పవర్ సప్లై యూనిట్ (కంప్యూటర్)

పవర్ సప్లై యూనిట్ (పిఎస్‌యు) అనేది కంప్యూటర్ యొక్క అంతర్గత భాగాల కోసం మెయిన్ AC ను లో-వొల్టేజిగా మారుస్తూ DC పవర్ ను నియంత్రిస్తుంది. ఆధునిక వ్యక్తిగత కంప్యూటర్లలో సర్వత్రా స్విచ్ మోడ్ పవర్ సప్లై ఉపయోగిస్తున్నారు. కొన్ని పవర్ సప్లైలు ఇన్‌పుట్ వొల్టేజి కొరకు మాన్యువల్ సెలెక్టర్ కలిగి ఉన్నాయి, అయితా ఇతరత్రా సప్లై వొల్టేజికి ఆటోమేటికల్లీ ఆడాప్ట్ కలిగి ఉన్నాయి. అత్యధిక ఆధునిక డెస్క్‌టాప్ వ్యక్తిగత కంప్యూటర్ పవర్ సప్లైలు ఫార్మ్ ఫ్యాక్టర్, వోల్టేజ్ టాలరెన్సులు కలిగి ఉండి ATX స్పెసిఫికేషన్ కు అనుగుణంగా ఉన్నాయి. అయితే ATX పవర్ సప్లై మెయిన్ సప్లైకి అనుసంధానించబడి ఉంటుంది, ఇది నిరంతరం 5 V స్టాండ్‌బై (5VSB)వోల్టేజిని అందిస్తుంది, అలా అది కంప్యూటర్, కొన్ని పెరిఫెరల్స్ ల ఫంక్షన్లను నిలకడగా ఉంచే ఆధారితం. ATX పవర్ సప్లైలు మదర్‌బోర్డు నుంచి వచ్చే సిగ్నల్ ద్వారా ఆన్, ఆఫ్ చేయబడతాయి. ఇవి స్పెక్ లో DC వోల్టేజి ఉన్నప్పుడు సూచనగా మదర్‌బోర్డుకు సంకేతాన్ని కూడా అందిస్తాయి, అలా ఇది కంప్యూటర్ పవర్ అప్, బూట్ రక్షణకు వీలు కల్పిస్తుంది. ఇటీవలి ATX పవర్ సప్లై యూనిట్ ప్రామాణికం 2008 మధ్యకాలం యొక్క వెర్షన్ 2.31.

టాప్ కవర్ తొలగించబడిన ATX పవర్ సప్లై యూనిట్

స్విచ్ మోడ్ పవర్ సప్లై

మార్చు

స్విచ్ మోడ్ పవర్ సప్లై లేదా ఎస్‌ఎంపిఎస్ అనేది సమర్ధవంతంగా విద్యుత్ శక్తిని మార్పిడి చేయగల మార్పిడి నియంత్రకమును పొందుపరచుకున్న ఒక ఎలక్ట్రానిక్ పవర్ సప్లై. వోల్టేజ్, కరెంటు లక్షణాలు మార్చే ఇతర పవర్ సప్లైల వలె ఎస్‌ఎంపిఎస్ వ్యతిగత కంప్యూటర్ వంటి వాటికి మెయిన్ పవర్ నుండి ఏభాగానికి ఎంత కరెంట్ సరఫరా చేయాలో అంత విద్యుత్ మాత్రమే ఆ భాగాలకు సరఫరా అయ్యేలా చేస్తుంది. ఒక సరళ విద్యుత్ సరఫరాలా కాకుండా, ఈ స్విచ్ మోడ్ యొక్క పాస్ ట్రాన్సిస్టర్ నిరంతరంగా లో-డిస్సిపేషన్ (తక్కువ దుర్వ్యయం), ఫుల్-ఆన్, ఫుల్ ఆఫ్ స్థితుల మధ్య మారుతూ, అధిక దుర్వ్యయ మార్పులలో చాలా తక్కువ సమయం తీసుకుంటూ ఇది వృధా శక్తిని తగ్గిస్తుంది. సాధారణంగా స్విచ్ మోడ్ పవర్ సప్లై ఎటువంటి శక్తిని వ్యర్థం కానివ్వదు. వోల్టేజ్ రెగ్యులేషన్ ఆన్ నుంచి ఆఫ్ సమయం యొక్క వివిధ నిష్పత్తుల ద్వారా ఈ పనిని సాధిస్తుంది. దీనికి విరుద్ధంగా, లీనియర్ పవర్ సప్లై నిరంతరంగా పాస్ ట్రాన్సిస్టర్ లోకి పవర్ ను దోయటం ద్వారా అవుట్‌పుట్ వోల్టేజ్ నియంత్రిస్తుంది. ఈ అధిక శక్తి మార్పిడి సామర్థ్యం అనేది స్విచ్ మోడ్ పవర్ సప్లై యొక్క ఒక ముఖ్యమైన ప్రయోజనంగా ఉంది. స్విచ్ మోడ్ పవర్ సప్లై కలిగి ఉండే ట్రాన్స్‌ఫార్మర్ పరిమాణం, బరువులో చిన్నదిగా ఉండు కారణంగా లీనియర్ పవర్ సప్లై కంటే గణనీయంగా చిన్నగా, తేలికగా ఉండవచ్చు.