పల్లవి ప్రధాన్

మహారాష్ట్రకు చెందిన టెలివిజన్, సినిమా నటి

పల్లవి ప్రధాన్, మహారాష్ట్రకు చెందిన టెలివిజన్, సినిమా నటి. అనేక టీవీ షోలతోపాటు బహు హమారీ రజనీ కాంత్, జిజి మా వంటి సీరియళ్ళలో నటించింది.

పల్లవి ప్రధాన్
జననం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1995–ప్రస్తుతం

జననం మార్చు

పల్లవి మహారాష్ట్ర రాజధాని ముంబైలో జన్మించింది.

కళారంగం మార్చు

పల్లవి ప్రధాన్ 1995లో గుజరాతీ నాటకరంగంలో నటిగా తన నట జీవితాన్ని ప్రారంభించింది. అరేచ్య సుతల కీ రావ్, బా నా ఘేర్ బాబో ఆవ్యో, కాంచ్ నా సంబంధ్, హార్ఖ్ పాడుది హంస, జంతర్ మంతర్ వంటి నాటకాలలో నటించింది. గుజరాతీ, మరాఠీ, హిందీ భాషల నాటకాలలో వివిధ పాత్రలు పోషించింది.

ఏక్ మహల్ హో సప్నో కా సీరియల్ లో రష్మీ నానావతి పాత్ర ద్వారా టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ సినిమాలో కూడా చిన్న పాత్ర పోషించింది. సబ్ టీవి సజన్ రే ఝూత్ మత్ బోలో సీరియల్ లో హాస్య పాత్రను పోషించింది.

బహు హమారీ రజనీ కాంత్‌ సీరియల్ లో సూరిలి కాంత్[1] పాత్రలో, స్టార్ భారత్‌లోని జిజిమాలో నటించింది.[2]

నటించినవి మార్చు

టెలివిజన్ మార్చు

సంవత్సరం కార్యక్రమం పాత్ర భాష ఛానల్ ఇతర వివరాలు
1999 ఏక్ మహల్ హో సప్నో కా రష్మీ నానావతి హిందీ సోనీ టీవీ
2005 సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ బాబు హిందీ స్టార్ వన్
2009 సజన్ రే ఝూత్ మత్ బోలో ఉషా ఝవేరి హిందీ సోనీ సబ్
2014 లగోరి-మైత్రి రిటర్న్స్ మాలతి మరాఠీ స్టార్ ప్రవాహ్
2016–2017 బహు హమారీ రజనీ కాంత్ సురిలి అమ్రిష్ కాంత్ హిందీ లైఫ్ ఓకే [3]
2017–2019 జిజి మా ఉత్తరా దేవి రావత్ హిందీ స్టార్ భారత్ [4] [5]
2020 భఖర్వాడి రసిలా మాల్వియా హిందీ సోనీ సబ్
2020 మేడం సార్ సావిత్రీదేవి హిందీ సోనీ సబ్
2022-ప్రస్తుతం వో తో హై అల్బెలా సరోజ్ చౌదరి హిందీ స్టార్ భారత్

సినిమా మార్చు

సంవత్సరం సినిమా పాత్ర భాష
2005 బా నా ఘెర్ బాబో ఆవ్యో గుజరాతీ
2005 హరఖ్ పదుడి హంస గుజరాతీ
2005 కాంచ్ నా సంబంధ్ గుజరాతీ
2005 జంతర్ మంతర్ గుజరాతీ

వెబ్ సిరీస్ మార్చు

సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
2022 అనుపమ: నమస్తే అమెరికా శ్రీమతి. ధమేచ

అవార్డులు, నామినేషన్లు మార్చు

సంవత్సరం అవార్డులు/నామినేషన్‌లు విభాగం ప్రదర్శన/చిత్రం ఫలితం
ఇటా అవార్డులు ఉత్తమ నటిగా ఇటా అవార్డు నామినేషన్‌
2018 గోల్డ్ అవార్డులు నెగిటివ్‌ పాత్రలో ఉత్తమ నటి జిజి మా విజేత

మూలాలు మార్చు

  1. IANS (25 August 2016). "Pallavi Pradhan on weight loss mission". abplive.in. Archived from the original on 2019-09-05. Retrieved 2023-01-24.
  2. "Pallavi Pradhan". The Times of India. Retrieved 2023-01-24.
  3. "Pallavi Pradhan to become Veeru of 'Sholay'". The Indian Express. 29 March 2016. Retrieved 2023-01-24.
  4. "Pallavi Pradhan: Having a different experience as vamp". PINKVILLA (in ఇంగ్లీష్). Archived from the original on 2022-08-30. Retrieved 2023-01-24.
  5. "Bad news for Pallavi Pradhan fans". The Tribune. 4 September 2018. Retrieved 2023-01-24.{{cite web}}: CS1 maint: url-status (link)