సర్పగంధ
(పాతాళ గరిడి నుండి దారిమార్పు చెందింది)
సర్పగంధ లేదా పాతాళ గరిడి ఒక విధమైన ఔషధ మొక్క. దీని వృక్షశాస్త్రం పేరు రవుల్ఫియా సర్పెంటినా.
సర్పగంధ" Rauvolfia serpentina | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | R. serpentina
|
Binomial name | |
Rauvolfia serpentina |
సర్పగంథ ఒక చిన్న మొక్క. దీని వేర్లు ఔషధ గుణాన్ని కలిగి ఉంటాయి. 3,4 సంవత్సరాల వయసున్న మొక్క వేర్లలో ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయి. సర్పగంధ ప్రాథమికంగా భారతదేశానికి చెందిన ఔషధమొక్క పుల్‌ఫియా అనే జర్మన్ శాస్త్రవేత్త పేరు మీదుగా దీనికి శాస్త్రీయనామం వచ్చింది. భారతీయ వైద్యంలో దీని ప్రాశత్యం ఎంతో ఉంది. పాముని పోలిన వేర్లు ఉండటం వలన దీనికి ఆ పేరు వచ్చింది. అంతే కాకుండా పాముకాటుకి విరుగుడుగా వాడటం వలనకూడా దీనిని ఆ పేరుతో పిలుస్తుంటారు. కలకత్తాకి చెందిన గణవతి సేన్, చంద్రబోస్ అనే ఇద్దరు డాక్టర్లు ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాన్ని ఆధునిక వైద్యానికి పరిచయం చేశారు. దీని వేరులో ఉండే "సర్పెంటైన్" అనే ఆల్కలాయిడ్ ని అధిక రక్తపోటులో అల్లోపతి వైద్యులు వాడేవారు.
ప్రాంతీయ నామాలు
మార్చు- కన్నడ : సూత్రనాభి
- తమిళం : సర్పగంటి
- మలయాళం : అమల్‌పొరి
- హిందీ : కంద్రభాగ
లక్షణాలు
మార్చు- సర్పగంధ నిటారుగా పేరిగే బహువార్షిక పొద. ఇది సుమారు 75 సెం.మీ. నుండి ఒక మీటరు వరకు పెరుగుతుంది.
- దుంపల వంతి వేర్లు నేలలో శాఖోపశాఖలుగా 0.5 నుండి 2.5 మీటర్ల వ్యాసార్ధం వరకు విస్తరించి వుంటాయి. ఇవి నేలలోపల 40-60 సెం.మీ. లోతు వరకు చొచ్చుకొనిపోతాయి. వేర్లలో క్షారగుణం అధికంగా వుంటుంది.
ఉపయోగాలు
మార్చు- గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో ప్రసవం సులభంగా జరగడానికి దీనిని వాదాతారు.
- మానసిక అసమతుల్యాన్ని ఇది చక్కగా తగ్గిస్తుంది. దీనినే హిందీలో "పాగల్ కీ దవా" అని పిలుస్తారు. సర్పగంథ వేర్ల పౌడర్ 1 గ్రాము గ్లాస్ మేకపాలలో పంచదారతొ కలిపి తీసుకుంటే మానసిక స్థితి మామూలుగా వస్తుంది. మరీ పిచ్చిపట్టినట్లు ప్రవర్తించే వాళ్ళకు, హిస్టీరియాతో బాధపడే వాళ్ళకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
- నిద్రపట్టని వారికి సర్పగంధ బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే నిద్రపట్టించే గుణం వుండటం దీనికి కారణం . బీహారలో పిల్లలు ఏడవకుండా ఉండడానికి దీనిని వాడి నిద్రపుచ్చుతారు.
- సర్పగంధ వేరు విరేచనకారిగా, ఉష్ణజననిగా, మూత్రబంధ నివారిణిగా పనిచేస్తుంది. వీటికి మత్తు కలిగించే గుణం ఉన్నాట్లు పరిశోధనల్లో తేలింది.
- రక్తపోటు నివారణకు ఇది దివ్యౌషధం.
- జ్వరం, గాయాలు, శూలనొప్పి, నిద్రలేమి, మూర్ఛ, తలతిరగడం, అజీర్తి వంటి వాధలనుంచి ఉపశమనం కలిగిస్తుంది.
- దీని వేరును నూరి డికాక్షన్ చేసుకొని తాగితే గర్భాశయ వ్యాధలను నివారిస్తుంది.
- దీని ఆకుల రసాన్ని సేవించడం వల్ల కళ్ల మసక దూరమౌతుంది.
మూలాలు
మార్చు- ↑ "Module 11: Ayurvedic". Archived from the original on 2007-12-14. Retrieved 2008-02-11.