పాండురంగ మహాత్మ్యము

(పాండురంగ మహాత్మ్యం నుండి దారిమార్పు చెందింది)

పాండురంగ మహాత్మ్యము తెనాలి రామలింగడు రచించిన ఐదు అశ్వాసాల గద్య పద్య కావ్యము. ఈ కావ్యంలో గత కవులు ఎవరూ వాడని కొత్త వర్ణనలు, అందునా తాను గతంలో వాడినవి మళ్ళీ వాడకుండా కవిత్వం చెప్పడంతో రామలింగడికి వికటకవి అన్న పేరువచ్చింది.

చరిత్ర రచనలోసవరించు

పాండురంగ మహాత్మ్యం ప్రకారం ప్రపంచ దిగ్విజయానికి బయల్దేరే ముందు మన్మధుడు కొంతకాలం వెలిగుడారంలో విడిసినట్టు చెప్పబడింది.[1] 17వ శతాబ్ది నాటి విజయనగర సామ్రాజ్యపు అనే కవిలె, కృష్ణరాయలకు 50 ఏళ్ళ అనంతరపు రాయవాచకాల్లో రాయలు యుద్ధానికి వెళ్ళేప్పుడు అంత:పురం, నగరం వదిలి ఊరి బయట ఓ గుడారం వేసుకుని యుద్ధసన్నాహాలు పర్యవేక్షించేవారని, దానినే వెలిగుడారం అంటారని తెలుస్తోంది. ఇలాంటి చాలా విశేషాలు ఆనాటి సాంఘిక, రాజకీయ చరిత్రలను ప్రతిబింబిస్తున్నాయి.[2]

విశేషాలుసవరించు

ఇది ఐదు అశ్వాసాలు గో 1302 గద్య పద్యాలతో విలసిల్లు గొప్ప గ్రంథము. ఇందు ఇతివృత్తము పాండురంగని కథ. దీనిలోనుండి రెండు పద్యాలను చూడండి తుంగభద్రానది వర్ణన:
గంగా సంగమ మిచ్చగించునె మదిన్ గావేరీ దేవేరిగా
నంగీకార మొనర్చునే యమునతో నానందముంబొందునే
రగత్తుంగ తరంగ హస్తముల నారత్నాకరేంద్రుండు నీ
యంగంబంటి సుఖించునేని గుణభద్రా తుంగభద్రానదీ!

అలాగే తెలుగు లిపి ఆ రోజులలోనే ఎంత అందంగా వ్రాసేవాళ్ళో చూడండి

దస్త్రం:Paanduranga mahatyamu.jpg
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమివారు ప్రచురించిన గ్రంథ ముఖ చిత్రము

పట్టె వ్ట్రువయును బరిపుష్టి తలకట్టు గుడుసున్న కియ్యయు సుడియు ముడియు
నైత్వంబు నేత్వంబు నందంబు గిలకయు బంతులు నిలుపు పొలుపు
నయము నిస్సందేహతయు నొప్పు మురువును ద్రచ్చి వేసిన యట్ల తనరుటయును
షడ్వర్గశుద్దియు జాతియోగ్యతయును వృద్దిప్రియత్వంబు విశదగతియు
గీలుకొవ రాయసంబుల వ్రాలు వ్రాయుగొంకుగొనరునుజేతప్పు గొనకయుండ
లలిత ముక్తాఫలాకార విలాసనమున మతియరున్మంత్రి వేదాద్రి మంత్రివరుడు

  1. తెనాలి రామకృష్ణుడు:పాండురంగ మహాత్మ్యం. 4వ అధ్యాయం, 44 పద్యం
  2. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.

3. పాండురంగ మహాత్మ్యం - పామర వ్యాఖ్యానంతో - తెలుగుపరిశోధనలో