పాండురంగ్ మహాదేవ్ బాపట్

పాండురంగ్ మహాదేవ్ బాపట్ (Pandurang Mahadev Bapat) ( 1880 నవంబరు 12 - 1967 నవంబరు 28),  ఇతనిని సేనాపతి బాపత్  అని కూడా పిలుస్తారు, భారత స్వాతంత్ర్య ఉద్యమ కారులలో ఒకరు.

పాండురంగ్ మహాదేవ్ బాపట్
पांडुरंग महादेव बापट
Painting of Senapati Bapat at Sanyukta Maharashtra Smruti Dalan, Dadar, Mumbai
ఉచ్ఛారణpɑ̃ːɖuɾə̃gə məɦɑːd̪eːʋə bɑːpəʈə
జననం(1880-11-12)1880 నవంబరు 12
మరణం1967 నవంబరు 28(1967-11-28) (వయసు 87)
Bombay, Maharashtra, India
జాతీయతIndian
ఇతర పేర్లుSenapati Bapat
విద్యాసంస్థDeccan College, University of Pune
సుపరిచితుడు/
సుపరిచితురాలు
Gandhian philosophy

జీవితం

మార్చు

1880 నవంబరు 12న అహ్మద్‌నగర్ జిల్లాలోని పార్నర్‌లో మరాఠీ చిత్పవన్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బాపట్ ఉన్నత విద్య కోసం పూణేలోని దక్కన్ కళాశాలలో చేరినాడు. పూణేలోని దక్కన్ కాలేజీలో చేరడం అతని జీవితంలో  మలుపు, ఎందుకంటే ఇక్కడే అతను విప్లవాత్మక చాపేకర్ క్లబ్ సభ్యుడు దామోదర్ బల్వంత్ భిడే, తన తోటి విద్యార్థులలో భారతీయ జాతీయవాద భావాలను పెంపొందించిన బ్రిటిష్ వ్యక్తి ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ విలియం బైన్‌లను కలవడం జరిగింది. బాపట్  1904లో, మంగళదాస్ నాథూబాయి స్కాలర్‌షిప్ పొందిన తర్వాత, బాపట్ ఎడిన్‌బర్గ్‌లోని హెరియట్-వాట్-కాలేజ్‌లో ఇంజనీరింగ్ చదవడానికి ఇంగ్లాండ్ వెళ్లారు. ఇక్కడనే సావర్కర్ ను కలవడం, అతని సలహా మేరకు అతను తన రష్యన్ సహచరులతో పేలుడు పదార్థాలను తయారు చేసే సాంకేతికత నైపుణ్యాలను నేర్చుకోవడానికి బాపత్ పారిస్‌కు వెళ్లాడు.[1]

విప్లవాత్మక చర్యలు

మార్చు

బాంబ్ మాన్యువల్, రెండు రివాల్వర్లతో బాపట్ 1908లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. బాంబు తయారీకి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఆయన భారతీయ విప్లవకారుల్లో వ్యాప్తి చేశాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించడానికి ముందు బాపట్ దేశ వ్యాప్తంగా ఒకే నెట్వర్క్ను నిర్మించాలనుకున్నాడు. అయితే, అతని సలహాను పట్టించుకోలేదు. 1908 లో అలీపోర్ బాంబు దాడి జరిగింది, దీనితో బాపట్ అజ్ఞాతంలో వెళ్ళిపోయాడు, అతనిని పోలీసులు 1912 సంవత్సరంలో అరెస్టు చేసి, మూడు సంవత్సరాల పాటు జైల్లో ఉండి,1915లో విడుదలైన తరువాత తిలక్ యాజమాన్యంలోని 'మహరత్తా' అనే వార్తాపత్రికకు అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేయడం ప్రారంభించాడు.[2]

గాంధీజీ ప్రభావం

మార్చు

1920 చివరలో, తిలక్ మరణానంతరం, తిలక్ ఆలోచనలకు మద్దతుదారుగా ఉన్నప్పటికీ భారతదేశ స్వరాజ్యానికి సంబంధించి గాంధీ సిద్ధాంతాలు, అతని దార్శనికతతో బాపట్ తన విప్లవాత్మక భావాలను సమీక్ష చేసుకొన్నాడు. బాపట్ విప్లవాత్మక ఆలోచనలకు సుముఖత ఉన్నా, అహింస గురించి గాంధేయ ప్రమాణం తీసుకున్నప్పటికీ, బాపట్ అవసరం అని భావించినప్పుడు ఉపయోగించాలని భావించాడు.[3]

గౌరవం-రచనలు

మార్చు

1921లో టాటా జలవిద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ముల్షీ సత్యాగ్రహంలో పాల్గొనడానికి బాపట్ స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 54 గ్రామాలకు నష్టం, ముంపునకు గురిఅయ్యాయి. బాపట్ పటిష్ఠ నాయకత్వానికి 'సేనాపతి' అని పిలువబడ్డాడు, ఈ ఉద్యమ పోరాట సమయంలో నాలుగు సార్లు జైలు శిక్ష పొందాడు. చివరి శిక్షలో ఏడు సంవత్సరాలు జైల్లో ఉండి, విడుదల తర్వాత మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. బాపట్ సంస్కృతం, మరాఠీ, హిందీ, ఇంగ్లీషు భాషలతో తన ఆలోచనలను గద్యంలో కంటే వచనంలోనే ఎక్కువగా ఈ భాషలన్నింటిలోనూ వ్యక్తీకరించాడు. జైలులో ఉన్నప్పుడు కూడా వివిధ అంశాలపై రచనలు చేశాడు. 1921 సంవత్సరం ను౦డి ఆయన వ్రాసిన కొన్ని పుస్తకాలు ప్రచురి౦చబడ్డాయి. డి.వి. దేవ్ తన 'సమగ్ర గ్రంథం ' (కలెక్ట్టెడ్ వర్క్స్) 3 స౦పుటాలుగా 1937-39 లలో ప్రచురి౦చాడు.[4]

బాపట్ పట్ల గౌరవ సూచకంగా భారత ప్రభుత్వం 1977 ( 28-11-1977) సంవత్సరంలో ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేయడం జరిగింది.[5]

మూలాలు

మార్చు
  1. "Senapati Bapat, The Unsung Compatriot of Gandhi & Bose Who Forged His Own Path". The Better India (in ఇంగ్లీష్). 2019-08-05. Retrieved 2022-04-08.
  2. Mahotsav, Amrit. "Senapti Bapat". Azadi Ka Amrit Mahotsav, Ministry of Culture, Government of India (in English). Retrieved 2022-04-08.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  3. Cashman,, Richard I (1975). The myth of the Lokamanya : Tilak and mass politics in Maharashtra. University of California: 9780520024076. pp. 194. ISBN 9780520024076.{{cite book}}: CS1 maint: extra punctuation (link)
  4. "Vandemataram.com - Patriots". www.vandemataram.com. Retrieved 2022-04-08.
  5. "SENAPATI BAPAT (PANDURANG MAHADEV BAPAT)". www.indianpost.com. Retrieved 2022-04-08.