పల్లె వాణి
పల్లె వాణి (బోనాల వాణి) తెలంగాణ రాష్ట్రంకు చెందిన జానపద కళాకారిణి. బోనాలు, బతుకమ్మ, అమ్మవారి జాతర, పోతురాజు, శివసత్తుల నృత్యాలు ప్రదర్శించే పల్లెవాణి, 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]
పల్లె వాణి (బోనాల వాణి) | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | జానపద కళాకారిణి |
జీవిత విషయాలు
మార్చుహైదరాబాదులో ఉంటూ వివిధ కార్యక్రమాలలో ప్రదర్శనలు చేస్తుంది.
కళారంగం
మార్చునృత్యరంగంలో ‘బోనాల వాణి’గా, నాటక రంగంలో ‘బెలూన్ వాణి’గా గుర్తింపు పొందిన పల్లెవాణి, ఇప్పటివరకు మూడు వేలకు పైగా ప్రదర్శనల్లో పాల్గొంది. నృత్య కళాకారిణిగా జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇవ్వడంతోపాటు పుణ్యక్షేత్రాల్లో నిర్వహించే పండుగల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చింది. నాటకరంగంలో జాతీయ స్థాయిలో రెండుసార్లు ఉత్తమనటిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి నాటిక పోటీల్లో 15సార్లు ఉత్తమనటిగా అవార్డులు అందుకుంది.[2]
నృత్య రూపకాలు
మార్చు- మోహినీ భస్మాసుర
- గిరిజాకళ్యాణం
- గంగాగౌరీ సంవాదం
- గౌతమబుద్ధ
- భక్తకన్నప్ప
- మహిషాసుర మర్ధిని
పురస్కారాలు
మార్చు- తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2020 మార్చి 8.[3]
మూలాలు
మార్చు- ↑ ఈనాడు, ప్రధానాంశాలు (8 March 2020). "30 మంది మహిళలకు పురస్కారాలు". Archived from the original on 8 మార్చి 2020. Retrieved 10 March 2020.
- ↑ నమస్తే తెలంగాణ, జిందగీ (8 March 2020). "సరిలేరు మీకెవ్వరు". Archived from the original on 8 మార్చి 2020. Retrieved 10 March 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 March 2020). "ఉమెన్ సేఫ్టీ స్టేట్ తెలంగాణ : మంత్రులు". Archived from the original on 9 మార్చి 2020. Retrieved 10 March 2020.