పాన్ బజార్ (హైదరాబాదు)

తెలంగాణ రాష్ట్రం, సికింద్రాబాదులో ఉన్న ఒక ప్రాంతం

పాన్ బజార్, తెలంగాణ రాష్ట్రం, సికింద్రాబాదు 'జేమ్స్ స్ట్రీట్' సమీపంలో ఉన్న ఒక ప్రాంతం. ఇది నగర నివాస, వాణిజ్య ప్రాంతంగా ఉంది.[1]

పాన్ బజార్
పట్టణప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
500003
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

సమీప ప్రాంతాలు

మార్చు

పాత గుడి, బోలారం నగర్, రాణిగంజ్, కర్బలా మైదాన్, ఓల్డ్ బోయిగూడ మొదలైన ప్రాంతాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.[2]

వాణిజ్యం

మార్చు

ఇక్కడ హోల్‌సేల్ బట్టల వ్యాపారులు, బంగారం వ్యాపారులు, హార్డ్‌వేర్ పరికరాల దుకాణాలు, స్టీల్ వస్తువుల దుకాణాలు, రవాణా సంస్థలతో కూడిన అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి.

రవాణా

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో పాన్ బజార్ నుండి నగరంలోని బాపూ ఘాట్, టోలీచౌకి, జిప్రా, ఫలక్‌నుమా, సఫిల్‌గూడమెహదీపట్నం, లాలాగూడ, సికింద్రాబాద్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషను, సికింద్రాబాద్ రైల్వే స్టేషను ఉన్నాయి.[3]

ప్రార్థనా మందిరాలు

మార్చు
  • ఆర్యసమాజ్ మందిరం
  • స్వామినారాయణ దేవాలయం
  • హనుమాన్ దేవాలయం
  • సాయిబాబా దేవాలయం
  • మస్జిద్-ఎ-సికందర్
  • మస్జిద్-ఇ-సయ్యద్ వలీ

విద్యాసంస్థలు

మార్చు
  • జాహ్నవి జూనియర్ & డిగ్రీ కళాశాల
  • జైన్ ఇంటర్నేషనల్ స్కూల్
  • సెయింట్ జోసెఫ్ స్కూల్
  • బి.ఆర్.జె.సి. పార్సీ ఉన్నత పాఠశాల

మూలాలు

మార్చు
  1. Pan bazar pincode
  2. "Pan Bazar, Old Gudi, Old Bhoiguda Locality". www.onefivenine.com. Archived from the original on 2022-10-31. Retrieved 2022-10-31.
  3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-10-31.