పాటియాలా పెగ్ అనేది విస్కీ పెగ్గులో ఒక రకం కొలత. చూపుడు వేలిని, చిటికెనవేలినీ సమాతంరంగా పెట్టినపుడు వాటి మధ్య ఎడం ఉంటుందో గ్లాసులో విస్కీ లోతు అంత ఉండేలా విస్కీ పోస్తే దాన్ని పాటియాలా పెగ్గు అంటారు. పాటియాలా నగరం పేరు మీదుగా దీనికి ఈ పేరు వచ్చింది. కొన్ని సార్లు చైనీస్ పెగ్గుకు, దీనికీ మధ్య తికమక పడటం జరుగుతూంటుంది. చైనీసు పెగ్గులో ముందు నీరు పోసి, ఆపై విస్కీ పోస్తారు. రెండు పొరలూ విడివిడిగా కనబడుతూంటాయి. [1] పాటియాలా పెగ్గు కొలత సాధారణంగా 120 మి.లీ. ఉంటుంది.

పాటియాలా పెగ్ రమ్ము

ఈ కొలతకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పే సిద్ధాంతాలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ కూడా 1900 నుండి 1938 వరకూ పాటియాలా సంస్థానాన్ని పాలించిన మహారాజా సర్ భూపీందర్ సింగ్ చుట్టూనే తిరుగుతాయి. కేవలం తొమ్మిదేళ్ల వయసులో పాలనకు వచ్చిన మహారాజాది మార్మిక వ్యక్తిత్వం. అతడు గొప్ప యోధుడు, చక్కటి అభిరుచులు గల వ్యక్తి. అతని ప్రాసాదంలో 365 మంది మహిళలు (రాణులు, ఉంపుడుగత్తెలు) ఉండేవారని ప్రతీతి. అతని వద్ద 10 కి పైబడి రోల్స్ రాయిస్ కార్లు ఉండేవి. ప్రఖ్యాతి గాంచిన పాటియాలా నెక్లెస్ కూడా ఉండేది. దీనిలో 2930 వజ్రాలు పొదిగి ఉండేవి. వీటిలో ప్రపంచంలోనే ఏడవ అతిపెద్ద వజ్రం కూడా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా స్థాపకుడతడు. చాలా ఆడంబరమైన జీవితాన్ని గడిపాడు.

మహారాజాకు సిక్కు యోధులతో కూడిన పోలో జట్టు ఉండేది. ' టెంట్ పెగ్గింగ్ ' (ఆటగాళ్ళు గుర్రంపై స్వారీ చేస్తూ వారి చేతుల్లోని బల్లెంతో చిన్న చిన్న వస్తువులను సేకరించవలసి ఉంటుంది). పోటీ కోసం వైస్రాయ్స్ ప్రైడ్ అనే ఐరిష్ జట్టును అతను ఆహ్వానించాడు. ఐరిష్ జట్టు వచ్చింది. వాళ్ళంతా తమ సిక్కు ప్రత్యర్థుల లాగానే దృఢంగా ఉన్నారు. వాళ్ళు భారీగా తాగేవారు. ఈ ఆట ఎక్కడ జరిగినా, అంతకుముందు రాత్రి పార్టీ ఉండేది. రత్రి పూట పూటుగా తాగడానికీ, మరుసటి రోజు ధాటిగా ఆడటానికీ ఐరిష్ ఆటగాళ్ళు ప్రసిద్ది. మామూలుగానే, పోటీ నాటి ముందు రాత్రి, పాటియాలాలో పార్టీ జరిగింది. రెండు జట్లకు భారీ మొత్తంలో విస్కీని అందించారు. రెండు జట్ల సభ్యులూ వారి సామర్థ్యం మేరకు తాగారు. మరుసటి రోజు ఐరిష్ ఆటగాళ్ళపై ముందురాత్రి తాగిన విస్కీ గట్టి ప్రభావం చూపించడంతో వారు సరిగ్గా ఆడలేకపోయారు. ఓడిపోయారు. ఆ రోజు నుండి పాటియాలా జట్టు, తమ మద్యపాన సామర్థ్యానికీ, పాటియాలా పెగ్గు దాని బలమైన ప్రభావానికీ ప్రసిద్ది చెందాయి. సాధారణంగా పాటియాలా పెగ్గు దాని పరిమాణాన్ని, దాని బలమైన ప్రభావాన్నీ సూచిస్తుంది.

మూలాలు

మార్చు
  1. Narayan, Kirin (26 January 1995). Love, stars, and all that. Piatkus. p. 140. ISBN 978-0-7499-0265-0. A Patiala peg is as high as the distance between pinky and index finger.