పర్యావరణ వ్యవస్థ

పర్యావరణ వ్యవస్థ అంటే ప్రకృతి, జీవుల మధ్య జరిగే పరస్పర చర్యల ద్వారా ఏర్పడే వ్యవస్థ.[2] ప్రకృతిలోని జీవ, నిర్జీవ పదార్థాలు పోషక వలయం, శక్తి ప్రసారం ద్వారా పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. పర్యావరణ వ్యవస్థను బాహ్య, అంతర్గత కారకాలు నియంత్రిస్తాయి. వాతావరణం, మట్టినీ, దానితో కూడిన స్థలాకృతినీ ఏర్పరిచే మూలపదార్థం లాంటి బాహ్యకారకాలు పర్యావరణ వ్యవస్థ స్థూల నిర్మాణాన్ని నియంత్రిస్తాయి. కానీ అవి పర్యావరణ వ్యవస్థ ద్వారా ప్రభావితం కావు. శిథిలమైపోవడం, వేర్ల మధ్య పోటీ, నీడ పట్టున ఉండటం, చెదిరిపోవడం లాంటి అంతర్గత కారకాలు పర్యావరణ వ్యవస్థను నియంత్రిస్తాయి. బాహ్య ప్రక్రియలు జీవ వనరుల ఉత్పాదకాన్ని నియంత్రిస్తాయి, అయితే అంతర్గత కారకాలు పర్యావరణ వ్యవస్థలో వాటి లభ్యతను నియంత్రిస్తాయి. అందువల్ల, అంతర్గత కారకాలు పర్యావరణ వ్యవస్థ ప్రక్రియలను నియంత్రించడమే కాకుండా వాటిచే నియంత్రించబడతాయి.

Coral reefs are a highly productive marine ecosystem.
ఎడమ: పగడపు దిబ్బ పర్యావరణ వ్యవస్థలు అధిక ఉత్పాదక సముద్ర వ్యవస్థలు.[1] కుడి: సమశీతోష్ణ వర్షారణ్యం, భూసంబంధమైన పర్యావరణ వ్యవస్థ.

పర్యావరణ వ్యవస్థలు నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి. అవి ఒక క్రమంలో అలజడికి గురై, మళ్ళీ వాటి నుంచి బయటపడటానికి నిరంతరం ప్రయత్నిస్తుంటాయి.

మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వ్యవస్థలోకి శక్తిని ప్రవేశించడానికి అనుమతిస్తాయి, మొక్కల కణజాలాన్ని నిర్మిస్తాయి. మొక్కలను ఆహారంగా తీసుకునే జంతువులు వ్యవస్థ ద్వారా పదార్థం, శక్తి యొక్క కదలికలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి మొక్కల, సూక్ష్మజీవుల జీవపదార్ధాల పరిమాణాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. చనిపోయిన సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా, డికంపోజర్లు కార్బన్‌ను తిరిగి వాతావరణంలోకి విడుదల చేస్తాయి. చనిపోయిన బయోమాస్‌లో నిల్వ చేయబడిన పోషకాలను తిరిగి మొక్కలు మరియు సూక్ష్మజీవులు సులభంగా ఉపయోగించగల రూపంలోకి మార్చడం ద్వారా పోషక వలయాన్ని సులభతరం చేస్తాయి.

మూలాలు

మార్చు
  1. Hatcher, Bruce Gordon (1990). "Coral reef primary productivity. A hierarchy of pattern and process". Trends in Ecology and Evolution. 5 (5): 149–155. doi:10.1016/0169-5347(90)90221-X. PMID 21232343.
  2. Chapin, F. Stuart III (2011). "Glossary". Principles of terrestrial ecosystem ecology. P. A. Matson, Peter Morrison Vitousek, Melissa C. Chapin (2nd ed.). New York: Springer. ISBN 978-1-4419-9504-9. OCLC 755081405.