పాడ్కాస్ట్ చర్చ లేదా సంగీతం వలె డిజిటల్ ఫార్మాట్ లో ఇంటర్నెట్ లో నిక్షిప్తం చేయబడ్డ, ఇంటర్నెట్ నుండే డౌన్లోడ్ చేసుకుని కంప్యూటర్, మొబైల్ ఫోన్, ఎంపీ3 ప్లేయర్ లేదా (ట్యాబ్లెట్, ఐప్యాడ్ వంటి) ఏ ఇతర పరికరం ద్వారానైనా వినగలిగే ఒక రేడియో కార్యక్రమం. [1] [2] [3] [4] పాడ్కాస్ట్ లు జ్ఙానాన్ని సంపాదించుకోవటానికి, పంచుకోవటానికి, ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి వేదికలుగా నిలిచాయి. [5] వేగం పెరిగిన జీవితాలలో ఆసక్తి గల అంశం గురించి తక్కువ సమయాన్ని కేటాయిస్తూనే తెలుసుకొనగలటం పాడ్కాస్ట్లు మానవాళికి ఇచ్చే గొప్ప లాభం. వార్తలు, వాస్తవాలు, విజ్ఞానశాస్త్రం, రాజకీయాలు, కథలు, విద్య, వినోదం ఇలా పాడ్కాస్ట్లు పలు విభాగాలలో రూపొందించబడతాయి.[6] పాడ్కాస్ట్ లు దాదాపు దశాబ్దం పైగా రూపొందించబడుతున్నా, ఇటీవలి కాలం లో స్మార్ట్ ఫోన్ల, పాడ్కాస్ట్ యాప్ లు పెరిగిన సాంకేతిక విలువలతో ఈ మధ్య కాలంలోనే అవి మహర్దశకు చేరుకొన్నవి![5] భారతదేశం లోనూ పాడ్కాస్టులకు 2020 నుండి ఆదరణ పెరగటం తో స్వీడిష్ సంస్థ అయిన స్పాటిఫై ఆంగ్లం తో బాటు హిందీ, తెలుగు, తమిళం వంటి స్థానిక భాషలలో 30 పాడ్కాస్ట్ లను విడుదల చేసింది. [6]

ఐఫోన్‌లో పాకెట్ కాస్ట్స్ అనువర్తనం ద్వారా సీరియల్ పోడ్‌కాస్ట్ ప్లే అవుతోంది

పోడ్కాస్ట్ అని వాడుతున్న ఈ పేరు ఐపొడ్(iPod) ఇంకా బ్రాడ్కాస్ట్ (broadcast)ల కలయిక. కానీ ఐపోడ్ అనే కాక అంతర్జాలంతో లంకె ఉండే, ఏదైన ఆడ్పీయగలిగే ఇతర పరికరంతో పోడ్కాస్ట్నును వినవచ్చు. అందుకే వీటికి ఇతర పేర్లు కూడా సూచిస్తున్నారు. నెట్కాస్ట్[7] అనే పేరు ఇంటర్నెట్లో నుండి వింటునందుకు గాను, ఇంటర్నెట్ నుంచి ఇవి ప్రసారామైనందుకు వచ్చింది. అందుకు గాను తెలుగులో పోడ్కాస్ట్కి వలపఱపం లేదా వలప్రసారం అనవచ్చు.( ఉదా: వీడియో కాస్ట్= దృశ్య ప్రసారం)

నిర్మాణం లో సాంకేతిక అంశాలు మార్చు

  • పాడ్కాస్టును రూపొందించి సేవ్ చేసిన తర్వాత ఒక హోస్టింగ్ ప్లాట్ ఫాం కావలసి ఉంటుంది. ఆ ప్లాట్ ఫాం RSS ఫీడ్ సృష్టిస్తాయి. ఈ ఫీడ్ ఆడియో ఫైల్, పాడ్ క్యాచర్ మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి. ఫలితంగా పాడ్కాస్తు మన పరికరానికి పంపిణీ చేయబడుతుంది.[8]

శ్రోతలు మార్చు

  • పాడ్కాస్టు శ్రోతలు సాదాసీదా సగటు మనుషులు కారు. నెట్ ఫ్లిక్క్ష్, స్పాటిఫై ప్రీమియం వంటి వాటికి సభ్యత్వ రుసుము చెల్లించే ఉన్నత వర్గాలకు చెందిన వారు. కావున పాడ్కాస్టులలో వినబడే వాణిజ్య ప్రకటనలు కూడా అధిక వ్యయం తో కూడుకొన్నవై ఉంటాయి.[8]

పాడ్కాస్ట్ ల నిర్మాణం, వినియోగం పెరగటానికి గల కారణాలు మార్చు

  • రేడియో కంటే టీవీ మనకి మరింత దగ్గర అయినట్లు, రేడియో కంటే పాడ్కాస్ట్ మనకి మరింత చేరువ. ఏ పాడ్కాస్ట్ వినాలో మనమే ఎంచుకోవచ్చు. ఎంచుకొన్న పాడ్కాస్ట్ ను మన వ్యక్తిగత పరిధిలో (హెడ్ ఫోంస్&స్) వినియోగిస్తూ మనం ఆసక్తిగా వింటాం.[8]

లాభాలు మార్చు

  • పుస్తక, పత్రికా పఠనం వలె పాడ్కాస్టుల కోసం ప్రత్యేకంగా సమయాన్ని వెచ్చించనక్కర లేదు. ఒక ప్రక్క మన పనుల మనం చేసుకొంటూనే (లేదా ఆఫీసుకు వెళ్ళే సమయంలో) మన పనులకు ఎటువంటి అంతరాయం లేకుండానే పాడ్కాస్టులను వినవచ్చు. [5]
  • వినడమే కాదు, పాడ్కాస్ట్ లను రూపొందించటం కూడా సులువే! [8]

పరిశ్రమ మార్చు

  • పాడ్కాస్ట్ లలో వాణిజ్య ప్రకటనలకు అవకాశం ఉండటం తో పలు సంస్థలు పాడ్కాస్టింగ్ కు శిక్షణ ఏర్పాటు చేయటం కృత్రిమ మేధస్సు ను ఉపయోగించి పాడ్కాస్ట్ వర్గాన్ని బట్టి, శ్రోతలను ఆకట్టుకునే వాణిజ్య ప్రకటానలు వినిపించటం చేస్తున్నయి. [6]

మూలాలు మార్చు

  1. "Meaning of podcast in English". dictionary.cambridge.org. Cambrdige University. Retrieved 4 July 2021.
  2. "Definition of'podcast'". collinsdictionary.com. Collins. Retrieved 4 July 2021.
  3. "Definition of podcast noun from the Oxford Advanced Learner's Dictionary". oxfordlearnersdictionaries.com. Oxford Learner's Dictionaries. Retrieved 4 July 2021.
  4. "Meaning of podcast noun from the Merriam Webster". merriam-webster.com. Merriam Webster. Retrieved 4 July 2021.
  5. 5.0 5.1 5.2 "Why Are Podcasts Gaining In Popularity?". forbes.com. Forbes. 12 October 2018. Retrieved 4 July 2021.
  6. 6.0 6.1 6.2 "Podcasts see an uptick in listenership but are advertising following the listeners?". businessinsider.in. Business Insider. 24 March 2021. Retrieved 5 July 2021.
  7. "Leo Laporte wants to rebrand podcasts as 'netcasts' - I agree". Engadget (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-09-30.
  8. 8.0 8.1 8.2 8.3 "'Intimacy plus': Is that what makes podcasts so popular?". bbc.com. BBC. 21 December 2018. Retrieved 4 July 2021.