పాండు (నటుడు)

పాండు (నటుడు) తమిళ సినిమా నటుడు, చిత్రకారుడు, [2] గ్రాఫిక్ డిజైనరు. ఆయన హాస్య నటుడు. పాండు 1970లో ‘మనావన్’ అనే చిత్రం ద్వారా సినీరంగానికి పరిచయమయ్యాడు.[3] అతడు 500 కు పైగా చిత్రాల్లో నటించాడు.[4]

పాండు
జననం(1947-02-19)1947 ఫిబ్రవరి 19
కుమారపాళెయం, తమిళనాడు
మరణం2021 మే 6(2021-05-06) (వయస్సు 74)[1]
చెన్నై, తమిళనాడు
వృత్తితమిళ సినీ నటుడు, చిత్రకారుడు, గ్రాఫిక్ డిజైనర్
క్రియాశీల సంవత్సరాలు1970, 1981
1988–2021
జీవిత భాగస్వామికుముద
పిల్లలుముగ్గురు కుమారులు

పాండు ‘క్యాపిటల్ లెటర్స్’ అనే డిజైన్ కంపెనీని నడుపుతున్నాడు. అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట కజగం (ఎడిఎంకె) పార్టీ గుర్తు అయిన రెండాకులను, తమిళనాడు పర్యాటక చిహ్నం ఐకానిక్ జెండాను అతనే రూపొందించాడు.[5] అతని సోదరుడు ఇదిచాపులి సెల్వరాజ్ కూడా తమిళ సినిమాలో హాస్య నటుడిగా నటించాడు.

ఏఐడీఎంకే చిహ్నం రూపకర్తసవరించు

ఏఐడీఎంకే పార్టీ చిహ్నాన్ని పాండునే రూపొందించాడు. ఎంజీ రామచంద్రన్‌ పార్టీని స్థాపించినప్పుడు పాండును పిలిచి పార్టీకి ఒక సింబల్‌ను రూపొందించాల్సిందిగా సూచించాడు. 1977 ఎన్నికలకు ముందు మరోసారి ఎంజీఆర్‌ పిలవగా, రెండు ఆకుల గుర్తును పాండు డిజైన్‌ చేసి ఇచ్చాడు. ఆ తర్వాత ఎంజీఆర్‌తో ఆయన ప్రయాణం కొనసాగింది. ‘క్యాపిటల్‌ లెటర్స్‌’ పేరుతో ఒక డిజైన్‌ కంపెనీని కూడా పాండు నడిపాడు. దీని ద్వారా చిత్ర పరిశ్రమలోని సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలకు పేర్లు డిజైన్‌ చేసి ఇచ్చేవాడు.

పాండు 2021 మే 6 న కోవిడ్-19 వ్యాధితో మరణించాడు. [5]

మూలాలుసవరించు

  1. https://www.deccanherald.com/entertainment/entertainment-news/tamil-actor-pandu-passes-away-due-to-covid-19-complications-982862.html
  2. The New Indian Express (7 ఏప్రిల్ 2014). "Art With Alphabets". Archived from the original on 7 మే 2021. Retrieved 7 మే 2021.
  3. News18 Telugu (6 మే 2021). "Pandu passes away due to Covid : కరోనాతో కన్నుమూసిన మరో ప్రముఖ హాస్యనటుడు." News18 Telugu. Archived from the original on 7 మే 2021. Retrieved 7 మే 2021.
  4. Andhrajyothy (7 మే 2021). "కబళిస్తోన్న కరోనా.. ఒకే రోజు ముగ్గురు సినీ ప్రముఖుల మృతి". Archived from the original on 7 మే 2021. Retrieved 7 మే 2021.
  5. 5.0 5.1 10TV (6 మే 2021). "కరోనాతో తమిళ హాస్యనటుడు పాండు కన్నుమూత | pandu" (in telugu). Retrieved 7 మే 2021.CS1 maint: unrecognized language (link)