను చేపట్టడం ద్వారా భారతదేశం ప్రపంచ దేశాల్లో పర్యావరణ మార్పులను నియంత్రించే దేశాలకు నాయకత్వం వహిస్తూ పర్యావరణ న్యాయం చేకూర్చటంలో ప్రముఖ పాత్రను పోషించనుంది. ముఖ్యంగా ఇతర అభివృద్ధి చెందని దేశాలు పర్యావరణ మార్పు నియంత్రణకు ముందడుగేసే దిశగా ఇది పరిణమించింది. క్లీన్ డెవలప్‌మెంట్ మెకానిజం(సీడీఎం)లోని బహుళ ప్రయోజన ప్రాజెక్టులు ఈ నిబద్ధత వలన భారతదేశంలో పలు పెట్టుబడులను ఆకర్షించనున్నాయి.

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు